మిత్రులారా నిన్నటి రోజు అశోక్ (5) అనే అబ్బాయిని మనం తీసుకోవడం జరిగింది. ఈ పిల్లవాడి అమ్మను వాళ్ల నాన్న హత్య చేసి చంపి పారిపోయాడట. అవ్వా తాతలు వాడి ఆలనాపాలనా చూసేవారు. ఈ అబ్బాయిది కర్నూల్ జిల్లా ఆదోని.




ఒకటి రెండురోజుల్లో మరో అబ్బాయిని తీసుకోవలసి ఉంది.


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

 pl. click on below link. thank you.

http://www.jeevanianantapur.com/dailybalance.php

Read More

శ్రీ. రూపేష్ కుమార్ గారు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, జె.పి.మోర్గాన్


కంపెనీ, డల్లాస్, టెక్సాస్ ప్రావిన్స్, అమెరికా,, జీవని స్వచ్చంద

సంస్థకు 10000/- రూపాయలు విరాళం ఇచ్చారని తెలియజేయడానికి

సంతోషిస్తున్నాము.


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...




Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More





Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123







Read More



ఇ.శంకరమ్మ ( కొండాపురం గ్రామం, గోరంట్ల మండలం, అనంతపురం జిల్లా ) గారి నుంచి విరాళం స్వీకరిస్తున్న జీవని కార్యకర్త నాగరాజు.





శివజ్యోతి ( సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్, TCS, చెన్నై )తరఫున విరాళం అందజేస్తున్న వెంకటరమణగారు, అందుకుంటున్నవారు జీవని కార్యకర్త విశ్వనాథ్



Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123


Read More

ఈ మెయిల్ చూసి కదలిపోయాను. ఇంతవరకు అందుకున్న ఇలాంటి మెయిల్స్ లో ఇదే చాలా గొప్పది అనిపించింది. ఈ కాలం పిల్లలు ఎంతైనా అదృష్టవంతులు. అన్నం తినకుండా మారాం చేస్తే మరుక్షణం కేజీల కొద్దీ చాక్లెట్లు చిప్స్ లాంటివి వచ్చిపడతాయి. ఇలా ఎన్నో విషయాల్లో తల్లిదండ్రులు ప్రాణంగా గారాబంగా చూసుకుంటున్నారు. ఇందుకు సంతోషమే. అయితే అతి అయిందంటే మన మెడకే చుట్టుకుంటుంది. మీ పిల్లాలు మారాం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారా? ఒకసారి ఈ మెయిల్ చూపించండి. మారతారేమో చూద్దాం!!



















Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

జీవని సంస్థ మొట్టమొదటి సమావేశం దిగ్విజయంగా జరిగింది. దాదాపు 100 మంది హాజరయ్యారు. ముందుగా అనుకున్నట్టు వేదిక, అతిథులు ఎవరూ లేకుండా కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. అనేకమంది అమూల్యమైన సలహాలు ఇచ్చారు.


అనంతపురంలోని శ్రీ రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత సాంబశివారెడ్డి జీవనికి భవిష్యత్తులో స్థలాన్ని కొని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందుకుగాను తాను 5 లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పారు. అలాగే ఆయన ఇద్దరు పిల్లల్ని పూర్తిగా స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 10000/- చెక్ అందజేశారు.


జీవని సలహా సంఘం చైర్మన్ జగదీశ్వర రెడ్డికి, చెక్ అందజేస్తున్న సాంబశివా రెడ్డి (కుడి)







గీతావాణి గారు ఒకరిని స్పాన్సర్ చేస్తానని చెప్పారు. ఈమె టేచర్ గా పని చేస్తున్నారు.


అనంతపురం దగ్గరలో ఉన్న సనపలోని విద్యాసంస్థ అధినేత రాణి గారు ప్రతి సంవత్సరం పిల్లలకు కావలసిన స్టేషనరీ కొని ఇస్తానని చెప్పారు. ఇలా చెబుతూ పోతే ఇంక ఉన్నారు. అందరికీ వందనాలు.

జీవని ముఖ్య సలహాదారు సాల్మన్ రాజు చేసిన ప్రసంగం అందర్నీ ట్రాన్స్ లోకి తీసుకుపోయింది. ప్రతి నెలా ఒకరు పిల్లల్ని ఔటింగ్ తీసుకువెళ్ళాలి అన్న ప్రతిపాదనకు మంచి స్పందన లభించింది. రాబోయే మూడు నాలుగు నెలలతో పాటు ముఖ్యమైన పండుగలకు పిల్లల్ని తమ ఇళ్ళకు పిల్చుకుపోవడానికి స్లాట్లు పూర్తి అయ్యాయి. మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం.


మొత్తమ్మీద ఈ సమావేశం అందరిలోనూ సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒక గొప్ప భవిష్యత్తు మా అందరి కళ్ళ ముందు ఆవిష్కారం అయింది. మన అంచనాలు సరిగా సాగితే వందలు వేల స్థాయిలో
పిల్లలకి మనం ఉజ్వలమైన భవితని అందించబోతున్నాము.
















పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న జీవని సలహాదారు సాల్మన్ రాజు, ప్రధాన కార్యదర్శి GNANENDRA.


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More



మిత్రులారా నిన్నటిరోజు పిల్లలను స్కూలుకు దగ్గరలోని రాజీవ్ చిల్డ్రన్ పార్క్ కు తీసుకువెళ్ళాం. అందరూ ఆనందంగా ఆడుకున్నారు. అంతకు ముందే కొద్దిపాటి వర్షం వచ్చింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. లైటింగ్ సరిగాలేక కేవలం రెండు ఫోటోలు మాత్రమే తీశాము. టేచర్ రాధిక గారు పిల్లలకు తినుబండారాలు తెచ్చారు. ఆమె పిల్లలకు కొసరి కొసరి తినిపించారు. ఊయలలో ఊగించి జారుడుబల్లపై ఆడించారు. మరో టీచర్ రవి కుమార్ పిల్లలకు ఐస్ తెచ్చి ఇచ్చాడు. పిల్లలు తృప్తిగా ఆనందంగా తిరిగి స్కూల్ హాస్టల్ చేరుకున్నారు.


అప్పుడు మాకో ఆలోచన వచ్చింది. ప్రతి నెలా రెండో ఆదివారం పిల్లల్ని పార్క్ తీసుకువెళ్తాం. అనంతపురంలో ఉన్న జీవని సభ్యులు ఒకోరు ఒకసారి తమ పిల్లల్ని కూడా తెచ్చి వీరితో గడిపితే బావుంటుంది అని.

Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More



ఈ ఫొటోను ముందువారం కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ నుంచి తీశారు

కవి హృదయం ఉన్నవారు ఓ నాలుగు లైన్లు రాయండి ఇంకా బావుంటుంది.


Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

మిత్రులారా, ఈ నెల 26న చివరి ఆదివారం సమావేశం నిర్వహిద్దాం అని అనుకుంటున్నాం. వేదిక ఎన్.జీ.ఓ హోం, అనంతపురం, 10-1 గం. వరకు. ఇది టెంటేటివ్ మాత్రమే. ఈ వారం ఆఖరుకు ఖరారు అవుతుంది. జీవని సభ్యులు అందరూ తప్పక హాజరు కావల్సిందిగా మనవి. అలాగే ఎవరైనా మిత్రులు వస్తే తప్పక తీసుకురండి.



మీటింగ్ ఇలా నిర్వహిద్దాం అనుకుంటున్నాం. మీకు ఏవైనా లోటుపాట్లు కనిపించినా, మరేదైనా ఆలోచన వచ్చినా మార్పులు చేర్పుల గురించి దయచేసి తెలియజేయండి.


100-150 మంది హాజరు అవుతారు.

వేదిక లేదు. పిల్లలు మాత్రమే వేదిక మీద ఉంటారు.

ఎవరు మాట్లాడవలసినపుడు వారు మాత్రమే మైకు దగ్గరకు లేదా వేదిక మీదకు వెళ్తారు.
జీవని కార్యకర్త సంస్థ గురించి 5 ని. మాత్రమే మోటివేషనల్ క్లాస్ తీసుకుంటాడు.

ప్రధాన కార్యదర్శి ఇంత వరకు జరిగిన కార్యక్రమాలపై నివేదిక సమర్పిస్తాడు.

జీవని సలహా సంఘం చైర్మన్ జీవని భవిష్యత్ కార్యక్రమాలపై వివరణ ఇస్తాడు.

ఆ తర్వాత అందరికీ అవకాశం. ఎవరైనా మాట్లాడవచ్చు.

కానీ వారి ప్రసంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత పొగడ్తలు, సంస్థపై పొగడ్తలు ఉండకూడదు.

జీవని సంస్థ వ్యక్తిగతమైన ఫోకస్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది.

ఇది అందరి సంస్థ సేవా దృక్పథం ఉన్నవారికి ఇది ప్లాట్ ఫాం అని సవినయంగా మరోసారి విన్నవించుకుంటున్నాం.

జీవని సంస్థ విస్తరణకు, పిల్లలకు మరింత సేవ చేసే అవకాశాల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది.

బోరు కొట్టించే ప్రసంగాలు, పూలమాలలు, పొగడ్తలు... వీటికి భిన్నంగా మన కార్యక్రమం జరపాలని అనుకుంటున్నాం. చివరగా పిల్లలతో మాట్లాడించడం మరియు పిల్లలతో సభ్యుల ఇంటరాక్షన్.

మిత్రులారా ఇదీ ఒక రఫ్ ప్రణాళిక. దీనికి సంబంధించిన మీ సలహాలను సూచనలను కోరుతూ.....




Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

05596 ----------BALANCE AS ON 30.6.09


14400----------DONATIONS UP TO 11.7.09
----------------------------------------------
19996 ----------TOTAL AMOUNT

06500-----------EXPENDITURE
------------------------------------
13496------------BALANCE AS ON 12.7.09
------------------------------------





05700--------------DIRECT CREDITS IN TO ICICI BANK A/C

10000------------- EXISTING BALANCE IN BANK A/C - (MIN. BALANCE)
----------------------------------------------------------------------------------------
15700------------- TOTAL BALANE IN BANK A/C - ( INCLUDES MINIMUM BALANCE)
-----------------------------------------------------------------------------------------

*** KINDLY NOTE THAT BALANCE AVAILABLE IN BANK A/C WILL MAKE CORPUS FUND. ALONG WITH THIS EVERY MONTH SOME PERCENTAGE OF AMOUNT GOES IN TO CORPUS FUND. IT WILL HELP US WHEN WE ARE DEADLY IN NEED OF MONEY.

*** BALANCE AMOUNT SHOWN IN SMS WILL VARY THE ORIGINAL ONE. BECAUSE IT IS UPDATED ON DAILY BASIS. ONLY ONE DONOR'S NAME SENT PER A DAY. SO THAT WE WILL HAVE EVERY DAY CONTACT.

EXPENDITURE
-----------------------

1) 5000---------HOSTEL FEES ADVANCE FOR BHASKAR

2) 1500 ---------LABOUR FOR TAILOR
---------------------------------------------------------
6500 ---------TOTAL
---------------------------------------------------------


BILLS
-----------



RECEIPTS IN THE ABOVE IMAGE ARE, OF THOSE WHO SENT THEIR CONTRIBUTION BY ONLINE TRANSFER MODE. THESE RECEIPTS SENT TO THEIR E MAILS.


WITH YOUR KIND COOPERATION,
JEEVANI VOLUNTARY ORGANISATION.... COMMITTED FOR 100% TRANSPARENCY.


BANK : ICICI
A/C NO : 043905000999
NAME : JEEVANI VOLUNTARY ORGANISATION
TYPE : CURRENT ACCOUNT
BRANCH : ANANTAPUR


Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

మా బడికి దగ్గర్లోనే రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల ఉంది. మొన్న వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అంశం బాలికల విద్య పేదరికం. దీన్ని వైద్య ఆరోగ్య శాఖవారు నిర్వహించారు. బాలికలు పూర్తిగా అక్షరాస్యులైతే భవిష్యత్తులో జనాభా నియంత్రణ జరుగుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. ఈ ప్రచారంలో భాగంగా రకరకాల పోటీలు నిర్వహిస్తున్నారు.



సరే పొటీ మొదలైంది. పిల్లలు వివిధ కోణాల్లో తాము సేకరించిన సమాచారాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ముత్యాలమ్మ అనే అమ్మాయి వంతు వచ్చింది. అమ్మాయిలు చదువుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు అంటూ ఇళ్ళల్లో తల్లిదండ్రులు రకరకాల పనుల్లో మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇంటిపని, వంటపని, కట్టెలు కొట్టుకురావడం, అప్పుడప్పుడు కూలి పని, పొద్దున సాయంత్రం బయటి ఇళ్ళల్లో పాచిపని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంతా చేస్తే నోటు పుస్తకాలు మొదలుకుని ఒక పెన్సిల్ కొనాలన్న ఇంట్లో పెద్ద యుద్ధమే చేయాలి. కానీ మాకు చదవాలని ఉంది అంటూ ఆ అమ్మాయి వల వలా ఏడ్చేసింది. జడ్జీలు మిగతా టేచర్లలో కూడా కన్నీటి పొర.

ఆ అమ్మాయి ఇప్పుడు 10వ తరగతి. సులభంగా 500 మార్కులుపైన తెచ్చుకుంటుందని అందరూ ఊహిస్తున్నారు. ఒక్కసారిగా అందరూ తేరుకుని ఆ అమ్మాయిని ట్యూషన్ పంపడానికి, నోటు పుస్తకాలు , ఇతర సామాగ్రి అన్నీ తీసివ్వడానికి టీచర్లు సంసిద్ధత తెలిపారు. మరి తెలియకుండా మిగిలిపోయిన పిల్లలు ఎంతమంది ఉంటారు? 500 మార్కులు ప్రస్తుత కాలంలో పెద్దమార్కులు కానే కాదు. ఎవరికి? తల్లిదండ్రుల మార్కుల దాహంలో పొద్దుటే లేచి ఇష్టం ఉన్నా లేకపోయినా బూస్టో హార్లిక్సో తాగేసి రోజును మొదలుపెట్టి మళ్ళీ ఏ అర్ధరాత్రో పడుకునే వరకూ చదివి చదివి చదువే ఒక హింసగా తయారైన వారికి. కానీ ఈ పేద పిల్లలకు మరో రకమైన హింస. వీళ్ళు దొంగచాటుగా తల్లిదండ్రులను తప్పించుకుంటూ చదవాలి. మరి వీళ్ళకు 500 మార్కులు దాటడం గొప్పే కదా? వీళ్ళందరి తెలివితేటలు ఏ ఇంటర్మీడియెట్ లోనో భూస్థాపితం అయిపోతాయి. మొండిఘటాలైతే మరో మూడేళ్ళు లాక్కుపోతారు. కానీ చివరాఖరుకు ఎంతమంది ఇలాంటి పిల్లలు పూర్తి స్థాయిలో చదివి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు?????????????


ఇలాంటివి ఎన్ని ఉన్నా కార్పొరేట్ భారత్ వెలిగిపోతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో మన దేశం ప్రాతినిధ్యం హనుమంతుడి తోకలా పెరిగిపోతూనే ఉంటుంది. మరి ఈ అసమానతలు ఈ సమస్యలు ఈ కన్నీళ్ళు మన నాయకులకుగానీ వారికి సలహాలు అందించే అత్యున్నత తెలివితేటల అయ్యేయస్సుల వారికి తెలీదా? మన అందరికంటే క్షుణ్ణంగా పూర్తి స్థాయి కాకి లెక్కలతో బాగా తెలుసు. అయినా ఎక్కడి వారు అక్కడే గప్ చుప్. ఎవరి "పని" వారిదే!!



Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

నిన్నటి రోజు భాస్కర్ అనే అబ్బాయిని జీవని సంస్థ అక్కున చేర్చుకుంది. ఈ బాబుకు 6 సంవత్సరాలు. తల్లిదండ్రులు చిన్నపుడే చనిపోయారు. అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప అనే ఊరికి చెందినవాడు. ఈ అబ్బాయి ఫోటోను వీలైనంత తొందరగా బ్లాగులో ఉంచుతాము.




అలాగే నిన్న పిల్లలకు ఒక్క్కొక్కరికి 9 జతల బట్టలు పంపిణీ చేశాము.ఈ కార్యక్రమం సాదాసీదాగా దాతల సమక్షంలో జరిగింది. జీవని సంస్థకు సంబంధించిన కార్యక్రమాల్లో వీలైనంతవరకు వేదిక లేకుండా చూడాలన్నది మన ఆశయం. వ్యక్తులు కాకుండా సంస్థ ఫోకస్ కావలన్నదే మన లక్ష్యం. ఎలాంటి మీటింగులు జరిగినా డయాస్, ఊకదంపుడు కబుర్లు, సొంత డబ్బా , పొగడ్తలు, వ్యక్తి పూజ,వ్యక్తుల ప్రచారం మొదలైన వాటిని పూర్తిగా అరికట్టాలని మన ఉద్దేశ్యం. తప్పని సరిగా విధి లేని పరిస్థితుల్లో మాత్రమే డయాస్ అన్నది కార్యక్రమంలో ఉంటుంది. అన్నిటిని ప్రక్షాళన చేసుకుంటూ మనకంటూ ఒక స్వచ్చమైన వ్యవస్థను నెలకొల్పే దిశగా వెళ్తున్నాం. అందుకే ప్రతి అంశాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించి, అన్ని రకాల జాడ్యాలను సమూలంగా తొలగిస్తున్నాం. కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా వీలైనంత త్వరలో బ్లాగులో ఉంచుతాము.



NAME : JEEVANI VOLUNTARY ORGANISATION
BANK : ICICI
A/C NO : 043905000999
TYPE : CURRENT ACCOUNT
BRANCH : ANANTAPUR


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo