blogger Raj Kumar post......


మిత్రులారా..!!
జీవని  చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం నేను నా బ్లాగర్ ఫ్రెండ్స్ అయిన శ్రీనివాస్, కార్తీక్, నాగార్జున, సురేష్ గారు, Ravi ENV లతో పాటూ చాలామంది తెలుగు బ్లాగర్లం  కలిసి అనంతపురం లో ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ (A
musical night by differently able) చేయడానికి సంకల్పించాం.

తేది. 01-02-2015
ప్రదేశం: లలిత కళా పరిషత్, అనంతపురం.
సమయంః సాయత్రమ్ 6 గం. నుండి.
అతిధులుః 

Kireeti Damaraju Garu ( Second Hand Movie Fame)
Ravi Varma Garu ( Vennela , Bommarillu Fame)
Sudhakar Komukula Garu ( Life is Beautiful Fame)
Music Director Agasthya Garu ( Pellaina Kothalo Fame)
Lyric Writer Vanamali Garu
Director Madan Garu ( pellaina Kothalo Fame )
Anchor Chitra Lekha Garu
Anchor Eswar Garu మొదలగు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిధులుగా రావడానికి అంగీకరించారు. 

మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. అటెండ్ అవ్వడానికి కుదరక పోయినా సహాయం చేయాలనుకునేవారు 1000/- ఈ టికెట్  కొనడం ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొనవచ్చు. ఈవెంట్ లైవ్ టెలీకాస్ట్ చెయ్యబడుతుంది.
మరిన్ని వివరాల కోసం  దయచేసి jeevani.sv@gmail.com కు మెయిల్ లేదా 9505201111  నెంబరుకు ఫోన్ చేయగలరు. 

http://jeevani2009.blogspot.in/2008/12/blog-post.html
https://www.youtube.com/watch?v=KbSRgXLiziM&feature=youtu.be
 
 
 
 
 
 

Read More



మిత్రులారా నమస్కారం. జీవని ఆవిర్భావం నుంచి బ్లాగర్లు ఇస్తున్న తోడ్పాటు మాటల్లో చెప్పలేనిది. బ్లాగు చూసి జీవనికి సహాయం అందిస్తున్న దాతలు ఎందరో ఉన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
బాలికల డార్మిటరీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్లాగర్ల ఆలోచన ఒక కార్యక్రమానికి నాంది పలికింది. హృదయస్పందన పేరుతో అంధ కళాకారులతో ఒక మ్యూజికల్ నైట్ చేద్దాం అన్నది ఆ ఆలోచన. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్, సురేష్ పెద్దరాజు గార్లు ప్రత్యక్షంగా మరియు
చాలా మంది పరోక్షంగా  రంగంలోకి దిగారు. 1.2.15 న అనంతపురంలోని లలిత కళాపరిషత్ వేదికగా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కొందరు సినీ ప్రముఖులు రావడానికి అంగీకరించారు.

ఇందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. రావాలనుకున్నవారు 9505201111 కు ఫోన్ చేయవలసిందిగా మనవి. ఇక్కడికి రాలేకపోయినా సహాయం చేయాలనుకునేవారు 1000/- ఈ టికెట్ కొనవచ్చు. మరిన్ని వివరాలకోసం దయచేసి jeevani.sv@gmail.com కు మెయిల్ లేదా పై నెంబరుకు ఫోన్ చేయగలరు.



 


ఈ-టికెట్ కొన్న దాతలకు ధన్యవాదాలు




Read More

చి. శ్రీమహి s/o  శ్రీ.చందగాని నాగశేఖర్ & శ్రీమతి. అనిత గార్లు 5000/-
చి. నవీన్ దత్తా s/o  శ్రీధర్ ఫణి &  శ్రీమతి సునీతా దేవి  గార్లు 3100/-
చి.ఫర్హాన్ s/o శ్రీ. బాబా ఫకృద్దీన్ &  శ్రీమతి నసీమా 1000/- విరాళాలు అందించారు
పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు



Read More



శ్రీ.రామేశ్వర రెడ్డి మరియు శ్రీమతి.లలిత గార్లు తమ కుమార్తె షర్నిక పుట్టినరోజు సందర్భంగా జీవనికి 13,500/- విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




Read More

 నేటి రంగవల్లి 


 చెట్లకు నీళ్ళు పట్టడం వాడి ఉద్దేశ్యం 



 జీవనిలో స్టాఫ్ మొత్తం షిరిడి వెళ్ళారు. అందుకే వీరు వంట సేక్షన్లోకి దిగారు . 




 క్రికెట్ పిచ్చి 




 ఇసుక మాఫియా 






 బుద్ధిమంతులు 
 
 
 
 దేవుడా మమ్మల్ని చల్లగా చూడు ... 


 విందుభోజనం 



విటమిన్ డి కూడా కావాలి

Read More



Read More


శ్రీనివాస రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, గుత్తి మరియు శ్రీమతి నాగలక్ష్మి గార్ల కుమారుడు చి. మోక్ష చైతన్య జన్మదినం సందర్బంగా జీవనిలో కేకు కట్ చేసి పిల్లలకు స్వీట్స్ పంచారు.                      శ్రీనివాసరెడ్డి గారు జీవని ప్రధాన బాధ్యుల్లో ఒకరు.  వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.                




Read More

అనంతపురం ఎక్సైజ్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ. నరసింహులు మరియు శ్రీమతి శ్రీ లక్ష్మి గార్లు తమ కుమారుడు చి. హిమవర్ష్ పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More


అయ్యప్ప స్వామి భక్తులు పూజ నిర్వహించి భిక్ష పెట్టే సంప్రదాయం మనందరికీ తెలుసు. భిక్షా కార్యక్రమానికి అయ్యే ఖర్చును సేవా కార్యక్రమానికి వినియోగించాలని స్వాములు అనుకున్నారు. ఆ మొత్తంతో జీవని నెలసరి భత్యాన్ని స్పాన్సర్ చేసారు . మొత్తం 11,000/- రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు విరాళంగా ఇచ్చారు. అనంతపురానికి చెందిన మణికంఠ బ్యాటరీ వర్క్స్ సంస్థ అధినేత జయచంద్ర నాయుడు, గోపాల్ వారి మిత్రబృందం ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. వారికి జీవనిని పరిచయం చేసింది మిత్రులు సాయి. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 





Read More

 
బ్లాగర్ శ్రీమతి మధురవాణి గారు వారి జీవిత భాగస్వామి శ్రీ.ప్రసాద్ గారు 15,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం జీవనికి విరాళం అందిస్తున్నారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




November Donations
SBI
Sarva Sri.
Sujani - 500/-
Dasari Balasekhar - 500/-
Shiak shikshavali - 1000/-
Atluri Bhavani Charitable Trust - 5000/-
Noor Mahammad - 2000/-
Sridhar kethepally - 500/-
Anonymous - 5000/-
Janaki Maruthi - 1000/-
Sri Kalyani Viswanathan - 1000/-
Lavanya Polepalli - 5000/-
Sadlapalle Chidambara Reddy - 2000/-
Nagamani - 1000/-
ICICI
Nanda kiran kumar - 500/-
Udaybhaskar reddy - 1000/-
Mdhuravani & Prasad - 15,000/-
Andhra Bank
Usha Rani - 20,000/-

Read More



ఉదయం పిల్లలతో పాటు లేచి పిల్లలు పడుకున్నాక ఆమె పడుకుంటుంది. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది, ఆమె తత్వమే అంత. కానీ వాటి వెనుక అవ్యాజమైన ప్రేమ ఉంది. పిల్లల ఆరోగ్యం, తిండి, సాధకబాధకాలు.... జీవని క్యాంపస్‌లో చెట్ల పెంపకం, పరిశుభ్రత ఇలా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తూంటుంది. నిజానికి ఎక్కువ పనిపెట్టామా అనిపిస్తుంది.

అమ్మకు ఇలా సేవ చేయడం ముందునుంచీ అలవాటు. వైద్య ఆరోగ్య శాఖలో ఆమె రిటైర్ అయ్యారు. 1980 కాలాల్లో రవాణా సౌకర్యాలు లేనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా కాన్పులు చేయడానికి వెళ్ళేవారు. గర్భిణీల బంధువులు ఎద్దులబండిలో వచ్చి మేమున్న పంచాయితీ గ్రామం నుంచి పల్లెలకు పిల్చుకుపోయేవారు. చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేసేది. సేవాభావానికి నాకు స్ఫూర్తి ప్రదాతల్లో అమె కూడా ఒకరు.

నిజానికి ఆమెకు కేక్, సెలెబ్రషన్స్ ఇష్టంలేదు, కానీ పిల్లల ఆనందం కోసం ఒప్పుకుంది.
కొసమెరుపేమంటే ఇది ఆమె జీవితంలో జరుపుకున్న మొదటి పుట్టిన రోజు.
జీవని మనవళ్ళు, మనవరాళ్ళ తరఫున మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

అలాగే జీవని విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షహీన్ తాజ్ గారు తమ జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం స్పాన్సర్ చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.





Read More


జీవనికి తమ సహకారాన్ని అందిస్తూ వస్తున్న మరువం ఉషగారు విరాళం అందించారు. ఉషగారికి నాన్న కేశవ రావు గారంటే  ప్రాణం. ఆయన పేరిట విరాళం అందిస్తున్నారు. ఉషగారి దాతృత్వాన్నికుమారుడు యువ కూడా అందుకున్నారు. యువ తన మొదటి జీతం తీసుకున్నపుడు జీవనికి విరాళం ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



Read More





దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని  ఆశిస్తున్నా 


 posted by : kovela santosh kumar

Read More

ఓ రెండేళ్ల కిందట ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తాను చంద్రశేఖర్, ఈటీవి అనంతపురం అని పరిచయం చేసుకున్నారు. బ్లాగులో జీవని గురించి చూసానండీ చాలా బావుంది ఒకసారి ఈటీవిలో కథనం వేద్దాం అన్నారు. ఈలోపు బాలికల డార్మిటరీ నిర్మాణం ప్రారంభం అయింది. ఇది పూర్తి అయ్యాక ఈటీవిలో వస్తే బావుంటుందని అనుకున్నాము. తర్వాత దాని గురించి ఇద్దరం మరచిపోయాము. మళ్ళీ ఉన్నట్టుండి శేఖర్ గారు స్టోరీ చేసేద్దాం అని మొన్న షూటింగ్ పెట్టారు. వస్తూవస్తూ తన పిల్లల్ని తీసుకొచ్చారు జీవని పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంచారు. రమణ గారు, చాలా ఓపిగ్గా దృశ్యాలు సేకరించారు.
వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము


 ఆలూరు సాంబశివా రెడ్డి, కార్యదర్శి, జీవని


సుప్రజ, జీవని అమ్మాయి

Read More


అనంతపురంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు

Read More



నాలుగేళ్ళుగా తమతో పాటు ఉండి ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి మాయం అయితే... 

మిత్రుడి ఙ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ కన్నీళ్ళను ఆపుకోడానికి మరోచోట ఆనందం పొందాలని సేద తీరాలని వారంతా జీవనికి వచ్చారు. 
పిల్లల్ని రోజంతా ఆడించారు చక్కటి బోజనం పెట్టారు పిల్లల నవ్వులతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిన తమ మిత్రుడికి నివాళులు అర్పించారు.
తమ క్లాస్‌మేట్ మేఘశ్యాం స్మృతిలో వారి మిత్రులు జీవనికి వచ్చారు. వారంత ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్నారు.
భాను అనే అమ్మాయి పుట్టినరోజు కూడా కావడంతో ఆ కార్యక్రమం జరిపారు. జీవని అబ్బాయి హరిక్రిష్ణ బర్త్‌డే కూడా అదే రోజు.
మేఘశ్యాం మిత్రులంతా జీవనికి సర్వింగ్ టేబుల్స్ విరాళంగా ఇచ్చారు
వారితో పాటు లెక్చరర్స్ కూడా వచ్చారు, అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 










Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo