బీడు వారిన భూములు...
మోడువారిన జీవితాలు...
ఒక్క వాన చుక్క లేకపోయినా
తాగడానికి పురుగుల మందు ఉంది
మునగడానికి వ్యవసాయం ఎటూ ఉంది...
దరిద్రమైన నికృష్టమైన జీవితాలకు నిలువుటద్దాలు అనంతపురంలోని పల్లెలు ( అయిదు సంవత్సరాల కిందట... వర్షాలులేక పల్లెతల్లి అలమటించింది. ఇపుడు పరిస్థితి ఫర్వాలేదు).

అలాంటి పల్లెవాసుల కళ్ళ వెలుగు ఫాదర్ ఫెర్రర్. ఎక్కడో స్పెయిన్లో పుట్టి ఈ అనంతపురం పల్లె ప్రజల జీవితాల్లో వెలుగునింపిన మహనీయుడు ఆయన.



రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ ఈ జిల్లాలో ఒక సమాంతర వ్యవస్థ.
విద్య -- మారు మూల పల్లెల్లో పాఠశాలలున్నాయి, లక్షలాది రూపాయల ఖర్చుతో పెద్ద పాఠశాలల నిర్మాణం. మానసిక, సారీరక వికలాంగులకు ప్రత్యెక బడులు.
వైద్యం --- అతి తక్కువ ఖర్చుతో వైద్యం, కుటుంబ నియంత్రణకు ప్రత్యెక ప్రోత్సాహకాలు...
నీడ --- పల్లెల్లో అత్యంత నాణ్యమైన ఇళ్ళ నిర్మాణం. చివరన తాళం కూడా వాళ్ళే ఇస్తారు.
ఉపాధి--- వేలాది మం
దికి ఉద్యోగాలు కల్పన.
మరి ఈ జిల్లాకు ఇదంతా అమృతవర్షం కాదా?
పర్యావరణం ఇంకా నాకు తెలియని అనేక రంగాల్లో కూడా ఈ సంస్థ పని చేస్తోంది.







మన దేశంలో భారత రత్న లాగస్పెయిన్, ఫెర్రర్ కు అత్యున్నత పురస్కారం నిన్న అందజేసింది. ఆయన ఆరోగ్య రీత్య వెళ్ళలేక పోయారు. అందుకోసంస్పెయిన్ ప్రభుత్వం వైస్ ప్రెసిడెంట్ తో పురస్కారాన్ని పంపింది ( దేశం నమ్రతకు కూడా జేజేలు) . పురస్కారాలతోఆయన్ని వెలకట్టలేము. అనంతపురం గడ్డ మీద పుట్టి ప్రజల రక్త మాంసాల తో సహా పీక్కు తింటున్న ఎందఱోరాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కడినించో వచ్చి పాతికేళ్ళుగా అకుంఠిత దీక్షతో సేవ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నఆయనను మనిషి అని ఎలా అనాలి? దేవుడు కూడా సరైన పదం కాదేమో! ఎందుకంటే నాకు కనిపించని ఆదేవుడు అనే వాడు నాకుతెలిసింత వరకు ఎక్కడా విద్య వైద్యం నీడ కల్పించి ప్రజలను భౌతికంగా ఏనాడు ఆదుకోలేదు.
గమనిక: మొదట ఆయన మహారాష్ట్ర లో సేవలు మొదలు పెట్టారు. అక్కడ ఫెర్రర్ సేవకు మతం రంగు పూసారు . అప్పుడేఆయన క్రైస్తవ సభ్యత్వాన్ని శాస్వతంగా రద్దు చేసుకున్నారు. ఇపుడు ఆయనకు మతము లేదు "మానవత్వం "
తప్ప...




దయచేసి జీవని పూర్తి పోస్టింగులను చదవండి.

Join hands with...

JEEVANI
......FOR UNCARED

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. WOW!!!!!! amazingggg

     
  3. RDT వాళ్ళు మా తాడిపత్రిలో మరో ఆసుపత్రి కట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని విన్నాను

     
  4. jeevani Says:
  5. విజయమోహన్ గారు, తాడిపత్రి లో ఆసుపత్రి విషయం నేను వినలేదు.

     
  6. RDT వాళ్ళు అనంతపురానికి ఎంతో సేవ చేస్తున్నారు. నిజంగా ఆయన దేవుడులాంటి వాడే.

    విజయమోహన్ గారు నిజమేనా! నేను కూడా వినలేదు.

     
  7. download Says:
  8. thank you sir sjohan mylarmpalli uravakonda anantapur

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo