జీవని సంస్థ మొట్టమొదటి సమావేశం దిగ్విజయంగా జరిగింది. దాదాపు 100 మంది హాజరయ్యారు. ముందుగా అనుకున్నట్టు వేదిక, అతిథులు ఎవరూ లేకుండా కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. అనేకమంది అమూల్యమైన సలహాలు ఇచ్చారు.
అనంతపురంలోని శ్రీ రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత సాంబశివారెడ్డి జీవనికి భవిష్యత్తులో స్థలాన్ని కొని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందుకుగాను తాను 5 లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పారు. అలాగే ఆయన ఇద్దరు పిల్లల్ని పూర్తిగా స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 10000/- చెక్ అందజేశారు.
జీవని సలహా సంఘం చైర్మన్ జగదీశ్వర రెడ్డికి, చెక్ అందజేస్తున్న సాంబశివా రెడ్డి (కుడి)
గీతావాణి గారు ఒకరిని స్పాన్సర్ చేస్తానని చెప్పారు. ఈమె టేచర్ గా పని చేస్తున్నారు.
అనంతపురం దగ్గరలో ఉన్న సనపలోని విద్యాసంస్థ అధినేత రాణి గారు ప్రతి సంవత్సరం పిల్లలకు కావలసిన స్టేషనరీ కొని ఇస్తానని చెప్పారు. ఇలా చెబుతూ పోతే ఇంక ఉన్నారు. అందరికీ వందనాలు.
జీవని ముఖ్య సలహాదారు సాల్మన్ రాజు చేసిన ప్రసంగం అందర్నీ ట్రాన్స్ లోకి తీసుకుపోయింది. ప్రతి నెలా ఒకరు పిల్లల్ని ఔటింగ్ తీసుకువెళ్ళాలి అన్న ప్రతిపాదనకు మంచి స్పందన లభించింది. రాబోయే మూడు నాలుగు నెలలతో పాటు ముఖ్యమైన పండుగలకు పిల్లల్ని తమ ఇళ్ళకు పిల్చుకుపోవడానికి స్లాట్లు పూర్తి అయ్యాయి. మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం.
JEEVANI
మొత్తమ్మీద ఈ సమావేశం అందరిలోనూ సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒక గొప్ప భవిష్యత్తు మా అందరి కళ్ళ ముందు ఆవిష్కారం అయింది. మన అంచనాలు సరిగా సాగితే వందలు వేల స్థాయిలో
పిల్లలకి మనం ఉజ్వలమైన భవితని అందించబోతున్నాము.
పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న జీవని సలహాదారు సాల్మన్ రాజు, ప్రధాన కార్యదర్శి GNANENDRA.
Join hands with...
JEEVANI
......FOR UNCARED
contact : jeevani.sv@gmail.com
9440547123
0 వ్యాఖ్యలు