మిత్రులారా ఈ శుభవార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల అనంతపురం జిల్లాలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 100% అంటే మొత్తం 420 సీట్లు ఫిలప్ అయ్యాయి. దీని వెనుక కఠోరశ్రమ, కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డిగారి కృషి ఎంతో ఉంది. అలాగే కర్ణా జగన్మోహన్ రెడ్డి, CEO గారు మొదలుకుని స్టాఫ్ మొత్తం ఈ విజయం వెనుక వున్నారు. వీరందరికీ జీవని తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. వచ్చే సంవత్సరం రాయలసీమలోనే SRIT నెంబర్ వన్ కాలేజి కావాలని కోరుకుంటున్నాము.ఇంజనీరింగ్ కాలేజీల్లో కుప్పలుతెప్పలుగా సీట్లు మిగిలిపోతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇతర కాలేజీల్లో వందలాది సీట్లు మిగిలిపోయాయి.
జీవనికి SRITకి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసే వుంటుంది. తెలియని వారి కోసం మరోసారి.
SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి జీవనికి ప్రధాన కార్యదర్శి కూడా. తాను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 50 లక్షల రూపాయలతో జీవని హోం నిర్మించారు. SRITలో స్వీపర్ దగ్గర్నుంచి కరస్పాండెంట్ వరకూ ప్రతి నెలా జీవనికి విరాళం ఇస్తారు. వారి నుంచి 13 - 15 వేలు అందుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా మనకు సహాయపడుతుంటారు. ఇలా జీవని SRIT బంధం విస్తరిస్తూ వస్తోంది.
Once again all the best to SRIT
0 వ్యాఖ్యలు