తల్లిదండ్రులు అందరు తమ పిల్లల్ని అందర్నీ సమానంగా చూస్తారా? బహుశా చూడలేరేమో! మధ్య ఉన్నత తరగతి వర్గాల గురించి చెప్పడం లేదు కానీ, మా బడిలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఎలాంటివారో మీకు చెప్తాను. పేదరికంలో ఆడపిల్లగా పుట్టడం ఎంత బాధాకరమో మా బడిలో పిల్లల్ని చూస్తే తెలుస్తుంది.


మొదటిది ఆడపిల్లకు తమ్ముడో చెల్లో పుట్టారనుకోండి బడి ఎగరగొట్టి వారి ఆలనా పాలనా చూడాలి. అలాగే ఇంటి పనిలో సగం ఎలాగూ చేస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఇంటిలో అమ్మాయి, అబ్బాయి ఉన్నపుడు అమ్మాయిని ప్రభుత్వ బడికి పంపుతారు అబ్బాయిని కాన్వెంటుకు పంపుతారు. కాన్వెంట్లో వాళ్ళు గొప్పగా చదువుతారని వీళ్ళ భ్రమ. కానీ అసలు విషయం ఏమంటే మా దగ్గర చదివే ఆడపిల్లలు చాలా తెలివిగా ఉంటారు. వారికంటే బాగా చదువుతారు.( మా గొప్పతనం కాదు గానీ ఎంత చిన్న చూపు చూసినా వారిలో చదువు పట్ల మమకారం కనిపిస్తుంది. దాని ప్రతిఫలమే వాళ్ళు బాగా చదవడం ) అయినప్పటికీ పుస్తకాలు కొనివ్వడం దగ్గర్నుండీ రకరకాలుగా ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది.

తల్లిదండ్రులు కూడా అందరూ దినసరి కూలీలే. పెద్ద సంతానం అమ్మాయి అయితే, తమ్ముడు లేక చెల్లిని నడిచే వయసు నించి బడికి అక్కతో పాటు పంపుతారు. చిన్న పిల్లలు వచ్చినప్పట్నుంచి ఏదో ఒక గొడవ చేస్తుంటారు. వాళ్ళకు బడిలో ఉన్నత సేపూ ముక్కు తుడుస్తూ మూతి తుడుస్తూ వారి సేవలోనే సరిపోతుంది. కానీ ఏ ఒక్క మగపిల్లవాడు కూడా తన తమ్ముడినో చెల్లినో బడికి తెచ్చిన సందర్భాలు లేవు. మగపిల్లలు మహరాజుల్లా పెరుగుతుంటారు.

మా బడికి కాస్త దూరంలోనే హైస్కూలు ఉంది. నా పాత విద్యార్థులు ఇప్పుడు 8, 9 తరగతులు చదువుతున్నారు. అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుంటారు. ( ఈ రోజు వచ్చారు అందుకే రాస్తున్నాను) ఇంట్లో రకరకాల కష్టాలు ఉన్నా, దీటుగా ఎదుర్కొని చదువులో ముందంజలో ఉన్న ఆ చిట్టితల్లుల్ని చూస్తే మనసు త్రుప్తిగా ఉంటుంది.



అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

TOTAL AMOUNT RECEIVED: 41900


EXPENDITURE : 35904

BALANCE AMOUNT : 5996



EXPENDITURE IN DETAIL
-----------------------------
20000- school fees with hostel, books. note books
10000- minimum balance in ICICI account
3588 - cloths 9 pairs ( 6 school dress + 3 color)
475- bed sheets, towels
676- scool bags, mats
250- slates, boxes, pens etc...
415 - soaps, brush etc...
500- advance for tailor
-------------------------------
35904 - TOTAL
-------------------------------




Join hands with...

JEEVANI
......FOR UNCARED


Read More


సునీత
-------------------









గణేష్
------------------



గణేష్, సునీత, ఇంద్రజ, లావణ్య

------------------------------------------





Read More

మిత్రులారా ముందునుంచీ చెబుతున్నట్టు జీవని సంస్థ అందరిదీ. జీవనితో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 200 మందికి సంబంధబాంధవ్యాలు ఉన్నాయి.



జీవితంలో అనుక్షణం ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుండాలి. అందుకే మీకు నిజజీవితంలో ఎదురైన మానవీయ ఘటనలు కానీయండి, హస్య సన్నివేశాలను కానీయండి అందరూ పంచుకుందాం. ఒక చిన్న మనవి ఏమంటే వివాదరహితంగా, ఏ ఒక్కరిని కించపరచకుండా, అశ్లీలానికి దూరంగా మీ రాతలు ఉంచండి.


1) అందుకోసం మీ బ్లాగ్ ఉంటే జీవని బ్లాగ్ కు లింక్ పెట్టడానికి నాకు మెయిల్ చేయవచ్చు.

2) బ్లాగ్ రాసే ఓపిక లేని వారు నాకు ఇంగ్లిష్ లేదా తెలుగులో ఆ సంఘటనను కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు సింపుల్గా మెయిల్ చేయండి. దానికి ఉప్పూ కారం పూసి నేను బ్లాగ్లో పెడతాను.

3) పోస్టింగ్ కింద ఉన్న కామెంట్లో రాసినా కూడా నేను బ్లాగ్లో పెడతాను.

మొదట నాతోనే మొదలు పెడతాను. తర్వాతి టపాలో.... అలాగే గనేష్, సునీతల ఫొటోలు కూడా అప్ లోడ్ చేస్తాను ఈ రోజు సాయంత్రంలోపు...



అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

Give blood. Give Life.


మధ్యాహ్నం రక్తదానం చేసి వచ్చాను. నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. తరిమెల అమరనాథ్ రెడ్డి గారు అనంతపురంలో మానవత రక్తదాన సంస్థను నిర్వహిస్తున్నారు. కడు నిరుపేదలకు ఆయన రక్తం ఇప్పిస్తుంటాడు. నేను ఇప్పటికి 6 సార్లు రక్తం ఇచ్చాను. ఎక్కువభాగం బాలింతలైన తల్లులకు ఇవ్వడం జరిగింది. వారి కళ్ళలో సంతోషం మనలో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. మా బడిలో పిల్లలకు ఇలా అవకాశం వచ్చినపుడల్లా రక్తదానంపై చైతన్యపరుస్తూ ఉంటాను.

దురద్రుష్టకరమైన విషయం ఏమంటే చాలా మంది విద్యాధికులకు కూడా రక్తదానంపై అపోహలు ఉండటం, ఇవ్వడానికి భయపడటం జరుగుతోంది. రక్తదానం వల్ల బలహీనపడతామని, మగసిరి, వీర్య ఉత్పత్తి తగ్గుతుందని భావించిన వారిని కూడా నేను చూశాను. మన శరీరంలోని మొత్తం రక్తంలో పావు లీటరు మాత్రమే రక్తం ఇస్తామని చెప్పాను. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎర్రరక్తకణాలు నిత్యం చావడం పుట్టడం జరుగుతూనే ఉంటాయని వివరించాను. సూది గుచ్చినప్పుడు ఒక పెద్ద గండు చీమ కుట్టినంత నొప్పి మాత్రమే ఉంటుందని తెలుసుకోవాలి.

ముందుగా మనం రక్తదానం చేశామా? ఆ తర్వాత మనం ఎంత మందిని చైతన్యపరిచాం అని ప్రశ్నించుకోవాలి.



పుట్టిన రోజులు లేదా మనకి సంబంధించిన రోజులలో ఒక పైసా ఖర్చు లేకుండా చేయగలిగే అతి గొప్ప దానం రక్తదానం.


నేను ఇచ్చిన రక్తంతోనే ఒక ప్రాణం నిలబడిందన్న అలోచన నిజానికి దేనికీ సరితూగదు. కావాలంటే మీరూ ఆ అనుభవాన్ని ఆస్వాదించండి ( ఇంతవరకు రక్త దానం చేయని వారికి మాత్రమే!)



అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED


Read More

The best way to find yourself is to lose yourself in the service of others.


-Gandhiji

జీవని బ్లాగు చూసి, మిత్రుల ద్వారా సర్క్యులేట్ అవుతున్న పాంప్లెట్ చూసి స్పందిస్తున్న ఎందరో మిత్రులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాం. స్వచ్చంద సంస్థలంటే డబ్బుల సంపాదనకు రాజమార్గం అని ఎంత చెడ్డ పేరు రావాలో అంతా వచ్చేసింది. అయితే ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే నిజంగా సేవలు అందుతూవుంటాయి. అయినప్పటికీ ఇంకా నమ్మకంతో మీరంతా స్పందిస్తున్న తీరుకు ధన్యవాదాలు చెప్పలేకుండా ఉన్నాం. మిత్రులారా అందుకే జీవనిని డిఫరెంట్గా తీర్చిదిద్దుతున్నాం. డబ్బు వినియోగం విషయంలో నిక్కచ్చిగా ఉంటున్నాం. అందుకే మిత్ర బ్రుందాలలో స్పందన రోజు రోజుకూ పెరుగుతోంది. ముందునుంచీ చెబుతూ వస్తున్నాం జీవనిలో దాపరికానికి చోటు లేదు. ప్రతి రోజూ జమాఖర్చులు మన సభ్యులందరికీ messages ద్వారా తెలియపరుస్తూనే ఉన్నాం. పిల్లలకు కావలసిన వస్తువులు ( దుప్పట్లు, పుస్తకాలు వగైరా..) కొనుగోలు చేస్తున్నాం. ఇది పూర్తి అవగానే ఆదివారం లోపు జమాఖర్చులు బ్లాగ్లో పెడతాము. ఏ ఒక్కరికీ ఎక్కడా అనుమానం రాకూడదనేది మా ఆశయం. తాము ఇచ్చిన విరాళం పూర్తిగా సద్వినియోగం అయిందని ప్రతి దాతా త్రుప్తిపడాలి. జీవనికి విరాళం ఇవ్వడానికి వెనుకాడవలసిన అవసరం లేదని ఫీల్ కావాలి. అప్పుడే మేము పూర్తి స్థాయిలో విజయం సాధిచినట్లు. ఆ నమ్మకం మాకుంది. ఈ దిశగా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మనవి. దాతలే కాదు, ఎవరైనా జీవనికి సలహాలు సూచనలు ఇవ్వవచ్చు. చివరగా... మీరు చేసే ప్రతి సూచనా సహాయం పిల్లల అభ్యున్నతికి ఉపయోగపడతాయి.

Read More

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు మానసికమైన శూన్యంలో ఉంటారు. కాబట్టి ముందుగా వారిలో మానవసంబంధాలను నెలకొల్పాలి. అందుకోసం జీవనిలో చురుగ్గా పని చేస్తున్న కార్యకర్తలు, అనంతపురంలో ఉంటున్న దాతలు పని చేస్తారు. వారిని తరచుగా వెళ్ళి పలకరించడం, తమ కుటుంబంలో పుట్టిన రోజులాంటి సందర్భాల్లో ఈ పిల్లలను కలుపుకునిపోవడం జరుగుతుంది.

తర్వాతి లక్ష్యం : పిల్లలకు మంచి విద్య అందించడం. స్కూల్ లో చెప్పే పాఠాలతో పాటు ప్రతి శెలవు దినంలోనూ నా పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ పిల్లలందరికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు.వారి వారి స్థాయిని బట్టి నవోదయ, గురుకుల, సైనిక్, సాంఘిక సంక్షేమ, పుట్టపర్తి సత్యసాయి తదితర పాఠశాలల ప్రవేశ పరీక్షలకు తయారు చేయడం జరుగుతుంది. 10 మందిలో కనీసం ఐదుగురు ఇలా సీట్లు సంపాదించినా, ఆ తర్వాతి నుంచి వారిపై పెట్టే ఖర్చు నామమాత్రమే. వారు అలా ఎక్కడైనా సీట్లు సంపాదించి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా వారికి అక్కడ అయే ఖర్చులు మనవే. ఆ పిల్లవాడిని స్పాన్సర్ చేస్తున్న దాతలు మానసికంగా వారికి మేము ఉన్నాం అనే ధైర్యాన్ని ఇస్తూనే ఉంటారు. వాళ్ళ సంబంధబాంధవ్యాలు కొనసాగుతూనే ఉంటాయి. చదువుతో పాటు వారిలో మానవత్వాన్ని సమాన పాళ్ళలో నింపాలన్నది మన ఆశయం.
ఇలా ఎంత కాలం?
పిల్లలు ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసేవరకు. అప్పటికి సంస్థ ఎంతోకొంత నిలదొక్కుకుని వుంటుంది కదా! ప్రతి సంవత్సరం అలా చేసినా, అలాంటి పది మందిలో కనీసం ఇద్దరు గొప్ప స్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నాం.మరి మిగిలిపోయిన యావరేజి స్టాండర్డ్ పిల్లల గురించి తర్వాత చూద్దాం.


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

ఎ.గణేష్ అనే అబ్బాయిని ఈరోజు పాఠశాలలో చేర్చడం జరిగింది. గణేష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు దగ్గర పల్లె. ఈ అబ్బాయి నాన్న చిన్నపుడే కుటుంబాన్ని వదిలిపోయాడు. తల్లి శారీరక వైకల్యంతో బాధపడుతోంది. జన్యురీత్యా వచ్చిన మరుగుజ్జుతనంతో పాటు అనారోగ్యంతో బాధపడుతోంది. గణేష్ ఇపుడు 3వతరగతి. లావణ్య, ఇంద్రజ ఇంటి మీద ధ్యాస లేకుండా సంతోషంగా ఉన్నారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారు. ----------------------------------------------------------------------------------------------- జీవని సంస్థ కోసం చురుగ్గా పనిచేస్తున్న సభ్యులకు గమనిక: నిన్న మిత్రులు వరప్రసాద్, వాసూప్రసాద్ జీవనికి 9000/- విరాళం ఇచ్చారు, అదేవిధంగా వినోద్ బాబు నాయక్ 2000/-, చంద్రకాంత్ నాయుడు 5000/- ఇచ్చారు. మిత్రులారా మంగళవారం ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంకు అకౌంటు ఓపెన్ అవుతుంది. మీరు జీవనికి విరాళాలు సేకరించేటపుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవలసిందిగా కోరుతున్నాము. ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఓ 5గురు దగ్గరి మిత్రులు ఉంటారు. వారిని విరాళం అడిగితే కాదనరు. ఆ చనువుతో మన చైను కొనసాగుతుంది. కానీ ఇతరులను మొహమాటపెట్టి, బలవంతపెట్టి విరాళం అడగటం మన సంస్థ స్ఫూర్తికి పూర్థిగా విరుద్ధం. దాతలను మనస్ఫూర్తిగా ఇచ్చేలా చూడండి. దాతలు ఒకవేళ అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు ఐతే, ముందుగా పిల్లల్ని చూడమనండి. విజిట్ చేయమనండి అప్పుడే విరాళం ఇవ్వమనండి. పూర్తి స్థాయి పారదర్శకతతో, ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా మనం సంస్థను నిలబెట్టాలి. అలాగే నేను ఒక్కడినే అనే కేంద్రీకరణ జీవనిలో లేదు. అందరికి సంస్థలో సమాన బాధ్యతలు, అధికారాలు ఉన్నాయి. నేను అనేవాడిని లేకపొయినా జీవని కలకాలం ఉండాలి. ఇది సంస్థ ఆశయం.




అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More


ఆయన ఓ రాజకీయ నాయకుడు కాదు.. వెండితెర హేరో అంతకన్నా కాదు.. అయనను చివరి చూపు చూడటం కోసం అనంతపురం నగరం జన సంద్రమైంది. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామీణ పేదలు గుండెల్లో గుడికట్టుకున్న నిలువెత్తు మానవతామూర్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్రర్ నిన్న పరమపదించారు. ఫెర్రర్ అనంతపురం జిల్లాకు రావడం అంటే ఇక్కడి ప్రజలు ఎన్ని జన్మల్లో చేసుకున్న అద్రుష్టమో మరి. విద్య, వైద్యం, వసతి, పర్యావరణం, క్రీడలు, మానసిక శారీరక వికలాంగులకు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రంగాలు వివిధ వ్యక్తులు ఎందరికో వీరు జీవితాన్ని ఇచ్చారు. ఫెర్రర్ గురించి, ఆయన స్థాపించిన గ్రామీణాభివ్రుద్ధి సంస్థ గురించి ఇంతకు ముందే ఒక టపా రాశాను. ఆసక్తి ఉంటే గమనించండి. ఫెర్రర్ కుమారుడు మాంచో ఫెర్రర్ మా జిల్లాకు చెందిన యువతిని పెళ్ళిచేసుకున్నారు. సంస్థ కార్యక్రమాలను ఇపుడు ఆయనే చూసుకుంటున్నారు. వీరి సేవలు ఇలాగే కొనసాగాలని, అందుకు కావలసిన స్థైర్యం ,ఆయురారొగ్యాలు మాంచో కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము.


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED


Read More

Read More

మిత్రులారా మీరు ఒక విషయం గమనించారా. పిల్లల తిండి గురించి ఆలోచించడం లేదు. 12000 ఫీజు తిండి, స్కూల్, హాస్టల్ అన్ని కలిపి. సంవత్సరంలో 100 రోజులు దసరా, సంక్రాంతి,వేసవి సెలవలు తీసి వేస్తే దాదాపు 250 పని దినాలు వస్తాయి. ఒక పిల్లవాడికి రోజుకు ఖర్చు 30 రూపాయలు ఉండదా ? టిఫిన్,భోజనం, పాలు, షెల్టర్ వగైరాలకు... మేము సొంతంగా వసతి కల్పించే ఆర్థిక స్థోమత ఇంకా రాలేదు. అది మూడేళ్ళ తర్వాతి విషయం. ఈ మూడేళ్ళపాటు ఇది మంచిదని అనుకున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో చదువు చెప్పిస్తోంది కేవలం పూర్తి స్థాయి భద్రత కోసం అని గుర్తుంచుకోండి. తిరిగి మా ఉపాధ్యాయులే వారికి కోచింగ్ ఇవ్వటానికి శెలవు దినాల్లో వెళ్తారు. మా పాథశాలల గురించి: మాకు వచ్చే పిల్లలు పూర్తి కింది స్థాయి వాళ్ళు తల్లిదండ్రులు పొద్దున పనికి పోతే సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. వారికి పిల్లల గురించి ఏ మాత్రం పట్టదు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 10 మంది పిల్లల్లో కనీసం ఇద్దరు ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని తెలివితేటలతో ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అధమం అని మేము ఎందుకు అనుకుంటాం? అసలు ఈ ప్రైవేటు గొడవ వద్దు అనుకుంటే ఇందుకు చిత్తశుద్ధివున్న ఇద్దరు వ్యక్తులు పూర్తి స్థాయిలో అంకితం కావలసి ఉంటుంది. మానవవనరుల పరంగా ఉన్న సమస్య ఇది. నేను నా ఉద్యొగం చేస్తూ ప్రస్తుతానికి ఇంతవరకు మాత్రమే పనిచేయగలను. పిల్లలు హాస్టల్ లో ఉండటం వల్ల ప్రతి రోజూ నేను పలకరించి బాగోగులు చూడవచ్చు. నిజానికి, మీరు చెప్పినట్టు ఈ వ్యవస్థ మొత్తం సెంట్రలైజ్ చేసినపుడు ఖర్చు తగ్గుతుంది. మీ అటెన్షన్ మీ సూచనలు ఇలాగే దయచేసి కొనసాగించండి. పోనీ దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రణాలిక రూపొందించండి. అలా చేద్దాం! పిల్లల అభివ్రుద్ధి మన లక్ష్యం. బాగుండాలి అంతే


చివరగా ఒకమాట మనం మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నామా?


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

స్పందించిన ముగ్గురికి ధన్యవాదాలు. ఫీజు హాస్టల్ తో కలిపి 12000/- ఇది ఇంకా మొదటి సంవత్సరమే కాబట్టి ఆశ్రమం దాకా మనం వెళ్ళలేదు. తర్వాతి దశల్లో ఆశ్రమం స్థాపిస్తే ఖర్చు తగ్గుతుంది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అయి ఉండి, ప్రైవేటు పాఠశాలలో చేర్చడానికి ముఖ్య కారణం వసతి. ప్రభుత్వ హాస్టల్లో చేర్చవచ్చు. కానీ వారిని తిరిగి దగ్గరలోని పాఠశాలకు పంపడం, వాళ్ళు తప్పిపోతే వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో పూర్తి బాధ్యత వారి మీద ఉంటుంది. పిల్లలు పరిధిని దాటి పోయే అవకాశం ఉండదు. అంతే కానీ ప్రైవేటు బడుల వల్ల ఐ.ఐ.టి.లు, మెడిసిన్లు వస్తాయన్న ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. కానీ ఒక విషయం గమనించండి. పిల్లల ప్రస్తుత సమ్రక్షకులు మేము ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తాం అంటేనే త్రుప్తి చెందారు. మా బడిలోని పిల్లలు కూడా 50 రూపాయలు ప్రైవేటు బడుల ఫీజు కట్టలేక వస్తున్నారు అంతే కానీ అందరికీ అంగ్ల మాధ్యమం పిచ్చి ముదిరింది. సాంకేతికంగా దీని గురించి మళ్ళీ చర్చిద్దాం. మీరు ఇంకా ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. జీవని సంస్థకు ఆర్థికంగా కంటే మేధొపరంగా , పిల్లలకు మరింత న్యాయం చేకూరేలా చేయాలని బ్లాగు మిత్రులను సవినయంగా కోరుతున్నాను. నిజానికి ఇలాంటి సమస్యల మీద దాదాపు నెల రోజులు చర్చించడం జరిగింది. ఐతే ఇంకా ప్రాక్టికల్ గానూ, అందరి మెదళ్ళలో నలగడం వల్లను సంస్థను బాగా తీర్చిదిద్దవచ్చు.

అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More


లావణ్య, ఇంద్రజ ఇద్దరూ అక్కాచెల్లెల్లు. 1,4 తరగతులు. వీళ్ళ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారు. అనంతపురం సమీపం లోని కురుగుంట గ్రామం వీరిది. అవ్వాతాతలు పండుటాకులు. వ్యవసాయ ఆధారిత కుటుంబం. అనంతపురంలో వ్యవసాయం అంటేనే జూదం లాంటింది. ఈ పిల్లలు మరి కనీస ప్రమాణాలతో జీవిస్తారన్న ఆశ కూడా లేదు. వీళ్ళే కాదు మనం తీసుకోబోయే అందరు పిల్లల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది. వీరిద్దరిని నిన్నటి రోజు సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చడం జరిగింది. ఈ పాఠశాల అనంతపురం నగరంలో ఎస్.బి.ఐ కాలనీలో ఉంది. ఫీజు ఒక్కొక్కరికి 12000/- అడ్వాన్సు కింద 10000/- చెల్లించాము. ఇంక మన వద్ద మిగిలిన మొత్తం 15300/-


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

తల్లిదండ్రులు లేని పిల్లలను మాత్రమే జీవని అక్కున చేర్చుకుంటుంది. ఆత్మహత్యలు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో జీవని సభ్యులు ఆయా ఊరికి వెళ్ళీ అన్ని వివరాలు సేకరిస్తారు. వాళ్ళు త్రుప్తి చెందాక కార్యవర్గ సభ్యుల ఆమోదం తీసుకుంటారు. అనంతరం వారి అవ్వాతాతలు లేదా సమీప బంధువులనుంచి అనుమతి తీసుకుని పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లి మాత్రమే ఉండి ఆమె పూర్తి అనారొగ్యంతోనో, మానసిక శారీరక వికలత్వంతో బాధపడుతూ ఉంటుంది. అలాంటపుడు పిల్లలకు ఆమె నుంచి ఎలాంటి సహాయం లభింఛదు. అలాంటి పిల్లలను కూడా మనం చదివిస్తాం. కులం మతం ప్రాంతం వంటి వాటికి అతీతంగా జీవని పనిచేస్తుంది. అందరూ సమానమే. అందరూ పసిమొగ్గలే! మనకున్న ఒకే ఒక్క నియమం తల్లిదండ్రులు లేకుండా ఉండాలి. ఈ రోజు బడిలొకి చేరుస్తున్న పిల్లల వివరాలను సాయంత్రం లోగా మీముందు ఉంచుతాను.




అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

1995 నుంచి ఇప్పటి దాకా కేవలం 15 కథలు మాత్రమే రాయగలిగాను. నేను చాలా నిదానం. కాకపోతే ఒకటి రెండు మినహాయించి అన్నీ సామాజిక స్పృహ కలిగినవే. ఓ మూడు కథలకు ఈనాడు, జ్యోతిలలో బహుమతులు వచ్చాయి. ఆరు కథలు సంకలనాల్లో వచ్చాయి. రచయితగా ఇది నా చరిత్ర.


కాలం గడిచేకొద్దీ నాలో అసంత్రుప్తి పెరగసాగింది. చదివేవాడు కరువైన ఈ కాలంలో ఎందుకు రాస్తున్నామో అనిపించింది. అదీకాక మనిషిగా నేను ఆచరించలేని చాలా విషయాలు ప్రవక్త లాగా కథల్లో పాఠకుల మీద రుద్దడం ఎంత వరకు న్యాయం? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! సాధారణంగా ఏ కళాకారుడిలోనైనా అరాచకం, విశౄంఖలం, విపరీతమైన మానసిక ధోరణులు ఎంతో కొంత శాతమైనా ఉంటాయి. నాలో కొంతే ఉందని అనుకున్నా, ఈ విషయం తెలుసుకునే కొద్దీ నేను సూక్తులు రాయడం మానివేసాను. కాలక్రమంలో నా అంతరంగ జ్వలన ఎక్కువ అవుతూ వచ్చింది. రాతల ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో సాధించేది ఏమీ లేదని అంపించింది. భౌతికంగా ఏదో చేయాలి. నేను చేస్తున్న పనికి భౌతికంగా ప్రయోజనాన్ని నేను చూడగలగాలి. ఆ త్రుప్తి కావాలి అనుకున్నాను. రచయితగా నా నెట్వర్క్ పెరిగిపోయింది.

ఒకసారి మదనపల్లిలో రచయితల ఇష్టాగోష్టి జరుగుతోంది. ఎందుకు కథలు రాస్తున్నారు అన్న అంశం మీద మాట్లాడుతున్నారు. నా వంతు వచ్చినపుడు " కథలు రాయడం నాలోని ఫ్రస్ట్రేషన్ కు అవుట్లెట్ గా భావిస్తాను. అంతకంటే ముఖ్యంగా ఒక అనాధాశ్రమం, ఒక వౄద్ధాశ్రమం ఏర్పాటు చేయడం నా జీవితాశయం. అందుకోసం పరిచయాలు పెంచుకుంటున్నాను అందుకు కథలు బాగా ఉపయోగపడుతున్నాయి" అన్నాను. ఖదీర్ బాబు గారు తలాడించి కథలను ఈ రకంగా కూడా ఉపయోగించుకుంటున్నావా కొత్తగా ఉంది అన్నారు. అలా నేను అనుకున్నది సాధిస్తూ వచ్చాను. మరోపక్క ఒకానొక ప్రజాస్వామిక ఎర్రపార్టీ దాని అనుబంధ సంస్థల్లో ఏమైనా సేవ చేయగలనా అంపించింది. చాలా కొద్ది రోజుల్లోనే అందులోని డొల్లతనం బయటపడింది. మార్క్స్ మహానుభావుడి ఇజం వీటిలో నా వరకు కనిపించలేదు. క్రమంగా నేను అన్నిటికి దూరం అయ్యాను.

నిజానికి నా అంచనా ప్రకారం నాకు 50 యేళ్ళు వచ్చేసరికి ఇప్పటి రూపాయి విలువ ప్రకారం 1 కోటి రూపాయలు సంపాదించాలి, 58 సంవత్సరాలకు ఈ పిల్లలకు, నీడలేని పెద్దలకు ఆశ్రమాలు స్థాపించాలి. ఇదీ నా ఆశయం. కానీ అనుకోకుండా ముందే కోయిల కూసింది. ఆశ్రమం తర్వాతి లక్ష్యంగా చేసుకున్నా. అంతవరకు ఏదోఒకటి చేయాలి అన్న తపనతో జీవని మొదలు పెట్టాం. నన్ను నమ్మిన ఎందరో మిత్రులు, నన్ను దగ్గరగా చూసిన ఆప్తులు నాకు అడగగానే చేయూతను అందించారు. నేను వాళ్ళ అంచనాను ఏ మాత్రం తప్పకుండా వీలైనంత పారదర్శకంగా, ఒక్క పైసా దుర్వినియోగం లేకుండా జీవని ద్వారా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాను. ఇది అందరి సంస్థ, ఇక్కడ నేను అన్న మాటకు అర్థం లేదు. అందుకే ఇకనుంచి నేను ను పరిహరిస్తాను. ఈ సంస్థ పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ చేయబడింది. వివరాలు , సమాచారం తెల్పడం , మానవ వనరుల సమీకరణ మాత్రమే ఈ నేను అనేఅవాడిని చేసే పని. ప్రతిరోజూ జీవని కార్యక్రమంపై సమాచారం బ్లాగులో ఉంటుంది. అదేవిధంగా దాతలు ఇచ్చిన డబ్బు వివరాలు కూడా! 18.6.09వ తేదీన నలుగురు పిల్లలు జీవని ద్వారా ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలో చేరుతున్నారు. ఆ వివరాలు తర్వాతి టపాలో...



అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

మిత్రులారా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలను సమాజంలో భాగస్వాములను చేయడం, తరచుగా వారిని దాతలతో మాట్లాడించడం అన్న ప్రధాన లక్ష్యాలతో జీవని పని చేస్తోంది. ఈ విధంగా పిల్లల్లో మానవ సంబంధాలను నెలకొల్పడం మన ఉద్దేశ్యం. ఈ సంవత్సరం 10 మంది పిల్లలతో జీవని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభం అవుతోంది. కరువు జిల్లా అయిన అనంతపురంలో మేము తలపెట్టిన ఈ యగ్నం విజయవంతం కావాలని అందరి ఆశీస్సులు కోరుతున్నాం. జీవని సభ్యులు, నిర్మాణం, దాతాల వివరాలు తర్వాతి టపాలో తెలియపరుస్తాను.



అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo