మిత్రులారా ముందుగా అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు. అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత సేవ చేయండి ఇది జీవని ఫిలాసఫీ. జీవితంలో సంతోషాన్ని మన వెంట ఉంచుకుంటే ముందు ఆరోగ్యం ఆ తర్వాత ఐశ్వర్యం కూడా మన వెంబడే ఉంటాయి. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆనందకరమైన జీవితాలు కలగాలని కోరుకుంటున్నాము.
2010లో బ్లాగర్లు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మా అందరి ముక్కూ మొహాలు, పిల్లల్ని కనీసం చూడనైనా చూడకుండా విరివిగా విరాళాలు ఇచ్చారు. ఇంతవరకు పిల్లలకు కట్టిన ఫీజులో 70 శాతం మీరు పంపినవే. పిల్లల దుస్తులు, స్టేషనరీ, ఇతర అవసరాలకు మాత్రం డైరెక్ట్ గా మాకు అందించిన విరాళాలు ఉపయోగించాం. మా పట్ల మీకున్న నమ్మకానికి సదా కృతఙ్ఞులం. జీవనికి బ్లాగర్లు విరాళాలు పంపుతున్న విషయాన్ని ఎక్కడైనా చెప్పినపుడు వారు ఆశ్చర్యపోయేవారు. కళ్ళముందు కనిపిస్తున్నా ఫలానా సంస్థ నిజాయితీగా పని చేస్తోందా అని శంకిస్తున్న కాలమిది ( ఇది స్వచ్చంద సంస్థలు చేజేతులా చేసుకుంటున్న పాపం ) ఎలాంటి అనుమానం లేకుండా మీరు స్పందిస్తున్న తీరు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి మీ పెద్ద మనసే ఏకైక కారణం. జీవని తరఫున కూడా ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాము. మనకు విరాళం ముఖ్యం కాదు. అందరి నైతిక మద్దతు ప్రధానంగా కావాలి. సలహాలు, సూచనలు కావాలి. మీరు ముందుకు పదండి అని ధైర్యం చెప్పాలి. సేవా హృదయం ఉన్న అందరినీ కలిపే ప్లాట్ ఫాం జీవని కావాలి. ఆ తర్వాత వద్దన్నా మన ప్రయాణం సాగిపోతుంది.
మీరు పంపే ప్రతి రూపాయి పిల్లలకు చేరుతుంది. మేము కూడా శాయశక్తులా మరింత మంది పిల్లలకు సేవల్ని విస్తరిస్తాం.వారికి ప్రేమాభిమానాల్ని అందించడానికి ఇంకా కృషి చేస్తాం.
జీవనికి ఈ సంవత్సరం అత్యంత కీలకమైనది. జూన్ కల్లా జీవని విద్యాలయం ప్రారంభమవుతుంది. కట్టడానికి సరిపడా నిధుల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. కానీ ప్రతి నెలా నడపడానికి కావలసిన రన్నింగ్ ఎక్స్పెండిచర్ గురించే అలోచించాల్సి ఉంది. మన ఆశలకు అనుగుణంగా చక్కటి విద్యను అందించడానికి నెలకు 2.5 - 3 లక్షల వరకు ( 100 మంది పిల్లలకు ) ఖర్చు రానుంది. దీన్ని కూడా సాధించగలమనే నమ్మకం ఉంది. ఇందుకోసం కార్పస్ ఫండ్ పెంచుకోవాలని సభ్యుల అభిప్రాయం.
ఇంతవరకూ మనం విరాళం ఇవ్వమని లోకల్గా ఎవరినీ అడగలేదు. మా మిత్రబృందం ద్వారా తెలుసుకుని మాత్రమే విరాళాలు ఇస్తున్నారు. ఇస్తావా చస్తావా అని మేము ధైర్యంగా అడగగలిగిన మిత్రులు లోకల్గా చాలా మందే ఉన్నారు. వీరందరి సేవలు జీవని విద్యాలయానికి ఉపయోగించుకోనున్నాము. అదే మన మొండి ధైర్యం కూడా.
2009లో ప్రారంభించిన జీవనికి ఇంతవరకూ అందిన విరాళాలు దాదాపు 15 లక్షలు ( వరద బాధితుల కోసం సేకరించిన దానితో కలిపి ) ఇప్పుడు 5 లక్షలు కార్పస్ ఫండ్ ఉంది. దీన్ని 2 కోట్లకు పెంచాల్సి ఉంది. దీనివల్ల నెలకు 2 లక్షల బ్యాంకు వడ్దీ వస్తే అప్పుడు జీవని విద్యాలయం సాఫీగా నడుస్తుంటుంది.
ఎప్పటిలా మీ సహాయ సహకారాలు మాకు ఉంటాయని, మా పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుతూ,
మీ,
జీవని.
DECEMBER 2010 DAILY BALANCE SHEET
Balance as on 30-11-10 22,203/-
01-12-10 - Expenditure 1000/- office asst. salary 21,203/-
02-12-10 - 200/- CHNDRA SEKHAR REDDY, 200/- K.SUDHEER, 500/- SV.PRASAD REDDY 22,103/-
03-12-10 - 300/- AKSHATHA, 200/- PRATHAP REDDY, 200/- HARINATH REDDY, 200/- PARVATAMMA 23,003/-
04-12-10 - 100/- SUDHAKAR REDDY, 100/- SUGUNA, 100/- KRISHNA MURTHY, 100/- UMA DEVI 23,403/-
05-12-10 - 500/- vasuki 23,903/-
06-12-10 - expenditure 5500/- stationary, auditor fees etc. 18,403/-
07-12-10 - NIL
08-12-10 - NIL
09-12-10 - 5500/- VASANTHI & FAMILY 23,903/-
10-12-10 - 800/- RAJESWARAMMA 24,703/-
11-12-10 - 6700/- STUDENTS OF SRIT 31,403/-
12-12-10 - 2000/- VICTOR BABU 33,403/-
13-12-10 - 15,000/- added to carpus fund 18,403/-
14-12-10 - expenditure 1120/- lavanya, ganesh, indraja medical bill 17,283/-
15-12-10 - NIL
16-12-10 - NIL
17-12-10 - 1,000/- CHRISTOS GLORY 18,283/-
18-12-10 - expenditure 4,050/- sweaters, cheppals 14,233/-
19-12-10 - 5,000/- vivekananda reddy 19,233/-
20-12-10 - NIL
21-12-10 - NIL
22-12-10 - NIL
23-12-10 - 2000/- vasu prasad 21,233/-
24-12-10 - 3650/- kumara swamy reddy 24,883/-
25-12-10 - 200/- SURESH REDDY, 200/- AMARENDRA REDDY, 100/- SANTOSH 25,383/-
26-12-10 - 500/- SV.PRASAD REDDY, 500/- PRASANNA RAGHAVENDRA 26,383/-
27-12-10 - 200/- SRI HARSHA, 100/- PARAMESH, 100/- MAHESH, 200/- ABHILASH 25,983/-
28-12-10 - 2000/- D.CHAITANYA S/O SREENIVASULA REDDY 27,983/-
29-12-10 - expenditure 10,000/- school fees 17,983/-
30-12-10 - 200/- SATISH DHANUNJAYA, 300/- AKSHATA, 100/- SUDHAKAR REDDY 18,583/-
31-12-10 - 200/- SUDHEER, 200/- RAMESH PRASAD, 200/- PURNACHANDRA RAO 19,183/-
SCHOOL FEES DEATAILS
TOTAL FEES TO BE PAID 2,66,000/-
PAYMENT DEAILS
40,000/- 20.06.2010
20,000/- 15.07.2010
20,000/- 02.08.2010
40,000/- 23.08.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 19.10.2010
20,000/- 14.11.2010
10,000/- 29.12.2010
20,000/- 30.12.2010
Hi All ,
I Wish you "Happy New Year" to all the Donors,Jeevani members and Jeevani Children.
I hope this year will be a great year for our Jeevani and it is going to be a memorable year for all of us because we are going to start our "Jeevani Vidyalayam" this year.
Once again thanks to all who are giving their valuable Support to Jeevani.
All the Best to all of you and Jeevani....
Regards,
Suresh
జీవని సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జీవని ఇలాగే ఎల్లప్పుడూ సజీవంగా, నిత్య నూతనంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
నవ్య వసంతం మీ కుటుంబంలో నూతన కాంతులు నింపాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ
మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శుభం .దిగ్విజయోస్తు