బజ్జుల్లోనూ వివిధ బ్లాగుల్లోనూ మన బ్లాగర్ల స్పందను కలిపి ఇక్కడ ఇస్తున్నాము.




source: ongole seenu gari buzz

జీవనికి అందరూ విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక పెద్దాయన ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు . తర్వాత కార్తీక్ నాతో " ఆ వెయ్యి రూపాయలు ఇచ్చినాయన షర్ట్ ఒకపక్క అంతా చినిగి పోయి ఉంది సీనన్నా .. అయన వెయ్యి ఇచ్చాడు అంటే ఆయనలో హ్యుమానిటీ కి హాట్సాఫ్" అని.

మంచూ ఫెర్రర్ తెలుగులో మాట్లాడడం .... అదీ తెలుగుని కాపాడుకోవడం గురించి చెప్పడం.

తర్వాత పిల్లలని పరిచయం చేసేప్పుడు ఒక పిల్లవాడు " మాకు ఎవరూ లేరని బాధలేదు ఎందుకంటే మీరంతా ఉన్నారు కనుక " అన్నపుడు జీవని కుటుంబం లో ఒకడినైనందుకు గర్వపడ్డాను.

చివరిగా ... కార్యక్రమం అంతా అయినాక పిల్లలు అక్కడ ఉన్న బొకే లు చించేసి తలా ఒక పువ్వు తీసుకుని ఆడుకుంటున్నారు. చివరి వాహనం లో వారిని ముందుగా వారి హాస్టల్ కి తరలించేటప్పుడు ఒక పాప మాత్రం నన్ను వెదుకుతూ వెనక్కి వచ్చి నా చేతికి రెండు పూలు అందించింది . ఆ రెండు పూలని చిన్న ప్లాస్టర్ తొ చుట్టి అడుగున కాయితం పెట్టి బుజ్జి బోకేలా చేసి ఇచ్చి .. బాయి చెప్పి పరుగున వెళ్ళి కారేక్కింది. .. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. నా పక్కనే చంద్ర ఉన్నారు .. ఆయన ఆ పాప మీకు అలా స్పెషల్ గా బాయి చెప్పాలని
కారేక్కింది. .. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఆయన ఆ పాప మీకు అలా స్పెషల్ గా బాయి చెప్పాలని ఫీలైంది .... అని నా వైపు కూసింత ఈర్ష్యగా చూసారు :P ( J/K Chandra) .ఇంకా చాలా ఉన్నాయి . ప్రస్తుతానికి ఇవే గుర్తున్నాయి


source: karthik gari blog


మా ముందు వరుసలో కూర్చున్న ఒక ముసలాయన నిదానంగా లేచి నడవడం మొదలు పెట్టాడు.. ఆయనకు 70+ వయసు ఉంటుంది.. కర్ర సాయంతో నడుస్తున్నాడు.. నేను సభ నుంచి వెళ్ళిపోవడానికి లేచాడనుకున్నా.. నిదానంగా వెళ్ళి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చాడు.. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే ఆయన జేబు క్రింద ఉన్న చొక్కా అంతా చిరిగిపోయి ఉంది.. నాకు ఎందుకో ఒక్క నిముషం కళ్ళు చెమర్చాయి.. చాలెంజ్ సినిమాలో చూపించిన ఆ ముసలమ్మ గుర్తుకు వచ్చింది.. వెయ్యి రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడాలో!


source: raj kumar gari blog



పిల్లల్నందరినీ అందరికీ పరిచయం చేస్తున్నప్పుడూ ఒక పిల్లాడు అన్నాడు " అమ్మా,నాన్న లేరని నాకు బాధ లేదు.. మీరంతా మా కోసం ఉన్నారు కాబట్టీ " అని. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలీలేదు నాకు.. మీకో??

RDT ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మాంచూ ఫెఱర్ గారి ఉపన్యాసం నాకు చాలా చాలా నచ్చింది. ఆయన స్టేజ్ మీద కూర్చొని వక్తలు మాట్లాడుతున్నప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటే
"ఇతనికి ఏమ్ అర్ధమవుతుందబ్బా?" అనుకున్నా..!
మైక్ తీసుకొని "సభ కు నమస్కారం" అనగానే ఈ ఒక్క ముక్కా నేర్చుకొచ్చుంటారు అనుకున్నా..! (ఇంగ్లీష్ లోనో, స్పానిష్ లో మాట్లాడతారని నా స్ట్రాంగ్ ఫీలింగ్).
ఆ తరవాత సీమయాస లో తప్పులు లేని తెలుగు లో సాగిన ఆ ప్రసంగానికి నోరుతెరచి చూస్తూ ఉండి పోయాను. ఆయన తెలుగు లో మాట్లాడినందుకే గాదు.. ఆయన చెప్పిన విషయాలు విని. (వీడియో మిస్సవ్వద్దేం..! :-) )



source: vijaya mohan gari blog




అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికైఆడుకునే నాటకమన్నారో సినీ కవి.బూటకం కాదు వాస్తవమనినిరూపించారు మన బ్లాగర్లు.లేకపోతేఒంగోలెక్కడ,విశాఖపట్నమెక్కడ,కడపెక్కడ,చిత్తూరెక్కడ,గుంటూరెక్కడ..అనంతపురమెక్కడ మన అంతరాంతరాలల్లోఉన్నఅనుబంధం,ఆత్మీయత వల్లనే కదాచక్కటి,అద్భుతమయిన సేవా కార్యక్రమానికి హాజరైఆర్థికంగా,నైతికంగా మద్దతిస్తున్నది.

చివరగా జీవని చిన్నారుల గురించో మాట.గత నవంబర్లోపిల్లలను రాజ్గారు,చైతన్యగారు,బంతిగారు,తారగారు కలిసారుకదా! పిల్లలంతా కలిసి మా దగ్గరకొచ్చి ప్రతి ఒక్కరు బాగున్నారాసార్ అంటూ అప్యాయంగా పలుకరించడం చూసి మనసుపులకరించిపోయింది.





banthi & ongole seenu with jeevani children






ongole seenu, karthik, banthi, chandra sekhar ( http://www.moneyvistascapital.com/ )


chandra sekhar, banthi, akella raghavendra, raj kumar, ongole seenu, vijaya mohan









on
categories: | edit post

3 వ్యాఖ్యలు

  1. Hima bindu Says:
  2. touching! akella raghavendra gariki blog vunda?vunte link ivvagalaru.baga telisinavare prasthutam tchlo leru .

     
  3. jeevani Says:
  4. చిన్ని గారూ బ్లాగ్ లేదనుకుంటా, మెయిల్ ఐడి ఇవ్వగలను, దయచేసి jeevnai.sv@gmail.com కు మెయిల్ ఇవ్వండి

     
  5. jeevani Says:
  6. sorry, jeevani.sv@gmail.com

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo