సరదాకి మాత్రమే. ఎవరి మనోభావాలు కించపర్చడానికి కాదు.



Read More






శ్రీ పి. రత్నం గారు

ప్రొప్రైటర్: శ్రీ సాయి రాఘవేంద్ర మెడికల్ ఏజెన్సీస్, శ్రీనివాస నగర్, అనంతపురం

జీవని విద్యాలయానికి 30,000/- విరాళం ఇచ్చారు.


జీవని తరఫున వారికి ధన్యవాదాలు.




Read More




మిత్రులారా నెగటివ్ రక్త గ్రూపులు దొరకడం చాలా ఇబ్బంది అన్న విషయం మనకు తెలుసు. బెంగలూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న సురేష్ అనే అబ్బాయికి A- రక్తం ఎక్కించాల్సి ఉంది. దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవంది. లేదంటే మీ మిత్రులకు మెసేజీ ఒకటి తయారు చేసి ఫార్వర్డ్ చేయించండి. మీ చిన్న ప్రయత్నం ఆ అబ్బాయి ప్రాణం నిలుపుతుంది. ప్లీజ్....



ఫోన్ నెంబర్లు: 09986343426, 09493366091

Read More



విద్యలో అనంతపురానికి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన కొడిగెనహళ్ళి పాఠశాల పూర్వ విద్యార్థులు ఈ నెల సమావేశం అవుతున్నారు. పూర్తి వివరాలు.....



hi .......

"........WANNA GO BACK TO SCHOOL DAYS.......THEN COME BACK TO SCHOOL ON 27th FEB......."
Greetings to all brothers,
We are very happy to inform you that some of us(of 1987,89,90,91and93 baches) met yesterday in hyderabad and planned for a REUNION at school premises on 27th of feb'2010 and felicitation to Sri.K.Sathyanarayan a Garu present principal on 28th(sunday) of feb,2010 on the occation of his retirement.( 28 th programme is OPTIONAL, INTRESTED ONLY CAN ATTEND. REST CAN LEAVE BY 27th NIGHT)
Reunions are not new for us, kodis are meeting occationally, but all the meets were confined to just one or two batches most of which were not in the school premises.Everyone might be very happy in sharing memories with their classmates.To make the meets more lively and useful to the school
we got a thought of having a very special get togetherof all annalu & thammullu of all batches in the school premises sothat we may rejoice with our beloved family and make the meet much more significant.
Immedietly we shared the same with the kodis available, and got a very good response.
And after a discussion for about 2 hrs we've arrived at this tentative plan...which can be changed according to your valube suggetions
Day one, 27th feb 2010 Saturday
7.30a.m-12.00 noon-------MEDICAL CAMP
12.00-1.00P.. p.m------ ----LUNCH AT SCHOOL DINING HALL
1.00p.m-2.00p. m-------- -VISITING THE ENTIRE CAMPUS
2.00p.m-6.00p. m-------- -MEETING
a.Teachers will adress the gathering
b.Selected alumni members will adress the students(profession als in career counselling, motivation and inspiring talks are requested to come forward and give their consent to this session as soon as possible)
c.Response by present students
*As the all events are going on feedback from students and staff will be collected by some of the alumni members, assessed by the all alumni and necessarry recommendations will be made to improve the quality of various aspects in school.
8.pm-------- --------- DINNER AT HINDUPUR
Accomodation will be arranged in Hindupur
THE MAIN INTENTION OF THE REUNION IS TO UPLIFT THE MORALE OF THE PRESENT STUDENTS INORDER TO BRING BACK THE GLORY OF OUR MOTHER SCHOOL..
------------ --------- --------- --------- --------- --------- --------- --------- --------- --------- --------- ----
Day two 28th feb 2010
9.00a.m ------------ -Inaguration of Gurukula kala thoranam
-Rest of the day is dedicated to Sri.Satyanarayana sir's felicitation
ATTENTION DOCTORS
We request all Doctors to parcipate in the Medical camp.Please give your consent and your requirements at the earliest.
*The above mentioned plan is just a proposal..any changes of any kind any magnitude can be made in the best intrest of the school and students
IMP NOTE: THIS IS PROGRAMME WILL BE CONDUCTED IN THE NAME OF OF APRSK ALUMNI,NOT BY ANY INDIVIDUALOR ANY PERTICULAR BATCH STUDENTS.... ........
we request interested guys to come forward to coordinate their batches.
those who are intrested pls give your acceptance through mail in three days.
YOURS
KODIS....... ......... ......... ....

9951123522

Read More






















Read More



రక్తదానం వల్ల చావు బతుకుల్లో ఉన్న వ్యక్తికి తిరిగి ప్రాణం పోసినట్లే. దాని విలువని మీకు మరీ చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా అందుకే జీవని బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభిస్తున్నాం. దీన్ని జె.బాబూరావ్ ( ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ) మరియు సోమశేఖర రెడ్డి ( అసిస్టెంట్ ప్రొఫెసర్ & NSS గైడ్, శ్రీనవాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల ) పర్యవేక్షిస్తుంటారు.

అవసరం అయినపుడు మాత్రమే దాతలను సంప్రదిస్తాము. కాబట్టి రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారు, పేరు, ఊరు , ఫోన్ నెంబరు, బ్లడ్ గ్రూప్ తెలియపర్చవలసిందిగా మనవి. ఎక్కడి వారైనా ఫర్వలేదు. అనంతపురం మాత్రమే అన్న పరిమితి లేదు.

అలాగే ఎవరికి రక్తం అవసరం పడినా దయచేసి జీవనిని సంప్రదించగలరు.


ఫోన్ : 9948271023
మెయిల్ : jeevani.sv@gmail.com

Read More


మిత్రులారా, మా బడిలో నలుగురు తల్లీదండ్రిలేని పిల్లలు ఉన్నారు.వారందరూ 1,2 తరగతులు. వారిని జీవనిలోకి ఎందుకు తీసుకోలేదంటే ప్రస్తుతం వారు ప్రభుత్వం నిర్వహించే బాలసదన్లో ఉంటున్నారు. వారిని తీసుకోవాలంటే ప్రభుత్వ లాంచనాలు ఉంటాయి, అలాగే సెలవుల్లో వారి రక్షణ ఒక ఇబ్బంది. జీవని విద్యాలయం మొదలయ్యాక వారిని అక్కడికి చేర్చాలన్నది నా ఆలోచన.



సరే మొన్న ఇద్దరు పిల్లలకు దుప్పట్లు తెచ్చి ఇచ్చాను. మరుసటిరోజు ప్రార్థన కాగానే నా క్లాస్లో ఉన్నాను. ఈ లోపు 2వ తరగతి పిల్లలు వచ్చి సార్ కమల ( పేరు మార్చాను ) ఏడుస్తోంది. మేడం కూడా ఏడుస్తున్నారు అని పిల్లలు చెప్పారు. నాకు అర్థం కాలేదు. మా 5 వ తరగతి పిల్లల్ను విషయం కనుక్కురమ్మని పంపాను.



విషయం ఏమంటే దుప్పట్లు తీసుకున్నందుకు హాస్టల్ వాచ్ విమెన్ కమలను చితకబాదింది. ఆ అమ్మాయి ఏడుస్తుంటే మా మేడం ఏడ్చేసింది. నిజానికి ఆ నలుగురు పిల్లల్ని మా స్టాఫ్ చాలా బాగా చూసుకుంటారు. బట్టలు, పుస్తకాలు, చిరు తిండ్లకు డబ్బులు... ఇలాంటి విషయాల్లో మిగతా పిల్లలతో పోల్చుకుని తమకు లోటు ఉందన్న సంగతి వారికి లేకుండా చూస్తాం. వారి క్లాస్ టీచర్ అయిన మేడం తో ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ వారికి ఉంది. దాంతో ఆమె తట్టుకోలేకపోయారు.



ఎందుకు కొట్టిందని అడిగితే బయట వాళ్ళు ఇచ్చేవి తీసుకోవద్దు, హాస్టల్ మేడం ( సూపరిండెంట్ ) చెప్పింది కదా? అయినా తీసుకుంటారా? తక్కువ అయితే మమ్మల్ని అడగాలి కానీ.. అని.



నేను హాస్టల్ వద్దకు వెళ్ళి అడిగితే ఆమె పిల్లల్ని కొట్టడం తన హక్కులా మాట్లాడింది. ఆ రోజు సోమవారం గ్రీవెన్స్ డే, అదే ఆవేశంలో వెళ్ళి కలెక్టరు గారికి ( కలెక్టరాఫీసు మాకు కూతవేటు దూరం ) ఫిర్యాదు చేయాలని అనుకున్నాను. ఆ వాచ్ విమెన్ పరిస్థితిని గురించి పిల్లల్ని అడిగాను. ఆమెకు భర్త చనిపోతే ఉద్యోగం ఇచ్చారు. నాకు ఆవేశం తగ్గింది.



హాస్టల్ సూపరిండెంట్ ఇక్కడ ఇంచార్జిగా పని చేస్తోంది. ఆమె అసలు ఉద్యోగం మరోచోట. దాంతో హాస్టల్ మీద పర్యవేక్షణ అసలు లేదు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే కలిశాను. ఫిర్యాదు చేశాను. మరోసారి ఇలా జరగనీయకుండా చూడాలని చెప్పాను. ఆమె తమకు సిబ్బంది కొరత వల్ల కింది స్థాయి ఉద్యోగులపై నియంత్రణ లేకుండా పోయిందని ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకండి అని సర్ది చెప్పింది.



తర్వాత స్కూల్ కు వచ్చాక వాచ్ విమెన్ అరాచకాలు పిల్లలు చెప్పారు. పిల్లలతో ఇంట్లో పనిచేయించడం, ఆమె కొడుక్కు సేవలు చేయించడం, పిల్లలకు ఎవరైనా స్వీట్లు, వస్తువులు ఇస్తే లాక్కోవడం లాంటివి చేస్తుందట. వీటిలో ఏది రిపీట్ చేసినా నాకు చెప్పండి అని పిల్లలకు ధైర్యం, ఐకమత్యం గురించి కొద్దిసేపు క్లాస్ ఇచ్చాను.



కొసమెరుపు ఏమంటే కమలతో పాటు మరో అమ్మాయికి కూడా దుప్పటి ఇచ్చాను కదా? కమల ఆ అమ్మాయికి సార్ ఇవ్వలేదు, నేనే ఇచ్చాను అని మొత్తం విషయాన్ని తన మీదే వేసుకుని తన స్నేహితురాలిని దెబ్బల్నుంచి రక్షించడం.



ఇలాంటి హింసల్ని భరిస్తూ పిల్లలు ఎదురీదడం ఎంత బాధ అనిపిస్తుంది? వచ్చే విద్యా సంవత్సరంలో నలుగురు పిల్లల్ని జీవనిలోకి తీసుకుంటాం అని హాస్టల్ సూపరిండెంట్ కు చెప్పాను.



అలాగే హాస్టళ్ళలో చిన్న పిల్లలపై హైస్కూల్ విద్యార్థుల ఆగడాలు ఇవన్నీ ఉంటాయి. ఒకటో తరగతి నుంచి కూడా ప్రతి క్లాసులోనూ ఒక దుండగ బ్యాచ్ ఉంటుంది. బలహీనులైన పిల్లల్ని ఏడిపిస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఈ వివరాలు అడిగి కనుక్కోవల్సిందిగా మీ అందర్నీ కోరుతున్నాను. పిల్లలు సాధారణంగా పోట్లాడుతుంటారు. అది మామూలే. కానీ టార్గెట్ చేసి ఏడ్పిస్తున్నపుడు పేరెంట్స్ తెలుసుకోవాలి. చిన్న విషయం అని వదిలేస్తే పిల్లలు మానసికంగా చిత్రహింస అనుభవిస్తుంటారు. చదువు సంగతి పక్కన్ బెడితే ముందు వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.



డైరెక్టుగా అడగకుండా మెల్లగా వివరాలు సేకరించండి. మీకు చెబితే రాద్ధాంతం అవుతుందని, అల్లరి పిల్లలు ఇంకా ఏడిపిస్తారని పిల్లలు భయపడతారు.



మీ అందరికీ క్లాస్ పీకానేమో మరి. మన నోటీస్ కు తక్కువగా వచ్చే హింస అని అనిపించి రాశాను.



Read More



జనవరి 26 న బ్రోచర్, వెబ్ సైట్ ఆవిష్కరణ తర్వాత శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల స్టాఫ్ విరాళాలు ప్రకటించారు. ప్రతి నెలా జీతంలో కొంత మొత్తం జీవనికి ఇస్తామన్నారు. మొదట ఒకరు ప్రారంభించగానే ఒక ఉప్పెనలా విరాళాలు ప్రకటించారు. విద్యార్థులు కూడా ప్రతి సెక్షన్ తరఫున నెలకు 1000/- ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మరికొందరు వ్యక్తిగతంగా మరికొంత ఇస్తామన్నారు. ఈ స్పందనకు మేము నిశ్చేష్టులయ్యాము. SRIT నుంచి జీవనికి ప్రతి నెలా 20,000/- అందనుంది. జీవని విద్యాలయం నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యాజమాన్యానికి, స్టాఫ్ కు, విద్యార్థులకు పేరు పేరునా జీవని తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మాలో కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని నింపింది. జీవని విద్యాలయం నిర్మాణం, నిర్వహణలపై ఉన్న భయాలు తొలగిపోయాయి. మనం తప్పకుండా సాధించగలం అన్న నమ్మకం కలిగింది.



విరాళం ప్రకటిస్తున్న విద్యార్థి.

విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కెమెరాలో బ్యాటరీ అయిపోయింది. అందుకే అందరి ఫోటోలు రావడం లేదు.








విరాళాలు ప్రకటిస్తున్నSRIT అధ్యాపక బృందం
























సాల్మన్ రాజు - జీవని ముఖ్య సలహాదారు











జీవని విద్యాలయానికి 2 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్న ప్రముఖ రచయిత శాంతి నారాయణ గారు






విరాళాల పూర్తి వివరాలను తర్వాతి టపాలో ఉంచుతాము. అలాగే వారి పేర్లు DONORS LISTలో చూడవచ్చు.



ధన్యవాదాలతో,
మీ,
జీవని.

Read More




మిత్రులారా ఈ కార్యక్రమం 26 వ తేదీన జరిగింది. అయితే కొన్ని సమస్యలవల్ల అప్పుడే బ్లాగులో ఉంచలేదు. ఇందుకు క్షమిస్తూ ముందుకు కదలమని మనవి.



అనంతపురానికి సమీపంలో ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ కార్యక్రమం జరిగింది. SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివా రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఇదే వేదిక మీద ప్రముఖ కథా రచయిత శాంతి నారాయణ గారు జీవని విద్యాలయానికి 2 లక్షల విరాళం ప్రకటించారు.




B. Tech II YEAR విద్యార్థులచే జీవని పిల్లలకు దుస్తులు పంపిణి

మధ్యలొ వెనుకవైపు వ్యక్తి కరస్పాండెంట్ సాంబశివా రెడ్డి













వెబ్సైట్ ప్రారంభిస్తున్న లావణ్య












పిల్లలచే జీవని విద్యాలయం బ్రోచర్ ఆవిష్కరణ








బ్రోచర్ అందుకుంటున్న సాంబశివారెడ్డి నాన్న గారు







పిల్లలచే బ్రోచర్ అందుకుంటున్న వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి గారు





పిల్లలచే బ్రోచర్ అందుకుంటున్న ప్రముఖ కథా రచయిత శాంతి నారాయణ గారు







ప్రముఖ కవి జూపల్లి ప్రేంచంద్ గారు






పిల్లలచే బ్రోచర్ అందుకుంటున్న ప్రిన్సిపాల్ రంగారెడ్డి గారు




ఆకాశవాణి అధికారి నాగేశ్వర రెడ్డి గారు





B. Tech II YEAR విద్యార్థులు జీవని పిల్లలకు దుస్తులు పంపిణి చేస్తున్న దృశ్యాలు.

























SRITలో విరాళాల బాక్సు ఏర్పాటు.











Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo