మిత్రులారా మరో 15 రోజుల్లో జీవని హాస్టల్లోకి పిల్లలు అడుగుపెడుతున్నారు. వారి దినచర్య ఇలా రూపొందించాము, మీరు ఇంకా ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వల్సిందిగా కోరుతున్నాము.ఈ ప్రణాళికలో చిన్నపిల్లలకు కాస్త వెసులుబాటు ఉంటుంది.
5:00 - నిద్ర లేవడం
5:00 - 5:15 - కాలకృత్యాలు
5:15 - 6:00 - జాగింగ్, ఎక్సర్సైజులు / యోగా, ధ్యానం
6:00 - 6:15 - మిల్క్
6:15 - 7:00 - స్నానం
7:00 - 8:30 - స్టడీ అవర్, బ్రేక్ ఫాస్ట్
8:30 - 5:30 - స్కూల్
5:30 - 7:00 - స్నాక్స్ & మిల్క్, గేంస్, స్నానం
7:00 - 7:30 - డిన్నర్
7:30 - 9:00 - స్టడీ అవర్
DAILY BALANCE SHEET - MAY
BALANCE AS ON 30-4-2012 8,316/-
BALANCE AS ON 30-4-2012 8,316/-
01-4-12- Office Asst. salary 1000/- 7,316/-
02-4-12- expenditure Press club 200/- 7,116/-
03-4-12- ELISON 500/- 7,616
04-4-12- VARAPRASAD 100/- KIRAN 200/- 7,916/-
05-4-12- Chi. KOUSHIK REDDY 1000/- 8,916/-
06-4-12- SURESH REDDY MIDUTURU 300/- PARAMESH.K 100/- 9,316/-
07-4-12- AMARENDER REDDY 200/- SANTOSH.D 100/- 9,616/-
08-4-12- RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/- 10,016/-
09-4-12- SRI HARSHA 200/- VENKAT NAIDU 300/- 10,516/-
10-4-12- RAMMOHAN NAIDU 200/- PURNACHANDRA RAO 900/- 11,616/-
11-4-12- SATISH DHANUNJAYA 400/- 12,016/-
12-4-12- D.NARESH BABU 1000/- 13,016/-
13-4-12- NIL
14-4-12- NIL
15-4-12- NIL
16-4-12- NIL
17-4-12- NIL
18-4-12- NIL
19-4-12- NIL
20-4-12- NIL
21-4-12- NIL
22-4-12- NIL
23-4-12- NIL
24-4-12- NIL
25-4-12- NIL
26-4-12- NIL
27-4-12- NIL
28-4-12- NIL
29-4-12- NIL
30-4-12- NIL
31-4-12- NIL 13,016/-
సహజముగా హాస్టలు,స్కూల్ ఇత్యాదులన్ని ఇదే పట్టి ఫాలో అవుతున్నయి. అలాగే సహజముగా స్కూల్ సమయాలలొ మీరు లంచ్ చేర్చలేదు. అది ముఖ్యము కాబట్టి ఇన్ని లభింప చేసిన వారు అది మర్చి పోరు. ఉద.8.30 నుంచి సా.5.30 దాక స్కూల్ సమయము ఎక్కువ. మీరు తీసుకున్న పిల్ల శారీరక పరిస్థితులకన్న మానసిక సంతులనత మీద తీవ్ర ప్రభావము చూపి పిల్లలు ముభావముగా తయారు అవుతారు.ఈ మధ్యలో వారిచే వారికి ఇష్టమయిన లేక మీరు ఎమన్న సృజనాత్మకత నేర్పే లేక వారిలొంచి వెలికి తిసే కార్యక్రమము చేయటానికి వీలు వున్నదేమో పరిశిలించండి.తద్వారా పిల్లలు ఉత్సాహవంతులయి విద్యమీద ఎకాగ్రత అభిరుచి కలగటానికి ఎక్కువ అవకాశము కుదురుతుంది.
pillalaku
bharata bhagavataadi kathalanu vinipimchadam samkeertana cheyadaaniki saayamtram oka aragamta ketaayiste baagumtumdi
kaani meeparimitu lu emito teliyavu kadaa veelaite pariseelimchamdi
రమేష్ బాబుగారు మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతం జీవని హాస్టల్ మాత్రమే ఉంటుంది. స్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. లంచ్ బాక్సులు పొద్దునే వారితోపాటు తీసుకెళ్తారు కాబట్టి అందులో చేర్చలేదు.
స్కూల్ టైమింగ్ విషయానికొస్తే అది హాస్టల్ నుంచి వెహికల్ లో బయలుదేరడం మొదలుకొని మళ్ళీ తిరిగిరావడం వరకు. ప్రయాణ సమయాన్ని అందులో కలిపాము.
మీరు చెప్పినట్లు సృజనాత్మకత మీద తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము. వివిధ కళల్లో మాకు తెలిసిన మిత్రుల ద్వారా వారిలోని నైపుణ్యాలకు పదునుపెడతాము. ఇందుకు సెలవు దినాలను ఉపయోగించుకుంటాము.
దుర్గేశ్వర గారూ హాస్టల్లో చిన్నపాటి లైబ్రరీ ఏర్పాటు చేయనున్నాము. అందులో ఈ పుస్తకాలన్నీ చేరుస్తాము. గ్రంథపఠనానికి తప్పక ప్రాధాన్యం ఉంటుంది. అలాగే కేవలం చదువు మాత్రమే అందిచడం మన ఉద్దేశ్యం కాదు. పిల్లల్లో నైతిక విలువలు, సేవా దృక్పథం పెంపొందించడం ప్రధాన లక్ష్యాలు. కాబట్టి సెలవుదినాల్లో ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. మీ స్పందనకు ధన్యవాదాలు.
దుర్గేశ్వర గారి సలహా బాగుంది.
అవును ఆదివారం సెలవు కదా, ఆరోజుటి దినచర్య ఏంటి?
photon thank you.
ఆదివారం, స్పోకెన్ ఇంగ్లీష్, టీచర్లతో క్లాసులు, నైతిక విలువలపై ఉపన్యాసాలు, ఇంకా వివిధ రంగాల వారితో ఇంటరాక్షన్, ఆటలు పాటలు ఇంకా....
దుర్గేశ్వర గారి సలహా బాగుంది.
అవును ఆదివారం సెలవు కదా, ఆరోజుటి దినచర్య ఏంటి?
స్పోకెన్ ఇంగ్లీష్, టీచర్లతో క్లాసులు, నైతిక విలువలపై ఉపన్యాసాలు, ఇంకా వివిధ రంగాల వారితో ఇంటరాక్షన్...
ప్రసాద్ గారూ..పిల్లల వయస్సు ఎంతో నాకు తెలియదు కానీ..ఆదివారం ఆటలు-పాటలు తప్ప వేరేవి ఏం లేకుండా వాళ్ల ఇష్టమొచ్చినట్టు వదిలేస్తే బాగుంటుందేమోనండి..మీరు స్పోకెన్ ఇంగ్లీష్..టీచర్లతో క్లాసులు అంటే వాళ్ళకి ఆదివారం కూడా స్కూలూ (స్కూలుకి వెళ్లకపోయినా)..చదువా అనిపిస్తుంది అది గంట సేపయినా సరే! ఆదివారం పిల్లలని వాళ్లకిష్టమైన ఆక్టివిటీలు చేసుకోమనండి.
బావుంది. వీలైతే పిల్లలకు టెన్నిస్, స్కేటింగ్, ఈత, బ్యాట్మెంటిన్ వంటివి నేర్పించడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచించండి.
సిరిసిరిమువ్వ గారూ నిజమే ఆదివారం వారికి ఆ వెసులుబాటు ఉండాలి. మధ్యాహ్నం పైన వారిదే రాజ్యం. పిల్లలు 5-12 వయసు మధ్య ఉన్నారు. ఎక్కువమంది 8 సంవత్సరాల లోపు ఉన్నారు. జీవని విద్యాలయం ప్రారంభం అయ్యేవరకు పిల్లలకు ఇది తప్పదు. మనం ఇప్పుడు పంపే బయటి స్కూళ్ళు సాధారణ స్థాయి కంటే కాస్త ఎక్కువగా ఉన్నవి. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ ఇతర విషయాలపై శ్రద్ధ తీసుకోవాలని అనుకున్నాము. అదీగాక జీవనిలోకి వచ్చేసరికి పిల్లలు బాగా డిస్ట్రబ్ అయి చదువు మీద పెద్దగా పట్టు ఉండదు. వారిని ఇతర పిల్లలతో సమానంగా తీసుకురావాలి కదా. కానీ వారి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి ఉండదులెండి. మీ స్పందనకు ధన్యవాదాలు.
సౌమ్య గారూ, మూడవ తరగతి వరకూ పిల్లలకు గ్రామీణ క్రీడలు, సంప్రదాయ ఆటలు ఆడించాలని. ఆపైన క్రికెట్ ( పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి) మిగతా ఆటలు ఆడించాలని ప్లాన్. మీరు చెప్పినదాంట్లో టెన్నిస్, స్కేటింగ్ మన బడ్జెట్ కు సరిపోవు. ఇక మిగతావి ఆడించొచ్చు.
Kaasta T.V lo manchi programs select chesi chupinchandi.....(already chupistunnaru anukunta,lekunte ee salaha gurinchi alochinchandi)All the Best and Thank You For your Activities.