ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా రాబోయే మూడు సంవత్సరాలు జీవని సంస్థకు ఎంతో కీలకం. 200 మంది పిల్లలకు నీడను ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ జూన్ లో అనంతపురానికి 18 కిలోమీటర్ల దూరంలో స్కూల్ & హాస్టల్ ( జీవని విద్యాలయం ) నిర్మాణం ప్రారంభిస్తున్నాము. దాదాపు 60 లక్షలు అవుతుందని అంచనా. ఇపుడు మన దగ్గర ఉన్న సొమ్ము 1 లక్ష. ఇక కేవలం 59 లక్షలు మాత్రమే అవసరం. ఆ తర్వాత మెయింటెనెన్స్ కు నెల నెలా 2 లక్షలు అవుతుంది. ఇన్ని లక్షల లక్ష్యాన్ని అందుకోగలమా??? చూద్దాం....
కిందటి యేడాది ఇదే నెలలో జీవనిని ప్రారంభించిన క్షణంలో ఇంత అభివృద్ధిని కల గనే ధైర్యం కూడా నాలో లేదు. అప్పుడు ' నేను ' మాత్రమే, సరిగ్గా సంవత్సరానికి మేము... మనం... ఒకరికొకరు తోడు అవుతూ జీవని విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత లక్ష్యాన్ని అధిగమిస్తాం అన్న ధైర్యం కూడా వచ్చింది.
ఇందుకు ధైర్యానికి, సేవకు మారుపేరైన ఆలూరు సాంబశివారెడ్డి ( CORRESPONDENT, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY ) తోడ్పాటు ఎంతో ఉంది. అన్నీ తానై జీవనిని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. ముందుకు నడిపిస్తున్నారు. అలాగే జీవని సలహామండలి చైర్మన్ జగదీశ్వర రెడ్డి గారు. ఇలా చెబుతూ పోతే మానవ వనరుల పరంగా, ఆర్థికంగా ఇంకా రక రకాలుగా సేవలు అందిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అందరికీ జీవని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
2009 లో జీవని కార్యకలాపాలు
తల్లిదండ్రులు లేని ఆరుగురు పిల్లలకు మనం నీడనిస్తున్నాం.
కర్నూలు వరదబాధితులకు సహాయాన్ని అందించాం.
రక్తదాన కార్యక్రమంలో సహాయపడ్డాం.
2010 లో సాధించాల్సినవి.
25 మంది పిల్లల్ని జీవని కుటుంబంలోకి తీసుకురావడం.
జీవని విద్యాలయం నిర్మాణం.
అన్నీ సక్రమంగా జరగాలని, సేవకు వారధిగా జీవని అందరి హృదయాల్లోనూ నిల్చిపోవాలని కోరుకుంటూ...
మీ
జీవని.
మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ, అంతా శుభమే జరగాలని కోరుకుంటూ... నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు, మీ సంస్థ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
i wish you and our children a very prosperous new year with lots of success and happiness. And all the best and i believe you can do it.