Blogger Vinay Chakravarthi.Gogineni said...

11 years ite teesukovadaaniki emi ayyindi bosssssss........

July 3, 2009 10:14 AM


వినయ్ చక్రవర్తి గారూ జీవనిపై స్పందించినందుకు ధన్యవాదాలు.

జీవని సంస్థ 6-8 సంవత్సరాల పిల్లలను మాత్రమే ప్రస్తుతానికి చదివిస్తోంది. దీనికి గల కారణం: 5వ తరగతి నుంచి పిల్లలకు AP RESIDENTIAL SCHOOLS, NAVODAYA, SAINIK SCHOOL లాంటి వాటి ప్రవేశ పరీక్షలు మొదలవుతాయి. వాటికి ప్రిపేర్ చేయించడానికి మాత్రమే ఈ నిబంధన పెట్టుకున్నాము. పిల్లలను వీలైనంత వరకు వాటిలోకి పంపించి మరింత మెరుగైన విద్య అందించాలన్నది సంస్థ లక్ష్యం. సంస్థ ఇంకా బాల్య దశ లోనే ఉంది. అందువల్ల పిల్లలకు కేవలం షెల్టర్ గా ఉండదలచుకోలేదు. వారిని అలాంటి పాఠశాలలకు పంపితే వారి మీద ఖర్చు చాలావరకు తగ్గుతుంది. వారికి కావలసిన బయటి ఖర్చులు, ఆత్మస్థైర్యాన్ని, దాతలతో సంబంధాల్ని ఎప్పటిలాగే అందిస్తుంది. అదే సమయంలో వారి స్థానంలో మరికొంతమందిని చేర్చుకుని సేవలు ఎక్కువ మందికి అందించవచ్చు.

తర్వాతి దశల్లో సంస్థ పూర్తి స్థాయిలో నిలదొక్కుకున్నాక అందర్నీ అక్కున చేర్చుకుని వారిని మనమే చదివించడం జరుగుతుంది. వీలైనంతవరకు ఏదో ఒక వ్రుత్తిలో స్థిరపడేలా చేస్తుంది.


ఈ సమాధానం మీకు త్రుప్తి కలిగించక పోతే దయచేసి నిర్మొహమాటంగా చెప్పండి. అందరి సలహాలు సహకారంతోనే సంస్థ పిల్లలకు ఇంకా ఇంకా సేవలు అందించగలుతుంది.


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...






Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123








on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo