మిత్రులారా పిల్లలకు హోం సిక్ హాలిడేస్ వదిలారు. నలుగురు పిల్లలు వాళ్ళ అవ్వాతాతల దగ్గరికి వెళ్ళారు.తిరిగి సోమవారం వస్తారు.
రెండు రోజుల కిందటి నుంచి ముగ్గురు అనాధ పిల్లల గురించిన వార్తలు పేపర్లలో వచ్చాయి. ఒక అబ్బాయి తల్లిదండ్రులు ఎయిడ్స్ తో చనిపోయారు. అలాంటి పిల్లలని చేరదీస్తున్న సంస్థ ఆ అబ్బాయిని తీసుకుపోయింది. మిగిలిన ఇద్దరిలో ఒకరి వయసు 11 సంవత్సరాలు, కాబట్టి మనం తీసుకోము. మూడో అబ్బాయి కోసం ప్రయత్నించాం. ఆ అబ్బాయి బంధువులను కలిశాం. కానీ పిల్లలు లేని భార్యా భర్తలు వాడిని పెంచుకోవడానికి ముందుకు వచ్చారు. అక్కడ ఇంకా బాగా న్యాయం జరిగే అవకాశం ఉంది. కాట్టి వెనక్కి తిరిగాం. ఒకవేళ వారు మనసు మార్చుకుంటే ఆ
అబ్బాయి మన జీవని కుటుంబంలోకి వస్తాడు
అదే విధంగా నెల చివర కాబట్టి మొన్నటి వరకు విరాళాల సేకరణ మందగించింది. నెలవారీ దాతలు డబ్బులు ఇస్తున్నారు. అన్ని తిరిగి ఆదివారం బ్యాలన్స్ షీట్లో చూపుతాము. అలాగే నెలవారీ దాతల వివరాలు కూడా కొంచెం ఆలస్యంగా అందిస్తాము క్షమించండి.
ఇవి జరుగుతున్న విషయాలు.
అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...
Join hands with...
JEEVANI
JEEVANI
......FOR UNCARED
contact : jeevani.sv@gmail.com
9440547123

11 years ite teesukovadaaniki emi ayyindi bosssssss........