మిత్రులారా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ బెంగుళూర్ సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ గారు డిస్చార్జ్ అయ్యారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అనగానే మన బ్లాగర్లు చక్కగా స్పందించారు. పది యూనిట్లు బ్లాగర్ల తరఫున వచ్చాయి. వారి సహృదయతకు మరో మారు ధన్యవాదాలు. రమ గారు కోలుకున్నారు. తిరిగి పరీక్షలు వగైరాలు మామూలే. ఆమె ఇల్లు చేరుకున్నారు.
ప్ర.పీ.స.స. బ్లాగులో 10 రోజులపాటు రక్తం యూనిట్ అవసరంపై టపా పెట్టిన కార్తీక్ కు, తాడిపత్రిలో ఉన్నా వెంటనే స్పందించి రక్తదాతను పంపిన విజయమోహన్ ఇంకా సందీప్, దిలీప్ రెడ్డి తదితర మిత్రులకు రమ గారి తరఫున జీవని తరఫున కృతఙ్ఞతలు.
మిత్రులారా రమ అనే ఆవిడ ల్యుకేమియాతో బాధపడుతున్న విషయం ఇంతకుముందు పోస్టులో తెలిపాము. ఆమె సెయింట్జాన్స్ ఆస్పత్రి, బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అని చెప్పగానే బ్లాగర్ల తరఫు నుంచి 10 మంది స్పందించి రక్తదానం చేశారు. ఆమె ప్రస్తుతం బాగా కోలుకున్నారు పరిస్థితి ఇంకొంచెం మెరుగు పడితే ఓ 10 రోజులకు డిస్చార్జ్ కావచ్చని డాక్టర్లు తెలిపారు. కేన్సర్ కణాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిందని వాళ్ళు చెప్పారు. కానీ రక్తం యూనిట్లు మాత్రం ఇంకా అవసరం అవుతున్నాయి, కాబట్టి మిత్రులు ఎవరైనా వుంటే మొబిలైజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. రక్తదాతలు 9590840764 ( మహేష్ )ను కాంటాక్ట్ చేయవలసిందిగా మనవి.