మిత్రులారా కిందటి వారంలో నా స్నేహితుడు ఆకెళ్ళ రాఘవేంద్ర అనంతపురం వచ్చారు. అతను నాకు ఈ టీవీలో మిత్రుడు. ప్రస్తుతం హైదరాబాద్ అశోక్ నగర్లో IAS స్టడీ సర్కిల్ నడుపుతున్నాడు. అది అతని ప్రధాన వృత్తి కాగా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో వ్యక్తిత్వ వికాసంపై సెమినార్లు ఇస్తుంటాడు. అయితే వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో సేవ చేస్తున్నాడు. అంధులకు, వికలాంగులకు వ్యక్తిత్వ వికాసం, స్వయం ఉపాధిపై సీడీలు తయారుచేసి వారికి ఉచితంగా అందజేస్తున్నాడు. అలాగే ఒక ట్రస్టు ద్వారా పూర్తి స్తాయిలో సేవలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది త్వరలోనే ప్రారంభం కానుంది.
రాఘవేంద్ర పర్యటనలో ఒక సెషన్ లో మాకు కేటాయించాలని కోరాను. మాకు దగ్గరలో ఉన్న రాజేంద్ర మునిసిపల్ హై స్కూల్ పిల్లలకు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న అంశంపై దాదాపు రెండు గంటలు ప్రసంగించాడు.
పిల్లల మొదటి ప్రశ్న సార్ మాకు చదివింది ఒక్క ముక్క గుర్తు ఉండదు అన్నారు.
అందుకు రాఘవేంద్ర ఇలా చెప్పారు. ఆటో సజెషన్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒక అంశం చదివే ముందు దీన్ని ఏదో ఒక సందర్భంలో తిరిగి అడుగుతాను కాబట్టి జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అని మెదడుకు హెచ్చరిక చేయాలట.
మన మెదడుకు ఒక లక్షణం ఉంది. ఏదైనా సాదాసీదా విషయం అయితే వీలైంత త్వరగా మర్చిపోతుంది. విలక్షణమైన అంశాలను బాగా గుర్తు పెట్టుకుంటుంది. పెక్యూలియర్ గా ఉండే వ్యక్తులు మనకు బాగా గుర్తుండిపోతారు. కాబట్టి మనం చదివే అంశంలో ఇలాంటి లక్షణాలు ఉంటే వాటిని గుర్తించడం ఇంకా ఎన్నో చెప్పాడు.
దీన్ని జీవని తరఫున ఆర్గనైజ్ చేశాము
Good work.. nice to know about these initiatives...