నిన్న శివరాత్రి సందర్భంగా పిల్లల్ని చిన్న ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళాము. మొదట బుక్కరాయసముద్రం కొండ. కిందనుంచి కొండమీదకు ఒక కిలోమీటరు మేర మెట్లు ఉంటాయి. పెద్దలకు ఎక్సర్ సైజు... పిల్లలకు ఉత్సాహం. కొండమీద వెంకటేశ్వర స్వామిని కొండమీద రాయుడు అంటారు. 




 తర్వాత ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము.






శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి బస్సులో వెళ్ళాము. ఇందుకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. 

Read More



ఈ మధ్యే వివాహం జరుపుకున్న ఇద్దరు బ్లాగర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి మిత్రులు, శ్రేయోభిలాషులు జీవనికి 5000/- విరాళం అందించారు. కొత్త దంపతులను దేవుడు చల్లగా చూడాలని, వారి జీవన యానం  సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సాగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. 



Read More


కాకినాడలో ఉంటున్న శ్రీ విశ్వనాధ సూర్యనారాయణ మరియు శ్రీమతి విశ్వనాధ సుభద్రా మహాలక్ష్మి గార్లు బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. వారి కుమారుడు చంద్రశేఖర్ గారు నెలనెలా 1000/- విరాళం ఇస్తున్నారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



Read More



అనంతపురంలో ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మంచిపేరు తెచ్చుకున్న స్కూల్ AFFLATUS GLOBAL SCHOOL (AGS). ప్రిన్సిపల్ సాల్మన్ రాజు విలువలతో కూడిన చదువును, ఒత్తిడిలేని విద్యను అందించడానికి కృషిచేస్తున్నారు. SRINIVSA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY ( SRIT ) లాగా AGS కూడా జీవనికి నైతిక ఆర్థిక మద్దతు ఇస్తోంది. సామాజిక సేవపై పిల్లలకు అవగాహన కల్పించడానికి పిల్లలు మొత్తం ఒకసారి జీవనిని సందర్శించారు. ఆ పిల్లలు అదే స్ఫూర్తితో తమ కిడ్డీ బ్యాంక్ లోని డబ్బును, పుట్టినరోజు సందర్భగాను విరాళం ఇస్తూ వచ్చారు. ఆరవ తరగతి పిల్లలు తమ క్లాస్ తరఫున 5400/- విరాళం అందించారు. చిన్నారులకు ధన్యవాదాలు అలాగే వారి కుటుంబసభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లల్ని ఇందుకు ప్రోత్సహించిన క్లాస్ టీచర్ సలోమి గారికి, ప్రిన్సిపాల్ సాల్మన్ గారికి జీవని పిల్లల తరఫున కృతఙ్ఞతలు. 

AGS children at JEEVANI


 


 Learning by doing.... AGS core philosophy...






Read More


టోక్యోలో ఉంటున్న శ్రీ విశ్వనాథన్ చంద్రశేఖర్ మరియు వారి కుటుంబసభ్యులు బాలికల డార్మిటరీకి 10,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.





file photo: TV anchor chitra lekha appreciating JEEVANI child shiva's dance performance at SRIT annual day celebrations, last year.


Read More

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్న పి.సంధ్య ( శ్రీ.రామాంజనేయ రెడ్డి, శ్రీమతి జయలక్ష్మి గార్ల కుమార్తె ) జీవనికి 5000/- విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


Read More


ఆస్టిన్లో ఉంటున్న శ్రీ. రమేష్ రెడ్డి సోమగట్టు గారు 30,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


వీరికి జీవనిని పరిచయం చేసిన  Dr.ISMAIL  SUHAIL PENUKONDA https://www.facebook.com/drpen గారికి ప్రత్యేక ధన్యవాదాలు.


Read More



అనంతపురం ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహ మరియు శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు తమ కుమారుడు హిమవర్ష్ పుట్టినరోజు సందర్భంగా జీవనికి 25,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు. నరసింహ గారి కుటుంబ సభ్యులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



Read More



జీవనికి గత రెండేళ్ళుగా అర్థికంగా, నైతికంగా మద్దతు ఇస్తున్నారు అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ ( ABC Trust ) వారు.
వారికి జీవనిని పరిచయం చేసింది ఈ శ్రేయోభిలాషే. ఆయన వివాహం రేపు. ఈ సందర్భంగా ABC Trust 6000/- విరాళం అందించింది. నూతన వధూవరుల జీవన యానం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సాగిపోవాలని పిల్లల తరఫున దేవుని ప్రార్థిస్తున్నాము.  

Read More



తమ కుమారుడు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి మరియు శ్రీమతి ఉదయ రెడ్డి దంపతులు జీవనికి 5000/- విరాళం అందించారు ఇందుకు నవీన్ కుమార్ రెడ్డి, పుల్లా రెడ్డి ( శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల) పోతిరెడ్డి గార్లు సహకరించారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

 


Read More



పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీ స్వరాజ్ మరియు శ్రీమతి రమ్య గార్ల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా వారు జీవని పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వారికి వారి కుటుంబానికి అంతా శుభం కలగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. ఇందుకు సహకరించిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారికి మరియు గిరి నర్రా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




Read More




గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న అనంతపురంలోని రిజిస్టర్డ్ చిట్ ఫండ్ సంస్థలు జీవనికి 30,000/- విలువ చేసే 10 క్వింటాళ్ళ బియ్యం విరాళంగా ఇచ్చాయి. కపిల్ చిట్స్, సాయి భావన, చెరిష్, మణిక్రిష్ణ, వజ్రగిరి, ధీమా, సంపదైశ్వర్య,శక్తిస్వరూప్, శ్రీరాం రాఘవేంద్ర, సునేత్ర, శుభసంపద, పరమేశ్వరి, ఖాద్రివాసి, చలపతి, మార్గబంధు, శివకామేశ్వరి చిట్ ఫండ్ సంస్థలు ఈ విరాళం అందజేసాయి. వాటి ప్రతినిధులు దివాకర్ రెడ్డి, గుప్త, మల్లిఖార్జున, సుభాన్, రమేష్, అస్లం, మధు గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఆగస్టు 15కు, జనవరి 26కు చిట్ ఫండ్ సంస్థలు బియ్యం విరాళంగా ఇస్తున్నాయి. వీరందరికీ జీవనిని పరిచయం చేసి విరాళం అందించడంలో సహకరించే చిలుకూరు కుమారస్వామి రెడ్డి గారికి ( అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్స్, అనంతపురం జిల్లా ) ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి విషయంలోనూ మేధోపరంగా మమ్మల్ని నడిపించే కుమార్ అన్నకు ధన్యవాదాలు చెప్పడం తప్పే అవుతుంది. ఎందుకంటే జీవనిలో ఆయన కూడా ప్రధాన పాత్రధారి కాబట్టి.






 

Read More


పిట్స్ బర్గ్ లో ఉంటున్న చిన్నారి దక్ష్ పుట్టినరోజు సందర్భంగా అమ్మానాన్న గుంజన్ ఖన్నా మరియు సోనియా చౌదరి గార్లు జీవనికి విరాళం అందించారు. దక్ష్ కు జన్మదిన శుభాకాంక్షలు. వీరికి జీవనిని పరిచయం చేసి, విరాళం అందేలా చేసిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.   









Read More


వర్ధు వెంకటేశ్వర్లు గారు జీవనికి 6200/- విరాళం అందించారు. వారు బెంగళూరులో అసోసియేట్ కన్సల్టెంట్ గా క్యాప్ జెమినిలో పనిచేస్తున్నారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

for daily balance sheet pl visit  http://www.jeevanianantapur.com/dailybalance.php

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo