జనవరి 26 న బ్రోచర్, వెబ్ సైట్ ఆవిష్కరణ తర్వాత శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల స్టాఫ్ విరాళాలు ప్రకటించారు. ప్రతి నెలా జీతంలో కొంత మొత్తం జీవనికి ఇస్తామన్నారు. మొదట ఒకరు ప్రారంభించగానే ఒక ఉప్పెనలా విరాళాలు ప్రకటించారు. విద్యార్థులు కూడా ప్రతి సెక్షన్ తరఫున నెలకు 1000/- ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మరికొందరు వ్యక్తిగతంగా మరికొంత ఇస్తామన్నారు. ఈ స్పందనకు మేము నిశ్చేష్టులయ్యాము. SRIT నుంచి జీవనికి ప్రతి నెలా 20,000/- అందనుంది. జీవని విద్యాలయం నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యాజమాన్యానికి, స్టాఫ్ కు, విద్యార్థులకు పేరు పేరునా జీవని తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మాలో కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని నింపింది. జీవని విద్యాలయం నిర్మాణం, నిర్వహణలపై ఉన్న భయాలు తొలగిపోయాయి. మనం తప్పకుండా సాధించగలం అన్న నమ్మకం కలిగింది.



విరాళం ప్రకటిస్తున్న విద్యార్థి.

విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కెమెరాలో బ్యాటరీ అయిపోయింది. అందుకే అందరి ఫోటోలు రావడం లేదు.








విరాళాలు ప్రకటిస్తున్నSRIT అధ్యాపక బృందం
























సాల్మన్ రాజు - జీవని ముఖ్య సలహాదారు











జీవని విద్యాలయానికి 2 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్న ప్రముఖ రచయిత శాంతి నారాయణ గారు






విరాళాల పూర్తి వివరాలను తర్వాతి టపాలో ఉంచుతాము. అలాగే వారి పేర్లు DONORS LISTలో చూడవచ్చు.



ధన్యవాదాలతో,
మీ,
జీవని.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo