మిత్రులారా పిల్లలకు ఆర్థికంగానే కాక ఇతరత్రా ఎలా సహాయపడాలి అని ఎందరో దాతలు అడుగుతుంటారు. వారికోసం ఇక ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించనున్నాము. మీలో ఒక్కో రంగంలో ఆరితేరిన మేధావులు, కళాకారులు ఉన్నారు. మీ ఙ్ఞానాన్ని పిల్లలకు పంచండి. మీరు ఏ హైద్రాబాద్, అమెరికా, యూకే నుంచి పాఠాలు చెప్తే, మాట్లాడితే వారికి థ్రిల్లింగా ఉంటుంది. మీ విజయ గాథలు చెప్పండి, కథలు చెప్పండి, ఆత్మస్థైర్యాన్ని నింపండి, మీకు తెలిసిన విషయాలు, ముఖ్యంగా మీ ప్రాంత ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంత చరిత్ర చెప్పగలిగితే సంతోషం. ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం ఈ పద్ధతిలో నేర్చుకుంటే పిల్లలు ఎప్పటికీ మర్చిపోరు. ఫలానా ఆయన అమెరికా నుంచి  ఈ విషయాలు చెప్పారు అని వ్యక్తితోపాటు ఆ విషయాన్ని కూడా గ్రహిస్తారు.  అలాగే మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు.
దీన్ని నిర్వహించడానికి అవసరమయ్యే ప్రొజెక్టర్ కొనడానికి ఒక దాత ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు. ఈ నెల 25 వ తేదీ నుంచి దీన్ని ప్రారంభించనున్నాము. అంతకంటే కొన్నిరోజుల ముందు దాత ప్రారంభిస్తారు. ప్రతి ఆదివారం మీరు పిల్లలతో ఇంటరాక్ట్ కావచ్చు. అయితే శుక్రవారంలోగా కింది వివరాలు పంపితే మేము ప్లాన్ చేసుకోగలము. 
పేరు:
నివాస స్థలం:
సబ్జెక్ట్:
వ్యవధి :
సమయం : భారత కాలమానం ప్రకారం
మీరు jeevani.sv@gmail.com కు మెయిల్ చేయవచ్చు

ఒక్కోసారి ఇక్కడి నిర్వాహకులకు అత్యవసర పరిస్థితుల్లో సాధ్యం కాకపోతే దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము.

ఈ రోజు లాప్టాప్ ద్వారా గూగూల్ హ్యాంగ్ ఔట్లో అమెరికాలోని దాత ద్వారా మాట్లాడించాము. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

  1. Praveena Says:
  2. Chaala manchi idea.Good impact vuntundi children meeda.It will be fun and interesting for them.

     
  3. Best of luck to all involved

     
  4. Best of luck to all involved

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo