1) రోజుకు 10- 30 నిమిషాల నడక, నవ్వుతూ నడవాలి.
2) రోజులో కనీసం పది నిమిషాలు మౌనంగా, ప్రశాంతంగా గడపండి.
3) పొద్దున లేస్తూనే ఈ వాక్యం పూర్తి చేయండి " ఈ రోజు నా కర్తవ్యాలు ...... "
4) 3 E's ENERGY, ENTHUSIASM, EMPATHY.... 3 F's FAITH, FAMILY, FRIENDS.... తో జీవించండి.
5) 70 ఏళ్ల పైన ఉన్న ముసలివాళ్లతోను, ఆరేళ్ల లోపు పిల్లలతోనూ అపుడపుడు ఎక్కువ సేపు గడపండి.
6) రోజుకు కనీసం ఐదుగురిని నవ్వించే ప్రయత్నం చేయండి.
7) చెరగని చిరునవ్వు అలవాటు చేసుకోండి, మీలో శక్తి పెరుగుతుంటుంది, అదే సమయంలో మనమంటే గిట్టనివారు అసలుoడరు.
8) మన జీవితం ఎంతో గొప్పగా లేకపోవచ్చు కానీ కొంతైనా ఆనందంగా ఉంది కదా!
9) జీవితం చాలా చిన్నది అనవసరంగా ఇతరులను అసహ్యించుకోవడం మానివేయండి.
10) ఎదుటివారు చిన్న తప్పులు చేసినపుడు క్షమించే ప్రయత్నం చేయండి.
11) ఇతరులు మన గురించి ఏమి అనుకుంటున్నారో అనే భావన వదిలేయాలి. అది వారి సమస్య మనది కాదు.
Join hands with...
JEEVANI
......FOR UNCARED
మిత్రులారా జీవని రిజిస్ట్రేషన్ పూర్తయింది. నెంబరు 14/ 2009. జీవని అనాధ పిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇస్తుంది. అంత కంటే ముఖ్యంగా వారితొ చాలా తరచుగా దాతలను కలుపుతూ పిల్లల్లో ఆత్మన్యూనతను పోగొట్టడం మానవ సంబంధాలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యాలు. వచ్చే నెల మొదటి నుంచి పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Join hands with...
JEEVANI
......FOR UNCARED
బీడు వారిన భూములు...
మోడువారిన జీవితాలు...
ఒక్క వాన చుక్క లేకపోయినా తాగడానికి పురుగుల మందు ఉంది
మునగడానికి వ్యవసాయం ఎటూ ఉంది...
దరిద్రమైన నికృష్టమైన జీవితాలకు నిలువుటద్దాలు అనంతపురంలోని పల్లెలు ( అయిదు సంవత్సరాల కిందట... వర్షాలులేక పల్లెతల్లి అలమటించింది. ఇపుడు పరిస్థితి ఫర్వాలేదు).
అలాంటి పల్లెవాసుల కళ్ళ వెలుగు ఫాదర్ ఫెర్రర్. ఎక్కడో స్పెయిన్లో పుట్టి ఈ అనంతపురం పల్లె ప్రజల జీవితాల్లో వెలుగునింపిన మహనీయుడు ఆయన.
రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ ఈ జిల్లాలో ఒక సమాంతర వ్యవస్థ.
విద్య -- మారు మూల పల్లెల్లో పాఠశాలలున్నాయి, లక్షలాది రూపాయల ఖర్చుతో పెద్ద పాఠశాలల నిర్మాణం. మానసిక, సారీరక వికలాంగులకు ప్రత్యెక బడులు.
వైద్యం --- అతి తక్కువ ఖర్చుతో వైద్యం, కుటుంబ నియంత్రణకు ప్రత్యెక ప్రోత్సాహకాలు...
నీడ --- పల్లెల్లో అత్యంత నాణ్యమైన ఇళ్ళ నిర్మాణం. చివరన తాళం కూడా వాళ్ళే ఇస్తారు.
ఉపాధి--- వేలాది మందికి ఉద్యోగాలు కల్పన.
మరి ఈ జిల్లాకు ఇదంతా అమృతవర్షం కాదా?
పర్యావరణం ఇంకా నాకు తెలియని అనేక రంగాల్లో కూడా ఈ సంస్థ పని చేస్తోంది.
మన దేశంలో భారత రత్న లాగస్పెయిన్, ఫెర్రర్ కు అత్యున్నత పురస్కారం నిన్న అందజేసింది. ఆయన ఆరోగ్య రీత్య వెళ్ళలేక పోయారు. అందుకోసంస్పెయిన్ ప్రభుత్వం వైస్ ప్రెసిడెంట్ తో పురస్కారాన్ని పంపింది ( ఆ దేశం నమ్రతకు కూడా జేజేలు) . పురస్కారాలతోఆయన్ని వెలకట్టలేము. ఈ అనంతపురం గడ్డ మీద పుట్టి ప్రజల రక్త మాంసాల తో సహా పీక్కు తింటున్న ఎందఱోరాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కడినించో వచ్చి పాతికేళ్ళుగా అకుంఠిత దీక్షతో సేవ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నఆయనను మనిషి అని ఎలా అనాలి? దేవుడు కూడా సరైన పదం కాదేమో! ఎందుకంటే నాకు కనిపించని ఆదేవుడు అనే వాడు నాకుతెలిసింత వరకు ఎక్కడా విద్య వైద్యం నీడ కల్పించి ప్రజలను భౌతికంగా ఏనాడు ఆదుకోలేదు.
గమనిక: మొదట ఆయన మహారాష్ట్ర లో సేవలు మొదలు పెట్టారు. అక్కడ ఫెర్రర్ సేవకు మతం రంగు పూసారు . అప్పుడేఆయన క్రైస్తవ సభ్యత్వాన్ని శాస్వతంగా రద్దు చేసుకున్నారు. ఇపుడు ఆయనకు ఏ మతము లేదు "మానవత్వం " తప్ప...
దయచేసి జీవని పూర్తి పోస్టింగులను చదవండి.
Join hands with...
JEEVANI
......FOR UNCARED