సమావేశానికి హాజరైన రిటైర్డు ఉపాధ్యాయుడు నాగిరెడ్డి గారు ఒక సూచన చేశారు. పిల్లలకు ఇబ్బంది కలగని పక్షంలో ఇంటి పేరును జీవనిగా పెట్టాలని సూచించారు. దీనివల్ల వారికి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. జీవని పట్ల కృతఙ్ఞతా భావం ఉండి తిరిగి తాము సేవ చేయడానికి స్ఫూర్తిగా ఉంటుంది. అలాగే భవిష్యత్ కాలానికి వివిధ హోదాల్లో జీవని సానుభూతిపరులు ఉంటారు. వారి వల్ల పిల్లలకు మేలు మేలు జరుగుతుంది అన్నారు. దీన్ని కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయించాలని అనుకున్నాము.

ముఖ్యంగా చెప్పుకోవలసింది సతీష్, సురేష్, సుధాకర్ రెడ్డి, రామ శేషు మరియు వారి మిత్ర బృందం గురించి. బిజీ బిజీగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న వీరంతా జీవనిని నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం. తమ కంపెనీల్లో జీవని గురించి మిత్రులకు చెవులు చిల్లులు పడేలా చెప్పి ప్రతి నెలా కొత్త దాతలను పరిచయం చేస్తుంటారు. రెండు రోజులు సెలవులు దొరికితే అందరూ అనంతపురం వచ్చేస్తారు. నెలకోసారి మొత్తం సమీక్షించి ఇంకా ఏం చేయాలో ప్రణాళిక వేస్తుంటారు. వీరందరి వయసు 30 లోపే. వీళ్ళ ఆరాటం మాకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మరో వ్యక్తి నిర్మలా దేవి గారు. ఈమె శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి కరస్పాండెంట్ సాంశివా రెడ్డి అత్త గారు. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన ఈవిడ రోజూ సగభాగం జీవనికి కేటాయిస్తారు. ఒక్కరే వెళ్ళి అనంతపురంలోని ఉన్నతాధికారులను కలిసి జీవని గురించి చెబుతూ ఉంటారు.

వీరిని సమావేశంలో పరిచయం చేసినపుడు చప్పట్లు మార్మోగాయి. ఇంత గొప్ప టీం మనకు
ఉన్నందుకు గర్వంగా వుందని సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.









ఆకాశవాణి అనంతపురం స్టేషన్ డైరెక్టర్ రమణమూర్తి గారు





NOVEMBER 2010 DAILY BALANCE SHEET

Balance as on 31-10-10 18575 /-

01-11-10 - Expenditure 1000/- office asst. salary 17,575/-
02-11-10 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 17,875/-
03-11-10 - 6000/- A.SAMBASIVA REDDY, expenditure - dress for children 6000/- 17,875/-
04-11-10 - 2000/- J.SOLOMAN RAJU 19,875/-
05-11-10 - 2000/- NAGIREDDY 21,875/-
06-11-10 - 500/- SUNIL 22,375/-
07-11-10 - expenditure for meeting 2502/- ( 19,873/-)
08-11-10 - 1200/- USHA RANI 21,073/-
09-11-10 - 1000/- RAMANA REDDY 22,073/-
10-11-10 - expenditure 220/- documents for auditing 21,853/-
11-11-10 - 3000/- J.NIRMALA DEVI 24,853/-
12-11-10 - 1000/- SRINATH, 1000/- VIKRAM, 600/-RAMSESH 27,453/-



SCHOOL FEES DEATAILS

TOTAL FEES TO BE PAID 2,66,000/-

PAYMENT DEAILS

40,000/- 20.06.2010
20,000/-
20,000/- 02.08.2010
40,000/- 23.08.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 19.10.2010





on
categories: | edit post

4 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. Using last name/sir name as Jeevani is not at all a good idea. People will think these are the people with no family or poor and it will be painful to the kids who get help. I do not have much time now, if time permits in future I can explain in detail. Thanks.

     
  3. Anonymous గారు: నాకెందుకో "అదసలేమాత్రమూ మంచిదికాదు" అనిపించట్లేదు. నాకు తెలిసి ఇంటిపేరు ఉపయోగమల్లా మన affiliation ను తెల్పడమే దీన్ని మీరు వంశమనండి, కులం లేదా మతం అనండి. మరి అలాంటప్పుడు "మా affiliation జీవనితో" అనిచెప్పుకోవడం నాకైతే నచ్చింది. ఇకపోతే "with no familiy and poor" గురించి, ఈ రకంగా అనుకునేవాళ్ళవాళ్ళు ఈ విద్యార్ధుల మనసులను నొప్పించలేని విధంగా వీళ్ళను emotionally strongగా చెయ్యగలిగితే, ఇదసలు విషయమేకాదని విద్యార్ధులు అనుకొనేలా చేయగలిగితే సరిపోతుంది.

     
  4. Anonymous Says:
  5. ఆజ్ఞాత చాలా బాగా చెప్పారు. ఆ పిల్లలకు తమ గతం జీవితాంతం వెంటాడేలా చేయల్సిన అవసరంలేదనుకుంటా. సేవాదృక్పథం, కృతజ్ఞతాభావం మనసుల్లో నాటితే చాలు, పచ్చబొట్టు పొడిపించాల్సిన అవసరం లేదు.

    జీవని సేవాదృక్పథాన్ని అభినందనీయం. స్వయంగా జీవనిని సందర్శించే అవకాశం కోసం ప్రయత్నిస్తాను.

     
  6. jeevani Says:
  7. anon, indian minerva thank u
    snkr u r welcome.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo