ఎత్తైన భవనాలు, చిన్న మనసులు....విశాలమైన దారులు, సంకుచితమైన స్వభావాలు... ఖర్చు ఘనం, తృప్తి స్వల్పం... ఎక్కువ వస్తువులు, తక్కువ ఆనందం... ఆస్తులు పెరుగుతున్నాయ్ , విలువలు తగ్గుతున్నాయ్... ప్రేమించే మనసు మోడువారింది. పర నిందకు సిధ్ధంగా ఉంటాం. ఎలా బతకాలో తెలుసు కాని నిండుగా బతకలేక పోతున్నాం... చందమామను అందుకుంటాం మన పొరుగు వారి హీన స్థితిని పట్టించుకోం... నాలుగు చేతులా సంపాదిస్తాం... సంపాదిస్తాం... సంపాదిస్తూనే ఉంటాం... వయసు పరిగెడుతూనే ఉంటుంది... వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో మినుకు మినుకు మంటూ మనం చేసిన మంచి పనులు కనపడుతూ ఉంటాయి... జీవితం ప్రతి క్షణం అసంతృప్తి అసంతృప్తి...
మిత్రులారా ! మరి ఏమిటీ జీవితం ? దీనికో అర్థం ఉందా? చివరకు మిగిలేది ఏమిటి?
ఖచ్చితంగా ఏమిలేదు...... మనం చేసే సేవ తప్ప .... గోడల మీద కోటీశ్వరుల చిత్రపటాలు మనకు కనిపించవ్... ప్రపంచానికే అమ్మ లాంటి మదర్ తెరెసా బొమ్మ మాత్రమే కనబడుతుంది... సేవ మాత్రమే మనకు చివరగా తృప్తినిస్తుంది... చనిపోయే చివరి క్షణాల్లో... ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పే ఆఖరు నిముషాల్లో మనకు ఆనందం కలిగించేది... సేవ మాత్రమే... మన వారసత్వం మనం చేసి వెళ్ళే మంచి పనులు మాత్రమే... మరి సేవా ప్రపంచం లోకి అడుగు పెట్టడానికి మీరు సిద్ధమా ????
ఐతే రండి చేతులు కలుపుదాం...... join hands with.....
JEEVANI
..... FOR UNCARED.
kathasv@gmail.com
on