నిన్న రాత్రి సుప్రజ అనే అమ్మాయి చెవిలో పేడ పురుగు దూరింది. ఇలా జరగడం ఇది మూడోసారి. గతంలో మనీషాకు, నాకూ చెవిలో పురుగులు దూరాయి. అయితే ఈ టపా ముఖ్య ఉద్దేశం, వాటిని బయటకు రప్పించే టెక్నిక్ మీకూ తెలియజేయాలని. బహుశా చాలా మందికి తెలిసుండొచ్చు, తెలియనివారికి ఇది. గదిలో లైట్లు ఆపేసి టార్చిని చెవిలోకి ఫోకస్ చేయాలి. ఆ వెలుగును వెతుక్కుంటూ పురుగులు క్షణాల్లో బయటకు వస్తాయి. ఇక మేము ఊరి బయట, పల్లెలో ఉండటం వల్ల కీటకాలు కాస్త ఎక్కువే. కిటికీలకు నెట్స్ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని లోపల తిరుగుతూనే ఉంటాయి.
డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php
నిదురించే ముందు చెవులలో దూది పెట్టుకోవటం ఒక మంచి నివారణోపాయం అనుకుంటాను.
అవును సార్ అది మంచి నివారణోపాయమే. ఆ పని చేస్తున్నారు. అయితే ఒక్కోసారి వీళ్ళు మర్చిపోవడం, నిద్రలో దూది బయటకు రావడం లాంటివి జరుగుతున్నాయి. ఇక కచ్చితంగా అమలు చేయాలి.
శ్యామలీయం గారు చెప్పిన ఉపాయం పిల్లలకు చెప్పండి
అలాగే చెవిలో చీమగాని పురుగుగాని దూరినపుడు లేచి హైరాన పడి చెవిలో నీల్లు పొయ్యడం తలను కదిపెయ్యటం చేస్తుంటారు కొంతమంది. అది సరికాదని నా అనుమానం. బస్సు కుదుపులకు మనం ఎలాగైతే ఏదో ఒక దాన్ని పట్టుకుంటామో అలాగే మనం విపరీతంగా కదిలితే లోపల ఉన్న పురుగు తన నోటితో (లేదా వేరే అవయవంతో) మన చర్మాన్ని కరిచి పట్టుకోవచ్చు. అపుడు మనకి మరింత బాధ కలుగుతుంది.