కర్నూలు ప్రజలను వరదలు ముంచెత్తి ఒక సంవత్సరం గడచిపోయింది. వరద బాధితులకు సహాయం అందించడంలో జీవని తన వంతు కృషి చేసింది. ఒకసారి ఆ కార్యక్రమాన్ని నెమరువేసుకుందామని ఈ టపా పెడుతున్నాము...
150 - Praveen Kharma
050 - Ashok Chowdary
100 - Bhavana
020 - Buchibabu B.
050 - Bhaskara Rami Reddy
050 - Panipuri
116 - Shashank
100 - Malakpet Rowdy
025 - Anagha (Baby Rowdy)
050 - Manchu Pallaki
151 - Swetha Gunna
116 - Bhaskara Ramaraju
100 - Nandu
100 - Nishigandha
050 - Anonymous
050 - Venkat Dasika
050 - Ekalingam
050 - Sharada Murali
050 - Sarat
100 - Padma (Mohanaraagaalu) ( Directly to Jeevani )
100 - Korivi Dayyam (Pramaadavanam) ( Directly to Jeevani )
116 - Sri - ( Directly to Jeevani )
050 - RK - ( Directly to Jeevani )
150 - Rajashekar Cheryala ( Directly to Jeevani )
050 - Ranjit Devadas - ( Directly to Jeevani )
150 - Janardhan Bonu -( Directly to Jeevani )
150 - Ravi Piriya ( Directly to jeevani)
నిజానికి ఈ కార్యక్రమంపై స్పష్టత లేని సమయంలో మమ్మల్ని ప్రోత్సహించి ముందడుగు వేయించింది మలక్పేట్ రౌడీ భరద్వాజ్ గారు.
మొదటి రోజు 2000 మందికి పులిహోర సిద్ధం చేయించాము.
పొద్దున్నే ఆహారంతో లారీ కర్నూలు బయలుదేరింది. అప్పటికి కర్నూలు కొంచెం కూడా తేరుకోలేదు.
మన వాళ్ళు పాత బస్తీ ప్రాంతంలో పంపిణీ చేశారు. అలాగే కొన్ని కొత్త దుప్పట్లు పాత బట్టలు వగైరాలు కూడా...
తర్వాతి రోజు 3000 మందికి చపాతీలు చేయించి తిరిగి కర్నూలు పాత బస్తీకే పంపాము. శ్రీ సాయిదత్తా మ్యాక్ సొసైటీ ప్రతినిధి అనిత గారు వీటిని తయారుచేయించారు. ఆర్థికంగా, వస్తుపరంగా ఆమె జీవనికి భారీగా సహాయపడ్డారు.
రెండు రోజులపాటు విజయవంతంగా పంపిన అనంతరం మాకు పూర్తి ధైర్యం వచ్చేసింది. ఈ సారి ఒక గ్రామానికి పూర్తిగా నెల రోజుల భత్యం తీసుకుపోవాలని ప్లాన్ చేశాం. అందులో చీర, దుప్పటి, టవల్ , పంచె ఇతర నిత్యావసర వస్తువులు వుంచాము. బట్టలకే దాదాపు 1,50,000 అయింది. అయితే ఒక విశేషం ఏమంటే మాదగ్గర రెడీ క్యాష్ ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు అప్పుచేస్తూ వచ్చాము. మన అప్పు తీరుతుందిలే అన్న ధీమా కూడా వచ్చింది. జీవని సంస్థ నుంచి 65,000 అప్పుతో ప్రారంభించాము.
( జీవని ప్రధాన కార్యకలాపాలు తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించినది కాబట్టి ఆ డబ్బు వాడుకోవడానికి వీలు లేదు. అందుకే అప్పు తీసుకున్నాము )
మహిళా బ్లాగర్లు కూడా మాకు బాసటగా నిలిచారు. అయితే ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెబుతున్నాను. ఫండ్స్ కు సంబంధించి డీల్ చేయడం కత్తిమీద సాములాంటిది. తెలుగు బ్లాగర్లు డబ్బు మనకే పంపుతారా లేక ఎవరికైనా ఇస్తారా? మీరు డబ్బు జీవనికే పంపుతున్నారా అని అడగడానికి వెధవ
మొహమాటం. డబ్బులంటే పడిచస్తున్నారు అనుకుంటారని భయం. బ్లాగర్లలో ఇంకా పూర్తి స్పష్టత లేదు. కామెంట్ల మధ్యలో ఎవరో ఒకరు దూరిపోయి అసలు ఈ జీవనిని మనం నమ్మవచ్చా? ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి కదా అంటూ గందరళగోళం లో పడేస్తారు. బ్లాగర్ల నుంచి ఒక అమౌంట్ కు హామీ వస్తే ఆమేరకు అప్పులు చేయవచ్చు అన్నది మా ఆరాటం. ప్లానింగ్ కు సంబంధించి ఇది తప్పనిసరి. చివరి నిముషంలో ఆర్.కె. గారు ( యోగి ) లైన్లోకి వచ్చి మీరు భయపదకండి మీ పని మీరు చెసుకుపోండి అన్నారు.మరుసటి రోజు నాబాధను ఆర్.కె. , భరాద్వాజ గారికి చెప్పారు. ఆయన పూర్తి భరోసాతో మెయిల్ వచ్చింది. జ్యోతి,రమణి, వరూధిని గార్లు కూడా ఆ పాటికి జీవనికి ప్రమదావనం తరఫున సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
సరే ఇదిలా నడుస్తుంటే, మరోపక్క ఆ రాత్రంతా ప్యాకింగ్ చేశాము. ఇది చాలా శ్రమతో కూడిన పని. దాదాపు ఇరవై మంది జీవని యూత్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తెల్లవారు 4 గంటల వరకు పని చేయాల్సి వచ్చింది. మళ్ళీ పొద్దుటే ప్రయాణం. కానీ ఈ నిద్రలేని రాత్రి అందరికీ ఎనలేని తృప్తిని కలిగించింది. ఎక్కడా ఎవరికీ విసుగు లేదు. ఇంకా చేయాలన్న తపన. అలాగే మా కాలనీలోని మహిళలు కూడా ప్యాకింగ్ లో తమ వంతు సహకారం అందించారు.
అంతకు ముందురోజే పూర్తి సమాచార సేకరణ చేసి గుండ్రేవుల గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించాము.
జూన్ లో కర్యకలాపాలు ప్రారంభించిన జీవనికి సరిగ్గా ఆరు నెలల వయసు కూడా లేదు. మనకు బాగా డబ్బున్న వాళ్ళ అండదండలూ లేవు, అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం మాకు ఆశ్చర్యంగా అంపించింది. అయితే మా అందరిలో ఉన్న ఏకైక శక్తి సేవ చేయాలన్న తపన మాత్రమే. అలాగే మా మిత్ర బృందానికి మా అందరిపై ఉన్న నమ్మకం. మేము డబ్బులు దుర్వినియోగం చేయం అన్న నమ్మకాన్ని దాతల్లో కలిగించాము.
గుండేవుల గ్రామంలో సహాయం అందించిన దృశ్యాలు.
మలి విడతలో ఉప్పులూరు, ముడుమాల, సింగవరంలో కిట్లు అందజేశాము.
వరద బాధితులకు సహాయం అందించిన మానవతా మూర్తుల వివరాలు ఇక్కడ ఇస్తున్నాము. వీరికి మరోసారి జీవని తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.
U.S. TELUGU BLOGGERS
GERMANY TELUGU BLOGGERS
TELUGU WOMEN BLOGGERS
SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR
SREE SAIDATTA MAAC SOCIETY, ANANTAPUR
SWIB INFRA PVT. LTD., HYDERABAD
FUJITSU EMPLOYEES, CALIFORNIA
BAY GANG
SVU GUYS
DONORS LIST BLOGGERS FROM ABROAD
050 - Ashok Chowdary
100 - Bhavana
020 - Buchibabu B.
050 - Bhaskara Rami Reddy
050 - Panipuri
116 - Shashank
100 - Malakpet Rowdy
025 - Anagha (Baby Rowdy)
050 - Manchu Pallaki
151 - Swetha Gunna
116 - Bhaskara Ramaraju
100 - Nandu
100 - Nishigandha
050 - Anonymous
050 - Venkat Dasika
050 - Ekalingam
050 - Sharada Murali
050 - Sarat
100 - Padma (Mohanaraagaalu) ( Directly to Jeevani )
100 - Korivi Dayyam (Pramaadavanam) ( Directly to Jeevani )
116 - Sri - ( Directly to Jeevani )
050 - RK - ( Directly to Jeevani )
150 - Rajashekar Cheryala ( Directly to Jeevani )
050 - Ranjit Devadas - ( Directly to Jeevani )
150 - Janardhan Bonu -( Directly to Jeevani )
150 - Ravi Piriya ( Directly to jeevani)
15000 Rs - Archana & Jayaprakash
03000 Rs - Madhuravani, Software prof., Germany
INDIAN BLOGGERS
5000 - Pramadavanam, Telugu mahila bloggers
1000 - Medha, Blogger, Software prof., Bangalore
2000 - Vani, Blogger, Computer prof., Vijayawada
4000 - Ramani & friends., hyderabad
INDIAN DONORS
21000 - Sri. SAMBASIVA REDDY, SECRETARY AND CORRESPONDENT, SRIT, ANANTAPUR
21000 - STAFF, SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR
17000 - N.S.S., VOLUNTEERS, SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ATP
75000 - Smt. N.ANITHA, FASHION DESIGNER, RAMNAGAR, ANANTAPUR
25000 - SWIB INFRA, HYDERABAD
40000 - FUJITSU EMPLOYEES, BAY GANG, SVU GUYS
25000 - Sri. SUBHASH REDDY & FRIENDS, USA
15000 - Smt. RADHIKA, TEACHER, ANANTAPUR ( RICE + ESSENTIAL COMMODITIES)
10000 - SRI RAMESH, BUSINESS, DHARMAVARAM, ANANTAPUR ( Di )
10000 - Sri. K. RAJAVARDHAN REDDY, SOFTWARE ENGINEER, DELOITTE, U.S.
10000 - Sri. V. ASHOK REDDY, SOFTWARE ENGINEER, U.S.
10116 - Sri. KALYAN SIRIVELLA, SOFTWARE ENGINEER, U.S.
10000 - Sri. RAVI, SITARA PROJECTS, BANGALORE
10000 - Sri. BHASKARA REDDY, SOFTWARE ENGINEER, U.S.
10000 - Sri. GOPALA KRISHNA REDDY
07500 - Sri. GOWRI SANKAR, SOFTWARE PROF., BANGALORE
05000 - Sri. RADHAKRISHAN REDDY
05000 - Sri. TIRUPATI REDDY
03000 - Sri. RAM MOHAN REDDY, CUSTOMS & CENTRAL EXERCISE, HYDERABAD
02000 - Sri. D. SREENIVASA REDDY, SUB REGISTRAR, ANANTAPUR RURAL
02500 - Sri. G. RAGHAVA REDDY, ENGINEER, PANCHAYATI RAJ DEPT., ANANTAPUR
02000 - Smt. PADMAVATI, HYDERABAD
02000 - Sri. RATNAKAR, LECTURER, NARAYANA COLLEGE, HYDERABAD
02000 - Sri. J. SALOMAN RAJU, LECTURE, SREE CHAITANYA COLLEGE, HYD
01000 - Sri. PAVAN KUMAR, SOFTWARE ENGINEER, BANGALORE
01000 - Sri. NARASIMHA REDDY, SOFTWARE ENGINEER, SHARP SOFTWARE, BANGLORE
00500 - Sri. TIRUMALA REDDY, Rtd. TEACHER, ANANTAPUR
00300 - Sri.HEMANTH KUMAR, SOFTWARE ENGINEER TCS, KOLKATA
00300 - Sri. GANGA PRASAD, SOFTWARE ENGINEER COGNIZANT, CHENNAI
00300 - SABITHA, SOFTWARE ENGINEER TCS
00500 - Sri. UPENDRANATH, SOFTWARE ENGINEER TCS, HYDERABAD
00500 - Sri. UMESH, TC, KOLKATA
ఈ కార్యక్రమంతో జీవని మరింత ఎదిగింది. అందరి నమ్మకాన్ని చూరగొంది. మొదటి సంవత్సరం ఆరుగురు పిల్లలకు మనం ఆశ్రయం కల్పించగా ఇప్పుదు ఆ సంఖ్య 19 కి చేరింది. వీరికి స్కూల్, హాస్టల్ , బట్టలు, ఆరోగ్యం అన్నీ కలిపి ఒక్కోరికి 20,000/- ఖర్చు పెడుతున్నాము. దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడంలో భాగంగా జీవని విద్యాలయం ప్రారంభించనున్నాము. స్థల సేకరణకు సంబంధించి జాప్యం జరుగుతోంది. స్థలం విషయంలో రాజీ పడకుండా అనంతపురానికి దగ్గరగా ఉండాలని మా ఆకాంక్ష. దేశమంతా రియల్ ఎస్టేట్ పడిపోతే బ్రోకర్ల మాయాజాలంతో ఇక్కడ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఆలస్యం అవుతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 2011 జూన్ లో విద్యాలయం
ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నాము.
అలుపెరగని దీక్షతో, పారదర్శకతతో, మేము ఉత్సాహంగా శ్రమించడానికి మీ అందరి ఆశీస్సులే కారణం.
జీవనికి ప్రతి అడుగు తామై, సంస్థను తమలో ఒక భాగంగా చేసుకుని ముందుకు నడిపిస్తున్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం ( కరస్పాండెంట్ శ్రీ ఆలూరు సాంబశివా రెడ్డి గారికి ), సిబ్బంది, విద్యార్థులకు మా కృతఙ్ఞ్తలు.
మా అందరికీ కాస్త సేవ చేసే భాగ్యం కల్పిస్తూ ఆర్థికంగా, నైతికంగా మద్దతు ఇస్తున్న దాతలు, మిత్రులు , శ్రేయోభిలాషులు అందరికీ పిల్లల తరఫున, జీవని కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
photo shop by : members pra.pi.sa.sa
manchipani chesaaru.abhinandhanalu
wow congratulations to everyone.
సమాజసేవకు కూర్చిన మానవహారం గుర్తొచ్చింది అంతా చదువుతూ ఉంటే....చాలా బావుందండీ.