మిత్రులారా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు జరుగుతుంటాయి. వరద సహాయం కోసం డబ్బు పంపి మాకు కమ్యూనికేట్ చేయని వాళ్ళ జాబితా ఇపుడు మీ ముందు ఉంచుతున్నాము. నిన్న బ్యాంకు స్టేట్ మెంటు వచ్చినపుడు చూశాము. మేము ఇక్కడ ఒక ఇబ్బంది ఎదుర్కుంటున్నాము. ICICI బ్యాంకు వాళ్ళు మీది స్వచ్చంద సంస్థ కాబట్టి మేము పూర్తి సర్వీస్ ఇవ్వం అంటున్నారు. పాస్ బుక్ ఎలానూ ఉండదు, నెట్ బ్యాంకింగ్ లేదు, స్టేట్ మెంట్ అడిగితే దానికి వడ్డింపులు, కాబట్టి నేను వ్యక్తిగతంగా ప్రతి సారీ బ్యాంకుకు వెళ్ళి బ్యాలెన్సు వివరాలు కనుక్కోవలసి వస్తోంది. ఫోన్ చేసినా ఫోన్ బ్యాంకింగ్ పేరుతో చావబాదుతారని భయం. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ నెలాఖరు వరకు తెలియడం లేదు. ఇంత ఇబ్బందిగా ICICI బ్యాంకు అకౌంటును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాం అంటే నెల నెలా విరాళం ఇస్తున్నవారు ఎక్కువమంది సాఫ్ట్ వేర్ వాళ్ళు ఉన్నారు. వారి సౌలభ్యం కోసం దీన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ రకరకాల చార్జీలతో పిండేస్తున్నారు. కిందటి నెల దాదాపు 900/- కట్ చేశారు. అందుకే త్వరలో SBI అకౌంటు ఓపెన్ చేస్తున్నాము.
దాతల వివరాలు
-----------------
15000 - మెట్టు మదన్ రెడ్డి
02000 - కార్తీక్
00500 - శరత్ చల్లా
వీరిలో కార్తీక్ గారు నాకు తెలుసు. శరత్ గారు బ్లాగు ఫాలో అవుతున్న వారిలో ఉన్నారు. మదన్ రెడ్డి గారు తెలియదు. మీరు దయచేసి పూర్తి వివరాలు మెయిల్ చేయండి. మీకు ఇష్టం లేకపోయినా మా కోసం ప్లీజ్... ఇంకా ఎవరైనా ఉన్నా దయచేసి తెలియజేయండి. విరాళం అందుకుని మీ పేరు తెల్పక పోతే మాకు అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మీ,
జీవని.
నిజమే సార్, ICICI బ్యాంక్ లో అకౌంట్ అంటే లాభాల కన్నా నస్టాలే(వడ్డింపులు) ఎక్కువగా ఉంటాయ్.సాఫ్ట్ వేర్ వాళ్ళు ICICI నుండీ కూడా SBI కు విరాళాలు ఆన్ లైన్లో పంపవచ్చు.మీరు యస్.బి.ఐ అకౌంట్ తొందరగా చేయించండి.ఆందులో ఉన్న అన్ని సౌఖర్యాలు వాడుకోవటం ద్వారా మీకు కాలి తిప్పట తగ్గుతుంది.
సురేష్ గారూ మీరు చెప్పింది నిజం. స్టేట్ బ్యాంకు అకౌంటు ఓపెన్ అయింది. వివరాలు రేపు టపాలో ఉంచుతాను. ధన్యవాదాలు.
maku online lo transfer cheyadam e banka aina okate, so SBI ke pompistamu ika nunchi....