అయ్యప్ప స్వామి భక్తులు పూజ
నిర్వహించి భిక్ష పెట్టే సంప్రదాయం మనందరికీ తెలుసు. భిక్షా కార్యక్రమానికి
అయ్యే ఖర్చును సేవా కార్యక్రమానికి వినియోగించాలని స్వాములు అనుకున్నారు. ఆ
మొత్తంతో జీవని నెలసరి భత్యాన్ని స్పాన్సర్ చేసారు . మొత్తం 11,000/-
రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు విరాళంగా ఇచ్చారు. అనంతపురానికి
చెందిన మణికంఠ బ్యాటరీ వర్క్స్ సంస్థ అధినేత జయచంద్ర నాయుడు, గోపాల్ వారి
మిత్రబృందం ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. వారికి జీవనిని పరిచయం చేసింది
మిత్రులు సాయి. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
on
బ్లాగర్ శ్రీమతి మధురవాణి గారు వారి జీవిత భాగస్వామి శ్రీ.ప్రసాద్ గారు 15,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం జీవనికి విరాళం అందిస్తున్నారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
November Donations
SBI
Sarva Sri.
Sujani - 500/-
Dasari Balasekhar - 500/-
Shiak shikshavali - 1000/-
Atluri Bhavani Charitable Trust - 5000/-
Noor Mahammad - 2000/-
Sridhar kethepally - 500/-
Anonymous - 5000/-
Janaki Maruthi - 1000/-
Sri Kalyani Viswanathan - 1000/-
Lavanya Polepalli - 5000/-
Sadlapalle Chidambara Reddy - 2000/-
Nagamani - 1000/-
Sujani - 500/-
Dasari Balasekhar - 500/-
Shiak shikshavali - 1000/-
Atluri Bhavani Charitable Trust - 5000/-
Noor Mahammad - 2000/-
Sridhar kethepally - 500/-
Anonymous - 5000/-
Janaki Maruthi - 1000/-
Sri Kalyani Viswanathan - 1000/-
Lavanya Polepalli - 5000/-
Sadlapalle Chidambara Reddy - 2000/-
Nagamani - 1000/-
ICICI
Nanda kiran kumar - 500/-
Udaybhaskar reddy - 1000/-
Mdhuravani & Prasad - 15,000/-
Udaybhaskar reddy - 1000/-
Mdhuravani & Prasad - 15,000/-
Andhra Bank
Usha Rani - 20,000/-
on
ఉదయం పిల్లలతో పాటు లేచి పిల్లలు పడుకున్నాక ఆమె పడుకుంటుంది. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది, ఆమె తత్వమే అంత. కానీ వాటి వెనుక అవ్యాజమైన ప్రేమ ఉంది. పిల్లల ఆరోగ్యం, తిండి, సాధకబాధకాలు.... జీవని క్యాంపస్‌లో చెట్ల పెంపకం, పరిశుభ్రత ఇలా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తూంటుంది. నిజానికి ఎక్కువ పనిపెట్టామా అనిపిస్తుంది.
అమ్మకు ఇలా సేవ చేయడం ముందునుంచీ అలవాటు. వైద్య ఆరోగ్య శాఖలో ఆమె రిటైర్ అయ్యారు. 1980 కాలాల్లో రవాణా సౌకర్యాలు లేనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా కాన్పులు చేయడానికి వెళ్ళేవారు. గర్భిణీల బంధువులు ఎద్దులబండిలో వచ్చి మేమున్న పంచాయితీ గ్రామం నుంచి పల్లెలకు పిల్చుకుపోయేవారు. చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేసేది. సేవాభావానికి నాకు స్ఫూర్తి ప్రదాతల్లో అమె కూడా ఒకరు.
నిజానికి ఆమెకు కేక్, సెలెబ్రషన్స్ ఇష్టంలేదు, కానీ పిల్లల ఆనందం కోసం ఒప్పుకుంది.
కొసమెరుపేమంటే ఇది ఆమె జీవితంలో జరుపుకున్న మొదటి పుట్టిన రోజు.
జీవని మనవళ్ళు, మనవరాళ్ళ తరఫున మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
అలాగే జీవని విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షహీన్ తాజ్ గారు తమ జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం స్పాన్సర్ చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
on
జీవనికి తమ సహకారాన్ని అందిస్తూ వస్తున్న మరువం ఉషగారు విరాళం అందించారు. ఉషగారికి నాన్న కేశవ రావు గారంటే ప్రాణం. ఆయన పేరిట విరాళం అందిస్తున్నారు. ఉషగారి దాతృత్వాన్నికుమారుడు యువ కూడా అందుకున్నారు. యువ తన మొదటి జీతం తీసుకున్నపుడు జీవనికి విరాళం ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
on