కాకినాడ అంటే కాజా గుర్తొచ్చేది... ఒకప్పుడు
మిధునం అంటే అప్పదాసూ బుచ్చి లక్ష్మీ గుర్తొచ్చేవారు... ఒకప్పుడు
జాటర్ ఢమాల్ అంటే బుడుగు గుర్తొచ్చేవాడు... ఒకప్పుడు.... ఒకప్పుడు.!
పుస్తకాల పండగొస్తే.. మనకెదురొస్తారతను.
మా పుస్తకాల అర చూస్తే.. కనిపిస్తారతను..!
పిల్లాడిలా అల్లరి చేసినా..అతనే
పెద్దోడిగా బుద్ధులు చెప్పినా..అతనే..
అలవోక గా పేరడీలు రాసినా.. అతనే
అవలీల గా సెటయిర్లు వేసినా.. అతనే..
గ్రీన్ టీ గ్లాస్ చూసినా అతనే...
సిట్రా డ్రింక్ సీసా తీసినా అతనే...
మేము నవ్విన నవ్వుల్లో, పంచుకున్న ఆనందాల్లో, అందుకున్న జ్ఞాపికల్లో, నెమరేసుకొనే మధుర జ్ఞాపకాల్లో... మా జీవితాల్లో .... మా హృదయాల్లో.. ఎప్పటికీ... అతనే..!
- courtesy : Raj Kumar ( blogger )
కొద్ది నెలల కిందట బ్లాగర్ శంకర్ గారు మనల్ని వదిలి వెళ్ళిన విషయం తెలిసిందే.
శంకర్ గారి స్మృత్యర్థం వారి శ్రీమతి స్వాతి గారు జీవనికి 15,000/- విరాళం అందించారు.
మరో నెలరోజుల్లో జీవనికి వస్తాను అని ఆనాడు చెప్పి వాగ్దాన భంగం చేసి సుదూరతీరాలకు వెళ్ళిన శంకర్ గారి ఆత్మశాంతి కోరుతూ...
వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పిల్లల తరఫున దేవుడిని ప్రార్థిస్తూ...
జీవని
