బ్లాగుల్లో భావుకత్వం పరిమళాల్ని వెదజల్లే కొన్నింటిలో " మరువం " బ్లాగుది ప్రత్యేకస్థానం అని చెప్పక్కర్లేదు అనుకుంటా. మరువం ఉష గారు కొద్ది కాలంగా బ్లాగులకు దూరంగా ఉన్నారు.
వారు విదేశంలో ఉంటున్నా మన సంస్కృతిమీద తెలుగు భాష మీద మమకారాన్ని వదులుకోలేదు. వాటిమీద అంతకంతకూ అనురాగాన్ని పెంచుకుంటూనే ఉన్నారు.

వారిమాటల్లోనే...   " మన భాష, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయం ఈ తరానికి అందించే ప్రయత్నంతో మొదలుపెట్టిన "తెలుగు వెలుగు" బడి విద్యార్థులకి దీవెనగా ఇచ్చిన విరాళం. "

తెలుగు వెలుగు పేరుతో కొద్ది సంవత్సరాలుగా అక్కడి తెలుగు చిన్నారులకు కృత్యాధార పద్ధతులతో, ఆడుతూ పాడుతూ భాష నేర్పుతున్నారు. అధ్యాపకవృత్తి మీద వారికి ఉన్న అపారమైన మక్కువ వల్ల సరికొత్త పద్ధతులతో విద్యాభ్యాసం చేయిస్తున్నారు.
వారి శిష్యుల పేర్లు...స్నేహ, వైష్ణవి, మేఘన, అనీష, అనూష, లలిత, కీర్తన్, రిషిత, తేజ, ప్రణీత్, వరుణ్, కీర్తి, పూజ.

వీరి అభివృద్ధి గురించి చెప్పాలంటే...

- పిల్లలు రాయటం, చదవటం దాటి అనువాదాలకి వచ్చారు.  వ్యాకరణం నేరుస్తున్నారు.
- శ్లోకాలు, శతకాలు వల్లె వేస్తారు
- పండుగలు జరుపుతున్నారు.  ఆ సందర్భంగా వారికి విశేషాలు,  వివరాలు పూర్తిగా అవగాహనకి వచ్చేలా ప్రయత్నిస్తారు.
- ఉగాదికి పూర్తి తెలుగుదనం ఇతివృత్తంగా,  పగటివేషగాళ్ళు,  జానపద కళలు,  సాంఘిక సంస్కర్తలు, రచయితలూ,  పండుగ సంబరాలతో ఒక నృత్యనాటిక,  రేడియో అన్నయ్య స్మృతికి మరొకటి ("బుజ బుజ రేకుల పిల్లుందా" అన్న గీతం తో విద్యాధికులైన ఆడపిల్లల వలన వరకట్న దురాచారం తగ్గటం,  సంస్కారయుతమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడటం అంశంగా) ప్రదర్శించారు.
- పిల్లలు బడి, భాష ఎందుకు ఇష్టం? అన్న అంశంపై చాలా చక్కని వ్యాసాలు తెలుగులోనే రాసారు.









ఇదండీ ఉషగారి కృషి.
వారి కష్టం ఫలించాలని, పిల్లలు తెలుగు చక్కగా నేర్చుకుని మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ గొప్ప వ్యక్తులుగా తయారుకావాలని జీవని కుటుంబం తరఫున కోరుకుంటున్నాము.

ఉష గారి బ్లాగుపై విశ్లేషణను ఇక్కడ చూడొచ్చు. http://pustakam.net/?p=2398   ( ఇందుకు అనుమతి ఇచ్చిన జ్యోతి వలబోజు గారికి ధన్యవాదాలు )




DAILY BALANCE SHEET - DECEMBER
BALANCE AS ON 30-11-2012  5880/-
01-12-12- SANDHYA SAMEERA 10,000/- 15,880/-
02-12-12- expenditure staff salaries 14,000/- dhobi 500/- 1380/-
03-12-12- MANJULA 1000/- OBUL REDDY 500/- 2880/-
04-12-12- 30,000/- drawn from ANDHRA BANK 32,880/-
05-12-12- expenditure gas 5700/- milk 4500/- 22,680/-
06-12-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 22,980/-
07-12-12- expenditure provisions 9850/- vegetables 1000/-  12,130/-
08-12-12- expenditure kitchen utensils 1580/- 10,550/-
09-12-12- expenditure gas stove 2000/- 8,550/-
10-12-12-
11-12-12-
12-12-12-
13-12-12-
14-12-12-
15-12-12-
16-12-12-
17-12-12-
18-12-12-
19-12-12-
20-12-12-
21-12-12-
22-12-12-
23-12-12-
24-12-12-
25-12-12-
26-12-12-
27-12-12-
28-12-12-
29-12-12-
30-12-12-
31-12-12-


 SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

DECEMBER-----40,000/-
STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-


on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. ఉష గారికి అభినందనలు. వారి విద్యార్థులకు ఆశీస్సులు..

     
  2. మధురా, పిల్లల తరఫున ధన్యవాదాలు. ఈ బ్లాగు ప్రోత్సాహ వేదిక కనుక జీవని కి ఈ ద్వారాగా మరింత నిధులు సమకూరాలని కోరుకుందాము.

    జీవని గారు, (వ్యక్తిగతం గా వివేకానందుని వాక్కుననుసరించి దాన ధర్మాలు ఇతరులకి చేసే సహాయం కాదు, భగవంతునికి ఆరాధన.అని నమ్మే నేను) మీ సంస్థ సేవాకార్యక్రమాలకి ఇంకా విస్తృతం గా విరాళాలు అందాలని అభిలషిస్తూ... అభినందిస్తున్నాను.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo