తడబడుతూ పడ్డ అడుగులు వడివడిగా నడుస్తున్న సమయంలో ఆ అడుగులు మరింత బలంగా పడేందుకు.. ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు ఊతం దొరికింది. కరవుజిల్లాలో పుట్టిన చిన్న వెలుగు మొలక ఇవాళ రాష్ట్రమంతటా.. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా సూర్యకాంతులు విరజిమ్ముతోంది.. మూడు సంవత్సరాల ప్రస్థానం.. ఒక ఉన్నతమైన ఆశయం.. అంతకంటే ఉన్నతమైన లక్ష్యం.. ఇవాళ ప్రత్యేక గుర్తింపును సాధించింది. 2009 నుంచి జీవని సంస్థ దృఢ సంకల్పంతో.. చెదరని ధైర్యంతో.. వేలాది ప్రజల అండదండలతో ఎవరూ లేరనుకున్న పసివాళ్లకు అన్నీ తానై నిలిచి చేస్తున్న సేవకు విశిష్టమైన పురస్కారాన్ని సాధించింది. భారతదేశంలో తొలి న్యూస్‌చానల్ జీ నెట్‌వర్క్.. తన ప్రాంతీయ చానల్ జీ 24గంటలు ద్వారా అణిముత్యంగా జీవని సంస్థను గుర్తించటం ఒక అద్భుత పరిణామం.
జీవని సంస్థలో ప్రస్తుతం ఉన్న పాతికమంది చిన్నారులది ఒక్కొక్కరిది ఒక్కో కథనం... అయితే తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు వాళ్లు దేవుణ్ణి బాగా విశ్వసించారు.. ఆయనే తమను సృష్టించారని నమ్మారు.. అందమైన భూమ్మీద అందంగా జీవితాన్ని గడిపేయొచ్చని కలలు కన్నారు. జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోతుందని ఆశపడ్డారు. కానీ వాళ్లు కోరుకున్న ఆ జీవితం వాళ్ల ఊహకు తెలియకుండానే ముగిసిపోయింది.. తల్లిదండ్రులు ఏమైపోయారో తెలియదు.. తమకు సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే రోజులు గడుస్తున్నాయి. అందరిలా తమకూ చదువుకోవాలని ఉంది.. ఆడుకోవాలని ఉంది.. కానీ, ఎలా? తామేం చేశామో వారికి తెలియదు.. తమకు మంచి జీవితాన్ని ఇస్తాడనుకున్న దేవుడు పత్తాలేకుండా పోయాడు.. వారి దృష్టిలో వాళ్ల దేవుడు చచ్చిపోయాడు.. ఆ స్థితిలో ఉన్న అమాయక పసికూనలను అక్కున చేర్చుకుని ఆప్యాయతల్నిచ్చి, ఆదరించి, అండగా నిలిచి, మరింత ఎదుగుదలకు ఊతకర్రగా నిలిచిన జీవనికి ప్రేరణ... జాతీయ మీడియా జీనెట్‌వర్క్.. జీ 24గంటలు ఆణిముత్యంగా ఆత్మీయంగా అందించబోతున్న జాతీయ పురస్కారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జీవని అందుకోబోతోంది.. జీవనికి ఆర్థికంగా... హార్థికంగా... బహిరంగంగా.. గుప్తంగా.. అన్ని విధాలుగా దన్నుగా నిలిచిన వారందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది.. ఈ పురస్కారం మన మలి ప్రస్థానానికి ఉత్ప్రేరకం కావాలి.
అయితే ముందు నుంచి చెబుతున్నట్టు జీవని అందరిది. సేవాభావం కలిగిన వ్యక్తులకు ఒక వేదిక లాంటిది. జీవని కోసం కృషి చేస్తున్న వందలాదిమంది సభ్యులు , కార్యకర్తలకు ఈ బహుమతిని వినమ్రంగా అంకితం చేస్తున్నాము. మాకు ప్రత్యక్షంగా పిల్లలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తున్న పుణ్యమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాము. ఇక దీనికి మూలకారకులైన చిన్నారులకు పెద్దలం కాబట్టి ఆశిస్సులు అందిస్తున్నాము.
posted by: Kovela Santosh Kumar
This is amazing Prasad garu!... really great...good work, keep it up!
Congratulations!
ప్రసాద్ గారికి, జీవనికి ఈ సందర్భం గా శుభాకాంక్షలు.
కాముధ
చాలా సంతోషకరమయిన వార్త ప్రసాద్ గారూ..!
జీవని కుటుంబ సభ్యులందరికీ అభినందనలు..
దేవుని ప్రసాదం అందుకున్న ఆనందంగా ఉంది ప్రసాద్‍గారూ!
అభినందనలండీ. మీ అందరి సేవకీ, దీక్షకీ తగిన గుర్తింపు. శుభం. భవిష్యత్తులో జీవినికి మరింత ప్రోత్సాహం, గుర్తింపు లభించాలని ఆకాంక్షిస్తూ..
జీవని కుటుంబ సభ్యులందరికీ అభినందనలు..
Great. We all feel good
thanks to all
- JEEVANI
congrats prasad ..
congratulations.we feel proud of u
happy to says god id there
Great Efforts by u....
This is wonderful achievement considering the age of organization. Hope we would get more accolades in coming years
...It's proved yet again that.....
Good work gets recognition.....
Dash on JEEVANI....
very thankful to prasad garu.....Congratulations to all group members......me very proud to say one of the member......
స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
Nuvu challa gopavadivi santhosh annaya.... :)