ఎ.గణేష్ అనే అబ్బాయిని ఈరోజు పాఠశాలలో చేర్చడం జరిగింది. గణేష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు దగ్గర పల్లె. ఈ అబ్బాయి నాన్న చిన్నపుడే కుటుంబాన్ని వదిలిపోయాడు. తల్లి శారీరక వైకల్యంతో బాధపడుతోంది. జన్యురీత్యా వచ్చిన మరుగుజ్జుతనంతో పాటు అనారోగ్యంతో బాధపడుతోంది. గణేష్ ఇపుడు 3వతరగతి. లావణ్య, ఇంద్రజ ఇంటి మీద ధ్యాస లేకుండా సంతోషంగా ఉన్నారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారు. ----------------------------------------------------------------------------------------------- జీవని సంస్థ కోసం చురుగ్గా పనిచేస్తున్న సభ్యులకు గమనిక: నిన్న మిత్రులు వరప్రసాద్, వాసూప్రసాద్ జీవనికి 9000/- విరాళం ఇచ్చారు, అదేవిధంగా వినోద్ బాబు నాయక్ 2000/-, చంద్రకాంత్ నాయుడు 5000/- ఇచ్చారు. మిత్రులారా మంగళవారం ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంకు అకౌంటు ఓపెన్ అవుతుంది. మీరు జీవనికి విరాళాలు సేకరించేటపుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవలసిందిగా కోరుతున్నాము. ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఓ 5గురు దగ్గరి మిత్రులు ఉంటారు. వారిని విరాళం అడిగితే కాదనరు. ఆ చనువుతో మన చైను కొనసాగుతుంది. కానీ ఇతరులను మొహమాటపెట్టి, బలవంతపెట్టి విరాళం అడగటం మన సంస్థ స్ఫూర్తికి పూర్థిగా విరుద్ధం. దాతలను మనస్ఫూర్తిగా ఇచ్చేలా చూడండి. దాతలు ఒకవేళ అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు ఐతే, ముందుగా పిల్లల్ని చూడమనండి. విజిట్ చేయమనండి అప్పుడే విరాళం ఇవ్వమనండి. పూర్తి స్థాయి పారదర్శకతతో, ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా మనం సంస్థను నిలబెట్టాలి. అలాగే నేను ఒక్కడినే అనే కేంద్రీకరణ జీవనిలో లేదు. అందరికి సంస్థలో సమాన బాధ్యతలు, అధికారాలు ఉన్నాయి. నేను అనేవాడిని లేకపొయినా జీవని కలకాలం ఉండాలి. ఇది సంస్థ ఆశయం.
JEEVANI
0 వ్యాఖ్యలు