పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీ స్వరాజ్ మరియు శ్రీమతి రమ్య గార్ల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా వారు జీవని పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వారికి వారి కుటుంబానికి అంతా శుభం కలగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. ఇందుకు సహకరించిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారికి మరియు గిరి నర్రా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
on
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న అనంతపురంలోని రిజిస్టర్డ్ చిట్ ఫండ్ సంస్థలు జీవనికి 30,000/- విలువ చేసే 10 క్వింటాళ్ళ బియ్యం విరాళంగా ఇచ్చాయి. కపిల్ చిట్స్, సాయి భావన, చెరిష్, మణిక్రిష్ణ, వజ్రగిరి, ధీమా, సంపదైశ్వర్య,శక్తిస్వరూప్, శ్రీరాం రాఘవేంద్ర, సునేత్ర, శుభసంపద, పరమేశ్వరి, ఖాద్రివాసి, చలపతి, మార్గబంధు, శివకామేశ్వరి చిట్ ఫండ్ సంస్థలు ఈ విరాళం అందజేసాయి. వాటి ప్రతినిధులు దివాకర్ రెడ్డి, గుప్త, మల్లిఖార్జున, సుభాన్, రమేష్, అస్లం, మధు గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఆగస్టు 15కు, జనవరి 26కు చిట్ ఫండ్ సంస్థలు బియ్యం విరాళంగా ఇస్తున్నాయి. వీరందరికీ జీవనిని పరిచయం చేసి విరాళం అందించడంలో సహకరించే చిలుకూరు కుమారస్వామి రెడ్డి గారికి ( అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్స్, అనంతపురం జిల్లా ) ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి విషయంలోనూ మేధోపరంగా మమ్మల్ని నడిపించే కుమార్ అన్నకు ధన్యవాదాలు చెప్పడం తప్పే అవుతుంది. ఎందుకంటే జీవనిలో ఆయన కూడా ప్రధాన పాత్రధారి కాబట్టి.
on
వర్ధు వెంకటేశ్వర్లు గారు జీవనికి 6200/- విరాళం అందించారు. వారు బెంగళూరులో అసోసియేట్ కన్సల్టెంట్ గా క్యాప్ జెమినిలో పనిచేస్తున్నారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
for daily balance sheet pl visit http://www.jeevanianantapur.com/dailybalance.php
on
పీలేరులో ఉంటున్న సిబ్బల తక్షీల్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తక్షీల్ నాన్న మహేష్ గారు 5000/- విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
on
మా సమీప బంధువు రాజు గురించి చెప్పాలి. గత మూడు సంవత్సరాలుగా రాజు వాళ్ళ నాన్న గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గడచిన సంవత్సరం చెల్లి డెలివరీకి రావడం... తన ఉద్యోగం ఆ అబ్బాయిని ఉక్కిరిబిక్కిరి చేసాయి. అన్ని పనులు ఓపిగ్గా చేసుకునేవాడు. ఏ రోజూ విసుగు పడలేదు. ఇలాంటి వారిని చూసినపుడు, మానవసంబంధాలపై కోల్పోయిన నమ్మకం ఒక్కసారిగా పునరుజ్జీవనం పొందుతుంది. రాజు లాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లోనూ కనీసం ఒకరైనా ఉంటారు. ఒక్కసారి కనీసం ఒక్కసారి వారిని చూసి స్ఫూర్తిని పొందితే... అమ్మానాన్నల కేరాఫ్ అడ్రస్ వృద్ధాశ్రమాలు ఎందుకు అవుతాయి. ఇంకా ఆస్పత్రిలోనే ఉన్న రాజు నాన్నగారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.
Don’t stay away from Your Parents and leave them When they Need you the Most . You would never be able to Pay back in life what all they have done for You .
note: ఈ పోస్ట్ ఉద్దేశం హితోపదేశం కాదు, భావ వ్యక్తీకరణ మాత్రమే. ధన్యవాదాలు.
Don’t stay away from Your Parents and leave them When they Need you the Most . You would never be able to Pay back in life what all they have done for You .
note: ఈ పోస్ట్ ఉద్దేశం హితోపదేశం కాదు, భావ వ్యక్తీకరణ మాత్రమే. ధన్యవాదాలు.
on
చెన్నైలో ఉంటున్న రాజశేఖర రెడ్డి గారు తమ పాప మైథిలి పుట్టినరోజు సందర్భంగా జీవనికి 5000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
To view daily balance sheet:
http://www.jeevanianantapur.com/dailybalance.php
on
మిత్రులారా జీవని బ్లాగు, ఫేస్ బుక్లో కొన్ని మార్పులు చేద్దామని అనుకున్నాము. రొటీన్‌గా విరాళాలు, పిల్లలకు సంబంధించిన విషయాలే కాక కాస్త మానవ సంబంధాలపైన రాస్తే బావుంటుంది అనిపించింది. మేము విన్నవి కన్నవి మీతో పంచుకోవడం దీని ఉద్దేశం.
గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను సరిగా చూసుకోని పిల్లల గురించి విని మనసు చేదు అనిపించింది. అనంతపురం జిల్లాలో రైతు పడే కష్టాలు అన్నీఇన్నీ కాదు. అలాంటి రైతులు పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తే వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుని దూరప్రాంతాలకు ఎగిరిపోతే... వయసు మీదపడ్డాక ఆ తల్లిదండ్రులు మళ్ళీ వ్యవసాయం మీద ఆధారపడాల్సిన దుస్థితి ఉందని ఒకాయన చెప్పారు. మిత్రులతో కలసి ఒకరోజు ఎంజాయ్ చేసిన ఖర్చు తల్లిదండ్రులకు పదిరోజులకు తిండి అవుతుంది.
పల్లెలో పుట్టి పెరిగిన వెధవ ఈరోజు అమ్మానాన్నల దగ్గర ఒకరోజు ఉండటానికి ఇష్టపడటం లేదు అని మరొకాయన కంప్లైంటు
మా కాలేజీ రోజుల్లో వాడి నాన్న క్రమం తప్పక వచ్చేవాడు. నేను ఇంకెవర్నీ అలా చూడలేదు. కొడుకు చాలా మంచి స్థాయికి వెళ్ళాడు. నాన్న చనిపోయినపుడు అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు అని మరో మిత్రుడు చెప్పాడు.
విధి వక్రీకరిస్తే అంటే తల్లిదండ్రులు చనిపోతే మాత్రమే పిల్లలు ఆర్ఫన్స్ అవుతున్నారు.
పిల్లలు ఉండీ తల్లిదండ్రులు అనాధలు కావడం ఎంత బాధాకరం?
on
బ్లాగు, గూగుల్ ప్లస్, ఫేస్ బుక్ మిత్రులకు, జీవని కుటుంబసభ్యులకు పిల్లల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జీవనిలో నూతన సంవత్సర వేడుకలు ఎలా జరగాలని ప్లాన్ చేసామంటే....
INSPIRE - 2014 లేదా ప్రేరణ - 2014
ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చేసిన స్పీకర్ మాడుగుల చంద్రశేఖర శర్మ. కొద్ది రోజుల కిందట శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల కలయికలో ఈ అబ్బాయి మాట్లాడారు. ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ సెర్చ్ లో ఉన్నాడు. బీటెక్ విద్యార్థి సంస్కృత శ్లోకాలు పదబంధాలను విడమరచి చెప్పడం అద్భుతం అనిపించింది. చెప్పిన తీరు, దృక్పథం చాలా బావున్నాయి.
చంద్రశేఖర్ తో మాట్లాడి, పిల్లలకు మోటివేషనల్ క్లాస్ ఇవ్వాలని కోరగా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక జీవని కోర్ గ్రూపు సభ్యులు కూడా తలా 2 నిమిషాలు తము వ్యక్తిగతంగా భూత వర్తమాన భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష చేసి పిల్లల ముందు చెప్పాలి. పిల్లలు కూడా తాము గత సంవత్సరం చేసిన తప్పులు, కన్‌ఫెషన్... 2014లో ఎలా ఇంకా ఇంప్రూవ్ కావాలి అని మాట్లాడాలి. ప్రోగ్రాం రాత్రి 10 గంటలకు మొదలై 12 గంటలకు అయిపోతుంది. 12 గంటలకు కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాల గురించి గట్టిగా నినదిస్తూ 2014లో అడుగుపెట్టాలి. లక్ష్యసాధనకు కొత్త సంవత్సరానికి సంబంధం ఉండదనుకోండి. కానీ ఈ విషయం పిల్లలకు తెలీదు కదా 2014 పేరుతో వాళ్ళలో ఉత్తేజం నింపడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కాన్సెప్టు చెప్పిన మిత్రులు, ఈనాడు జర్నలిస్ట్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు.
మరి ఒరిజినల్గా జరిగిందేమిటి ?
డిసెంబర్ 31వ తేదీన ఉదయం వాంతులు విరేచనాలతో నేను ( ప్రసాద్ ) ఆస్పత్రి పాలవడం. పూర్తిగా కోలుకుని ఈ సాయంత్రం తిరిగి జీవనిలో అడుగుపెట్టాను. అప్పుడెప్పుడో ఆరేడేళ్ళ కిందట చికున్ గన్యా అలియాస్ చికెన్ గునియా వచ్చినపుడు ఆస్పత్రిలో చేరాను. సుదీర్ఘ విరామం తర్వాత ఇలా మళ్ళీ వెళ్ళాను.
జీవని బ్లాగు, ముఖపుస్తకం అప్డేట్ లేకపోవడానికి ఇది కారణం.
మరోసారి అందరికీ శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు అనుక్షణం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. జీవని పిల్లల్ని ఆర్థికంగా నైతికంగా ఆశీర్వదిస్తున్న దయార్ద్ర హృదయులకు ధన్యవాదాలు.
on