మిత్రులారా జీవని బ్లాగు, ఫేస్ బుక్లో కొన్ని మార్పులు చేద్దామని అనుకున్నాము. రొటీన్‌గా విరాళాలు, పిల్లలకు సంబంధించిన విషయాలే కాక కాస్త మానవ సంబంధాలపైన రాస్తే బావుంటుంది అనిపించింది. మేము విన్నవి కన్నవి మీతో పంచుకోవడం దీని ఉద్దేశం.
గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను సరిగా చూసుకోని పిల్లల గురించి విని మనసు చేదు అనిపించింది. అనంతపురం జిల్లాలో రైతు పడే కష్టాలు అన్నీఇన్నీ కాదు. అలాంటి రైతులు పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తే వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుని దూరప్రాంతాలకు ఎగిరిపోతే... వయసు మీదపడ్డాక ఆ తల్లిదండ్రులు మళ్ళీ వ్యవసాయం మీద ఆధారపడాల్సిన దుస్థితి ఉందని ఒకాయన చెప్పారు. మిత్రులతో కలసి ఒకరోజు ఎంజాయ్ చేసిన ఖర్చు తల్లిదండ్రులకు పదిరోజులకు తిండి అవుతుంది.
పల్లెలో పుట్టి పెరిగిన వెధవ ఈరోజు అమ్మానాన్నల దగ్గర ఒకరోజు ఉండటానికి ఇష్టపడటం లేదు అని మరొకాయన కంప్లైంటు
మా కాలేజీ రోజుల్లో వాడి నాన్న క్రమం తప్పక వచ్చేవాడు. నేను ఇంకెవర్నీ అలా చూడలేదు. కొడుకు చాలా మంచి స్థాయికి వెళ్ళాడు. నాన్న చనిపోయినపుడు అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు అని మరో మిత్రుడు చెప్పాడు.
విధి వక్రీకరిస్తే అంటే తల్లిదండ్రులు చనిపోతే మాత్రమే పిల్లలు ఆర్ఫన్స్ అవుతున్నారు.
పిల్లలు ఉండీ తల్లిదండ్రులు అనాధలు కావడం ఎంత బాధాకరం?
welcome sir.