మిత్రులారా జీవని సంస్థను ప్రారంభించి సంవత్సరం దాటింది. సంస్థకు సంబంధించి అన్ని పనులను నేను చూసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం లోకల్ గా దాతల దగ్గరకు వెళ్ళి విరాళం స్వీకరించడం, జీవని విద్యాలయానికి సంబంధించిన పనులు, బ్యాంకు వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఈ క్రమంలో దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొన్నిసార్లు స్వీకరించలేకపోయాము. ఈ పనులన్నీ చేయడానికి ఒక సహాయకుడిని నియమించాము. ఆ అబ్బాయికి నెల జీతం 1000/- దీనికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉన్నా దయచేసి తెలియజేయగలరు. జీవని సభ్యులే కాక ఎవరైనా తమ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు.


మీ,


జీవని.




on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. a abbai age enta?? me daggara job part time r ful time? e rojullo 1000 ante!!!! me daggara part time aite parvaledu... ante chaduvukuntu ... job chesevallu untaru kada alantivallu aite ok...

     
  3. jeevani Says:
  4. అఙ్ఞాత గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. ఆ అబ్బాయి ఆంధ్రప్రభలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. కాబట్టి పార్ట్ టైమే. మన దగ్గర పని కూడా నెలలో మొదటి పదిహేను రోజులు మాత్రమే. తర్వాత దాదాపు పని ఉండదు. అయితే బ్యాంకు పనులు సమయాన్ని వృధా చేస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని 1000/- నిర్ణయించాము. భవిష్యత్తులో పని భారం పెరిగితే జీతం కూడా పెంచగలం.

     
  5. Anonymous Says:
  6. ala aite ok :) manchi salary ne edi

     
  7. Good going Sir! all the best.

    May be I can contribute starting next year.

     
  8. jeevani Says:
  9. భరద్వాజ గారూ నమస్తే,

    జీవని విద్యాలయం కాన్సెప్ట్, నడిపేతీరు మీ అందరికీ తప్పక నచ్చుతుందనే నమ్మకం నాలో ఉంది. అది నామీద నాకు ఉన్న నమ్మకం కూడా. అందుకే బడి మొదలైన తర్వాతే మిమ్మల్ని అందర్నీ( బ్లాగర్లు & మీ మిత్రులు )అడగాలని అనుకున్నాను. అంటే వచ్చే విద్యా సంవత్సరానికి... మీరూ అదే అనుకున్నారు. ధన్యవాదాలు.

    మీ,
    జీవని.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo