ఇంటర్నెట్ సమస్య వల్ల బ్లాగు కాస్త ఆలస్యంగా అప్డేట్ చేస్తున్నాము. ఫేస్‌బుక్ మొబైల్ ద్వారా కావడంతో ఏరోజు కార్యక్రమం ఆ రోజే అప్డేట్ చేస్తున్నాము.

రెండ్రోజుల కిందట ఒక గొప్ప వ్యక్తిని కలిసాము. ఆయనపేరు సుబ్బరాజుగారు. అనంతపురంలో పర్యావరణం మహిళలు పిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్న టింబక్టు స్వచ్చంద సంస్థలో 14 సంవత్సరాలుగా పనిచేసారు. కేవలం విద్యారంగం మీద దృష్టి పెట్టడానికి ఆయన ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నారు.
విశేషం ఏమంటే 14 సంవత్సరాల క్రితమే ఆయన ఐ.ఐ.టిలో ఇంజనీరింగ్ మరియు పీహెచ్డీ చేసారు. పల్లెప్రాంతమైన చెన్నేకొత్తపల్లిలో స్థిరపడి ప్రజా చేస్తుండటం. ఎన్నో అవకాశాలను వదులుకుని సేవారంగలోకి రావడం!
ఆయన సింప్లిసిటీ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.
ఆయన్ను కలిసిన తర్వాత నిరాడంబరతను, వినయాన్ని, అంకితభావాన్ని ఇంకా పెంపొందించుకోవాలి అనిపించింది. 
ఆయన కొడిగెనహళ్ళి గురుకుల పాఠశాలలో చదివారు.
టింబక్టులో ఉన్నపుడు చదువులో చివరి ర్యాంకర్లను, బడి మానేసినవారిని చదివించామని వారిలో చాలామంది చక్కగా స్థిరపడ్డారని చెప్పారు. ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మరొకరు ప్రభుత్వ టీచర్ ఉన్నారు.

పచ్చటి ఇంట్లో తాము అనుకున్న జీవితాన్ని 100% తృప్తితో ఆనందిస్తున్నారు.  






విసనకర్ర చూపిస్తున్న వ్యక్తి సుబ్బరాజుగారు 

Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-
JULY - 2014 - 2,25,787/- 9,17,397/-

AUGUST - 2014

11000 - 2.8.14 - mason labor 
900 - 4.8.14 - electrician labor 9,29,297/-
7350 - 6.8.14 - paints
10300 - 9.8.14 - mason labor
300 - 10.8.14 - rod bender labor 

TOTAL - 9,47,247/-



on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo