బ్లాగర్ల ఐడియాతో జీవనికి సొంత బస్సు

ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఒక స్నేహితుడు / రాలు ఉంటారు. వారు లేకపోతే జీవితంలోనే వెలితి అనిపిస్తుంది. మరి జీవనికి జీవని పిల్లలకు ఆ వెలితిని తీరుస్తున్నది బ్లాగర్లు. జీవని సోషల్ మీడియా ప్రస్థానం  ప్రారంభం అయింది బ్లాగులతోనే. ఎందరో సహ్రుదయులు అడుగడుగునా సహకారం ఇచ్చారు, ఇస్తున్నారు. జీవనికి ఆర్థికంగా పిల్లలకు ఆత్మీయంగా మద్దతు ఇస్తున్నారు. గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ఏటా పిల్లలను పలకరిస్తున్నారు బ్లాగు అన్నలూ అక్కలూ. పిల్లల సంతోషాన్ని గ్రాఫ్ లా గీస్తే all time high point తప్పకుండా బ్లాగర్లతో గడిపిన క్షణాలే అయి ఉంటాయి.  అలా వారితో అనుబంధం పెనవేసుకు పోయింది. జీవనికి ఆర్థికంగా సహాయపడాలన్న తపనతో గత ఫిబ్రవరిలో హృదయ స్పందన కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.  ఇందుకోసం తమ బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టారు. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్ గార్లు రూపకర్తలు కాగా సురేష్ పెద్దరాజు, Kvk కుమార్, నాగార్జున చారి  గార్లు సహకారం అందించారు. వీరంతా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పరోక్షంగా మరెందరో సహాయ పడ్డారు.  ఆ కార్యక్రమం ద్వారా సమకూరిన డబ్బుతో కొద్ది రోజుల కిందట బస్సు కొన్నాము. దీనిని  జీవని విద్యాలయానికి ఉపయోగిస్తున్నాం. వారికి ధన్యవాదాలు చెప్పినా ఇంకేం చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం బ్లాగుల మీద ఆసక్తి తగ్గి అందరూ facebook కు వచ్చేశారు.
బ్లాగు అన్నయ్యలు, అక్కయ్యలతో పాటు జీవనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పిల్లల తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు.

Pics : బ్లాగర్లు జీవనికి వచ్చిన సందర్భాలు.













No comments:

Post a Comment