ఉదయం పిల్లలతో పాటు లేచి పిల్లలు పడుకున్నాక ఆమె పడుకుంటుంది. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది, ఆమె తత్వమే అంత. కానీ వాటి వెనుక అవ్యాజమైన ప్రేమ ఉంది. పిల్లల ఆరోగ్యం, తిండి, సాధకబాధకాలు.... జీవని క్యాంపస్‌లో చెట్ల పెంపకం, పరిశుభ్రత ఇలా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తూంటుంది. నిజానికి ఎక్కువ పనిపెట్టామా అనిపిస్తుంది.

అమ్మకు ఇలా సేవ చేయడం ముందునుంచీ అలవాటు. వైద్య ఆరోగ్య శాఖలో ఆమె రిటైర్ అయ్యారు. 1980 కాలాల్లో రవాణా సౌకర్యాలు లేనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా కాన్పులు చేయడానికి వెళ్ళేవారు. గర్భిణీల బంధువులు ఎద్దులబండిలో వచ్చి మేమున్న పంచాయితీ గ్రామం నుంచి పల్లెలకు పిల్చుకుపోయేవారు. చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేసేది. సేవాభావానికి నాకు స్ఫూర్తి ప్రదాతల్లో అమె కూడా ఒకరు.

నిజానికి ఆమెకు కేక్, సెలెబ్రషన్స్ ఇష్టంలేదు, కానీ పిల్లల ఆనందం కోసం ఒప్పుకుంది.
కొసమెరుపేమంటే ఇది ఆమె జీవితంలో జరుపుకున్న మొదటి పుట్టిన రోజు.
జీవని మనవళ్ళు, మనవరాళ్ళ తరఫున మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

అలాగే జీవని విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షహీన్ తాజ్ గారు తమ జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం స్పాన్సర్ చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.





on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. ఒక్కరోజు ఆలస్యంగా అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు :)) అప్యాయతతో అరచేవారు చాలామంది ఉంటారండీ. ఉద్దేశమే ప్రధానం తప్ప నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారికంటే ఉన్నదున్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారే బెటర్. మీ అమ్మ గురించి చెప్పినప్పుడు మా అమ్మ లక్షణాలూ గుర్తుకొచ్చి ఇలా వ్రాశాను. మీ సేవా లక్ష్య నిర్ణయానికి మీ అమ్మగారూ స్పూర్తిగా నిలచినందుకు, ఇప్పటికీ మీ సేవా కార్యక్రమాలలో తోడుగా ఉంటున్న ఆమె గారికి అభినందనలు. అలాగే షహీన్ తాజ్ గారికీ అభినందనలు. మీ ఆనందాన్ని మాతో పంచుకున్నదుకు ధన్యవాదములు.

     
  2. jeevani Says:
  3. Thank you very much sir

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo