చాలా ఏళ్ల కిందట ఒక మిత్రుడు చెప్పాడు ఈ కాన్సెప్ట్ ను. మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, రెండో పాప బాబు కావాలనుకున్నపుడు ఒక అనాధను దత్తత తీసుకోవాలి అని చెప్పాడు. దీనివల్ల ఒకరికి పూర్తి స్థాయి జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు. జనాభా సమస్య అరికట్టడానికి వ్యక్తిగత స్థాయిలో కృషి చేసినట్లు అవుతుంది. ఒక అనాథకు జీవితం ఇవ్వడం అంటే వారు ఒక జీవితానికి సరిపడా సేవ చేసినట్లే అని నా భావన.
అలాగే పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం ఖర్చు పెట్టుకునే బదులు దత్తత తీసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఈ వైద్యం చేయించుకునే క్రమంలో ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి మరోరకమైన హింస. వర్తమానాన్ని ఆనందించడం మాని చాలామంది భవిష్యత్తు కోసం బాధ పడుతుంటారు. విసిగివేసారిన దంపతులకు ఆ పాప / బాబు రాక అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించాలి. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ మొదట వదిలేయాలి. మనం జీవిస్తోంది మనకోసం. మనం ఎవ్వరికీ హాని చేయడం లేదు.
ఏమి చేసినా ఎన్ని సాధించినా మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.
పిల్లలు లేని రెండు జంటలకు నేను ఈ విధమైన చైతన్యం కల్పించగలిగాను. రెండో జంటతో ఈ రోజు నేను స్వయంగా అప్లికేషన్ వేయిస్తున్నాను.
వీరికంటే ముందు నేను ఆచరించాను. మా పాప చాలా చాలా యాక్టివ్. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నాం.
మీ పరిధిలో పిల్లలు లేని దంపతులకు ఈ రకమైన చైతన్యం కల్పించండి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే హైదరాబాద్ లోని శిశువిహార్ కార్యాలయంలో ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలు తీసుకోవడానికి మన వంతు రావాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అప్పటికప్పుడు అని కాకుండా ఒక దరఖాస్తు వేసి, ఈ లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు పరచుకోవచ్చు.
మంచి ఆలోచన. బాగుంది.
చాలా చాలా మంచి విషయం చెప్పారు. అందరూ ఇలా చేయగలిగితే ఎంత బాగుంటుందో కదా!
కనీసం కొంతమంది చేసినా సంతోషమే!
నాకు ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. నేను ఆ పని చేసాక తప్పకుండా మళ్లీ వచ్చి ఇక్కడ కామెంట్ చేస్తాను.
చాలా మంచి సూచన. దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉన్నా.. లేదా హైదరాబాద్ లో సంప్రదించవలసిన ప్రభుత్వ / ఎన్.జీ.వో లాంటి ఏజేన్సీ ల సమాచారం / ఎడ్రస్ ఏమయినా ఉంటే దయచేసి నాకు Mail చేయగలరా ?
sujatauma@gmail.com
Thank you.
ఆచరించి చెప్తున్నందుకు మీకు అభినందనలు. మీరు చెప్పింది నిజం. చాలా మంచి ఉద్దేశ్యం.
సుజాత గారూ,
ఇందుకు రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆయా జిల్లా కేంద్రాల్లో దరఖాస్తు ఇవ్వడం. రెండు హైదరాబాద్ యూసఫ్ గూడాలోని శిశు విహార్లో ఇవ్వడం. జిల్లాలో ఇస్తే పిల్లల్ని ఎంచుకోవడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్లో అయితే ముగ్గురు పిల్లల్ని చూపిస్తారు. మనం ఇచ్చిన స్పెసిఫికేషన్లతో అంటే వయసు, పాప / బాబు ఇలా...
పిల్లలు ఎక్కువ వదిలిపెట్టడం హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి మనకు తొందరగా అవకాశం రావచ్చు. అలాగే కొందరు దంపతులు ఆ పిల్లల అసలు తల్లిదండ్రులు వస్తారేమో అనే అభద్రత జిల్లాలో ఉంటుంది హైద్రాబాద్ లో ఆ భీతి ఉండదు. ఇక్కడ అనంతపురంలో మేము అప్లికేషన్ ఇచ్చి హైద్రాబాద్ ఫార్వర్డ్ చేయమని కోరుతున్నాము. వారు ఒప్పుకుంటున్నారు. మరి మిగతా జిల్లాల విషయం నాకు తెలీదు. వీళ్ళు పంపడం ఇదంతా ఎందుకుని భావిస్తే నేరుగా శిశువిహార్ వెళ్ళవచ్చు.
విజయ్, చైతన్య,సుజాత, అనానిమస్ గార్లకు ధన్యవాదాలు
ఈ మంచి సందేశాన్ని నా స్నేహితులందరికీ పంపించాను.వారి స్నేహితులకు కూడా పంపించమని కోరాను.
Please see my post at http://bhavadeeyudu.blogspot.com/2009/09/blog-post.html
జీవని గారు ముందుగా మీకు అభినందనలు..మీ పాపకి ఆశీస్సులు. మా స్నేహితులు ముగ్గురు పిల్లలు లేకపోతే ఇలానే పిల్లల్ని పెంచుకుంటున్నారు.
@సుజాత గారు, యూసప్‌గూడాలోని శిశువిహార్లో సంప్రదించడం అన్నిటికన్నా ఉత్తమం.
అనాధ శిశువులను పెంచుకోవటమే
నిజమైన దేశభక్తి ,మానవసేవ,మాధవసేవ.ఇది చాలామందివల్ల తప్పక అయ్యేపనే.మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, రెండో పాప బాబు కావాలనుకున్నపుడు ఒక అనాధను దత్తత తీసుకోవాలి.దీనివల్ల ఒకరికి పూర్తి స్థాయి జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు.జనాభా సమస్య అరికట్టవచ్చు.ఒక అనాథకు జీవితం ఇవ్వవచ్చు.
పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం సొంతబిడ్డలు మాత్రమే కావాలనే పట్టుపట్టి సంతాన సాఫల్యకేంద్రాలలో డబ్బు ఖర్చుపెట్టకుండా దత్తత తీసుకోవచ్చు.ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ హింస కూడా ఉండదు.వర్తమానాన్ని ఆనందించడం మాని భవిష్యత్తు కోసం బాధ పడవద్దు.రేపుమనది కాదు.పిల్లలకోసం విసిగివేసారిన దంపతులకు అనాధ శిశువు రాక అంతులేని సంతోషాన్ని పుణ్యాన్నిఇస్తుంది. మనం ఎవ్వరికీ హాని చేయడం లేదు.ఏమి చేసినా ఎన్ని సాధించినా మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.పిల్లలు లేని జంటలు ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.పిల్లలు తీసుకోవడానికి పట్టే రెండు మూడు సంవత్సరాల లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు పరచుకోవచ్చు.
రహంతుల్లా, చక్రవర్తి, సిరిసిరిమువ్వ గార్లకు ధన్యవాదాలు.
good thought