మిత్రులారా ఎన్నో నెలల తరబడి స్థలం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 2 ఎకరాల స్థలాన్ని జీవని విద్యాలయం కోసం కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు అగ్రిమెంట్ అయింది. వచ్చే వారంలో రిజిస్ట్రేషన్ జరగనుంది. ఎకరం 3.5 లక్షలు. అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్ళేటపుడు రోటరీపురం అనే గ్రామం వస్తుంది. ఇది అనంతపురానికి 15 కిలోమీటర్ల దూరం. ప్రధాన రహదారికి మన స్థలం 150 మీటర్ల దూరంలో ఉంది. ఇక జీవనికి అనుక్షణం తోడు అందిస్తున్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి మన స్థలానికి కేవలం అర కిలోమీటరు.
2 సంవత్సరాల కాలంలో జీవని సాధించిన ఈ ప్రగతికి తోడ్పడిన మహానుభావులకు, మానవతామూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నాము.
జీవని విద్యాలయ నిర్మాణం మొదటి పరీక్ష. ఆ తర్వాత నిర్వహణ.
మీ
జీవని.
Excellent, keep good work going on.
santhi garu thank you
మంచి వార్త చెప్పారు..మేం మీ వెనుకే ఉన్నాం.. :)
ఎటువంటి అడ్దంకులూ లేకుండా అంతా మంచే జరగాలని కోరుకుంటూ..
రాజ్ ధన్యవాదాలు.
బలవంతులైన బంతి, రాజ్ వెనుక వుంటే ఎంతటి గాలినైనా తట్టుకుంటాం, ఆ ధైర్యం ఉంది :)
బలవంతులైన బంతి
kevvvvvvvvvvvv banthi to first boost taaginchandi .. appudu paina vakyam correct avutundi
అభినందనలు. అంతా శుభం జరగాలని కోరుకుంటూ..
శుభం భూయాత్. ఇక మొదలయ్యే పనులన్నీ సవ్యంగా శీఘ్రంగా జరగాలని ఆశిస్తున్నాను.
అనాన్, శిశిర, ఉష గార్లకు ధన్యవాదాలు