మిత్రులారా ఈ నెలలో గార్లదిన్నె వద్ద జీవని విద్యాలయానికి శంకుస్థాపన జరగాల్సి ఉంది. అయితే కొన్ని సమస్యల వల్ల మనం గార్లదిన్నె వద్ద బడి నిర్మించడం వద్దు అనుకున్నాము. ప్రస్తుతం అనంతపురానికి మరింత దగ్గర్లో స్థలం సేకరించే పనిలో ఉన్నాము. ఏది ఏమైనా ఎన్ని సమస్యలు ఎదురైనా 14-06-2011న జీవని విద్యాలయంలో తరగతులు ప్రారంభం అవుతాయి.



దాతల నుంచి స్థల సేకరణ వద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వ స్థలం లేదా జీవని కోసం చురుగ్గా పని చేస్తున్న వ్యక్తులం కలసి స్థలం కొనాలని అనుకున్నాము. చివరి అవకాశం మాత్రమే దాతలకు ఇస్తున్నాము ( స్థలం కొనిస్తామని దాతల నుంచి ఒత్తిడి ఉంది ) జీవని కాన్సెప్టుకు స్వేచ్చా స్వాతంత్ర్యాలకు సార్వభౌమత్వానికి భంగం కలగకుండా, బేషరతుగా స్థలం ఇస్తేనే దాతల నుంచి స్వీకరించడం జరుగుతుంది.


ఈ నెలాఖరుకు స్థలం సేకరించాలని గడువు విధించుకున్నాము. వచ్చే వారంలో జిల్లా కలెక్టరు గారిని జీవని బృందం కలవనుంది.



మీ,


జీవని.



on
categories: | edit post

21 వ్యాఖ్యలు

  1. మీపని నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.

     
  2. విఘ్న్నలు తొలగి అంతా శుభం జరుగుతుంది. చాలా పెద్ద పని మొదలు పెట్టారు కాబట్టి శంకుస్థాపన సమయంలో వీలైతే లక్ష్మీ గణపతి హోమం ( మీకు నమ్మకం ఉంటే) చేయండి. పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. మీరు చేస్తానంటే చేయించడానికి నేను వస్తాను. దక్షిణలేవీ అవసరం లేదు లెండి :). ఆ పిల్లల కోసం నావంతు సహకారం చేసిన సంతృప్తి కలుగుతుంది.

    ఇంకో విషయం. మీకభ్యంతరం లేక పోతే మంచి బలమైన ముహూర్తం నేను చెప్పగలను. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని. తొందరగా కావాలంటే ముహూర్త బలం చాలా అవసరం.

    ఏదేమైనా మీరు మనస్ఫూర్తిగా చేస్తున్న ఈ పనికి ఈ శ్వరానుగ్రహం పూర్తిగా ఉంటుంది.

     
  3. jeevani Says:
  4. విజయ్ గారూ,

    ధన్యవాదాలు. జీవని నా ఒక్కడి నమ్మకం, అభిమతాల మేరకు నడవదు. మీరు మంచి చెబుతున్నారు.
    ఇంకా స్థలం దొరకలేదు. కాబట్టి హోమం చేయగలమా?
    శంకుస్థాపన రోజున హోమం చేయవచ్చా? అదే రోజే చేయగలం అనుకుంటే, మీకు వీలు అయితే మీరే భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించండి. అలాగే ముహూర్తం కూడా నిర్ణయించండి.

    @ విజయ మోహన్ గారూ

    ధన్యవాదాలు.

     
  5. మీకు భూమి దొరికిన తరువాత, ముహూర్తం నిర్ణయించుదాము.


    ఆ తరువాత మీ కార్య వర్గ సభ్యులందరినీ సంప్రదించి వారందరి అంగీకారంతో ఈ హోమాన్ని నిర్వహిద్దాము. వద్దు అని అనుకున్నట్లైతే ఆపివేద్దాము. మంచి పనే కాబట్టి అభ్యంతరం ఉండదనే అనుకుందాము.


    శంఖుస్థాపన సమయంలొనే మనం హోమం చెయ్యవచ్చు. భూమి పూజకు తప్పక చేస్తాను.

    కానీ అది ముందు ముహూర్తం నిర్ణయించిన తరువాత చెప్పగలను. ఎందుకంటే అంతకు ముందే ఒప్పుకున్న కార్యక్రమముంటే నేను రాలేను. అదే అప్పటికి ఏమీ ఒప్పుకోక పోతే ఎంత పని వచ్చినా ఆపివేసి మన పూజకు వస్తాను.

    నమస్కారం.

     
  6. Anonymous Says:
  7. మీ బ్రాంచి కల్యాణదుర్గం లో ఏదైనా వుందాండి?

     
  8. All the best. Let me know if I can be of any help at all.

     
  9. jeevani Says:
  10. విజయ్ గారూ ఇందుకు కార్యవర్గం వగైరా అవసరం లేదు. మీకు ఇబ్బంది లేకపోతే తప్ప ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఇతరత్రా దైవికపరమైన అన్ని విషయాలు మీకే వదిలేస్తున్నాము.
    ఇక ముహూర్తం మీ చేతిలో పని కాబట్టి మీకు వీలైన + మంచి రోజు మీరే నిర్వహించవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య అనంతపురంలో సేవా సంస్థలకు తల్లి లాంటిది RURAL DEVELOPMENT TRUST - RDT . ఈ సంస్థ నిర్వాహకులు మాంచొ ఫెర్రర్ గారిని ముఖ్య అతిథిగా అనుకున్నాము. ఆయన డేట్లు తీసుకుని మీకు చెప్తాను.
    స్థల సేకరణ ఈ నెలాఖరుకు అవుతుందని నమ్మకంగా ఉన్నాము. ఈ పని అవగానే మీకు తెలియపరుస్తాను.
    మీకు మరోసారి మా ధన్యవాదాలు.

     
  11. పనిలో పనిగా పిల్లలందరూ మంచిగా చదవడానికై తాయెత్తులూ కట్టించేయండి. దయ్యం, భూతం ప్రభావాలు లేకుండా మంత్రించిన నిమ్మకాయలూ పిల్లలకు ఇచ్చేయండి. అప్పుడు పిల్లలందరూ మీ శ్రమ లేకుండానే చక్కగా చదివి జీవని విద్యాలయానికి గొప్ప పేరు తెచ్చిపెడతారు!

     
  12. jeevani Says:
  13. భరద్వాజ గారూ,

    మీ స్పందనకు చాలా చాలా థేంక్స్. ఈ సమస్యల్ని మేమే అధిగమిస్తాము. బడి ప్రారంభం అయ్యే వరకు మీ సహాయం ఆశించకూడదని మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాము. మీ నైతిక మద్దతు ఎప్పటికప్పుడు మాకు హుషారు కలిగిస్తూనే ఉంటుంది.

    ధన్యవాదాలతో,

    జీవని.



    అనానిమస్ గారూ,

    లేదండీ. బ్రాంచుల స్థాయి లేదు. అనంతపురంలోనే. పిల్లల్ని చేర్చాలనుకుంటే మా దగ్గరకు పంపవచ్చు. వారి చదువు, ఆరోగ్యం, బట్టలు అన్నీ మేమే చూసుకుంటాము.
    ధన్యవాదాలు.

     
  14. jeevani Says:
  15. శరత్ గారూ,

    కోపమొచ్చేసింది కదూ. :) ఈ వ్యవహారంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు కదా. పైగా శ్రమ కూడా విజయ్ గారిదే... రావడం పోవడం. ఎలాగూ భూమి పూజ చేయాలి, ఇది ఎగరగొట్టలేం కదా. దానికి అదనంగా ఆయన హోమం అంటున్నారు.

    తాయెత్తులు మంత్రించిన నిమ్మకాయల సెక్షన్ వేరే ఎవరికైనా అప్పగిద్దామా? :)

     
  16. ఏకలింగానికి భూతవిద్యల్లో కాస్త అనుభవం వుందనుకుంటా. ఆయన్ని కాంటాక్ట్ చేద్దాం :))

     
  17. jeevani Says:
  18. ఆయన ఏడు సముద్రాల అవతల ఉన్నారేమో కదా???

     
  19. జీవని గారూ,
    నా అస్మదీయుల సహనాన్ని అప్పుడప్పుడూ ఇలా పరీక్షిస్తుంటాను. కొందరు తేలిపోయి తస్మదీయులవుతారు. మీలాంటి వారు నాకు అస్మదీయులుగా మిగిలిపోతారు. విమర్శించినప్పుడు ఎలా స్పందిస్తారనేదానిని బట్టే వ్యక్తిత్వం ముఖ్యంగా బయటపడుతుంది :)

     
  20. jeevani Says:
  21. శరత్ గారూ,

    మీ దగ్గర ఇట్లాంటి కళలు చాలా ఉన్నాయండీ :)
    పొద్దున కూడా ( మా ఊర్లో ) మీ బ్లాగులో ఇలాంటి డిప్లొమటిక్ వ్యాఖ్య ఒకటి చూసినట్లు గుర్తు.
    మొత్తమ్మీద మీ శైలి, మీ ఓపన్ హార్ట్ రెండూ గొప్పవే.

     
  22. Hi,

    Every thing will goes fine for this Good work.

    All the Best to Jeevani ......

    Yours,

    Suresh Reddy Miduthuru

     
  23. Hi,

    Every thing will goes fine to this Good work.....

    All the Best to Jeevani.....

    Yours,
    Suresh Reddy Miduthuru

     
  24. jeevani Says:
  25. tammudu suresh,

    thank you.

     
  26. జీవని గారు, మీ విద్యాలయం తరగతులు మొదలయ్యాయన్న వార్త కొరకు చూసే వారిలో నేనూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్.

     
  27. jeevani Says:
  28. ఉష గారూ ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు తప్పక ఫలిస్తాయని మా నమ్మకం.

     
  29. durgeswara Says:
  30. మీ సత్సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ జగన్మాతను వేడుకుంటున్నాను . శర్మగారు నిర్వహించే హోమానికి వీలైతే నేనుకూడా వచ్చి ఉడతాభక్తిగా సహాయపడగలను .

     
  31. jeevani Says:
  32. దుర్గేశ్వర గారూ మీవంటి మంచి మనుషుల ఆశీర్వాదం మాకు తప్పక కావాలి. మీరు వస్తామంటే... :)

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo