మిత్రులారా బృందావనం సహకారంతో జీవనిలో ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే వారు ప్రకృతి వ్యవసాయం కేంద్రబిందువుగా దీన్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు మేము విపరీతమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాము, వ్యవసాయానికి స్థలం కూడా తగ్గుతోంది. శాశ్వత బిల్డింగులు కట్టేందుకు తగినన్ని నిధులు సమకూరలేదు. ఇది రెండు అంతస్థులతో నిర్మించాలి అనుకున్నాము. ప్రస్తుతం తాత్కాలిక షెడ్లు వేస్తున్నాము. ఇది స్థలాభానికి కారణమైంది. ప్రధాన ఆశయాలు నెరవేరే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రస్తుతానికి నిలిపివేసాము.
ఇంతవరకు బృందావనం జీవని కోసం పెట్టిన ఖర్చు
రాగి బిందె : 3000/-
ఆవులకు షెడ్ కోసం : 10,000/-
జీవని తరఫున గడ్డి 10,000/- పెట్టి కొన్నాము. దానికి రెండు విడతలుగా రవాణాకు, వామి వేయించడానికి 4,900/- ఖర్చు అయింది. మొత్తం 14,900/- ఇప్పుడు తిరిగి అమ్మకానికి పెడతాము. వచ్చే నష్టాన్ని వ్యక్తిగతంగా జీవని నిర్వాహకులు భరిస్తారు. జీవని విరాళాలనుంచి ఈ నష్టాన్ని వాడబోము అని దయచేసి గమనించగలరు.
డైలీ బ్యాలెన్స్ షీటు ఇక వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php
ధన్యవాదాలతో
జీవని
Why do you need to bear this personally? Getting some loss due to unforeseen events is obvious. Please make sure you(organizers) are being fair to them selves. If you feel some one will question your decisions, please form a committee to make any stand.
అఙ్ఞాత గారూ మీ సూచనకు ధన్యవాదాలు. నిజమే ప్రాజెక్టు తప్పనిసరి పరిస్థితుల్లో ఆపివేయాల్సి వచ్చింది. విరాళం ఇచ్చే ప్రతి దాతా తన సొమ్ము పిల్లలకు వినియోగించాలని కోరుకుంటాడు. దాతలు, జీవని సభ్యులు, కమిటీ ప్రశ్నిస్తారు అని కాదుగానీ ఈ నష్టాన్ని దాతల ఖాతాలో వేయడానికి మనసు ఒప్పలేదు. అయినా ఈ నష్టం చాలా తక్కువేలెండి భరించగలిగేదే. మీ స్పందనకు మరోసారి థ్యాంక్స్.