శెట్టూరులో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న బాబూరావు, చాలా రోజుల నుంచి పిల్లలకు బ్లడ్ గ్రూపింగ్ చేద్దాం  అంటున్నారు. నిన్నటికి తీరింది. ఇందుకు కావలసిన సరంజామాను బాబు సోదరుడు, AFFLATUS GLOBAL SCHOOL ప్రిన్సిపాల్  సాల్మన్ స్పాన్సర్ ( 3500/- ) చేసారు. గ్రూపింగ్ తోపాటు, HIV TEST కూడా చేసారు. వీరికి శ్యాం సహాయం చేసారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

సునీత మొదటినుంచీ ఏడుస్తూ చాలా బాధపడి రక్తం ఇచ్చింది. కానీ తీసేటపుడు మాత్రం మారాం చేయలేదు. ఆ అమ్మాయికి చెప్పాము. సమస్య కూడా ఇలానే ఉంటుంది. దాన్ని ఫేస్ చేయనంత వరకూ భూతంలాగా కనిపిస్తుంది. చాలా సమస్యలు ఫేస్ చేస్తే తేలిగ్గానే ఉంటాయి. మనమే భయపడతాం అని.  

చిట్టచివరగా బ్లడ్ శాంపిల్ తీసిన నంద కిషోర్ మాత్రం ముగ్గురు పట్టిలాగినా పిడికిలి వదల్లేదు. బొటన వేలు దాచిపెట్టుకున్నాడు :)
మిగతా వాళ్లు ఎవ్వరూ ఏడ్చలేదు. అందరికీ లంచంగా చాక్లెట్లు ఇచ్చాము.
బాబు బ్లడ్ గ్రూపింగ్ చేయటమే కాక వాటి గురించి పూర్తిగా పిల్లలకు వివరించాడు. వారికి ప్రాక్టికల్గా చూపించాడు. మేమందరం కూడా బ్లడ్ గ్రూపింగ్ ఎలా చేస్తారో  తెలుసుకున్నాము.

పిల్లల బ్లడ్ గ్రూపులు .... 

Jyothi, Sandhya, Dhanalakshmi, Banu, Ramanji, Chaitanya, Asif, Manisha - A+

Om prakash - A- 
 
Ravi, Lavanya, Shiva, Hemanth, Supriya, Supraja, Surendra, Dinesh, Manoj, Indraja, Sravani, Sunitha, Satish, Ganesh, Nanda kishore, - B+

Srinidhi, Anand - AB+
 
Mehataj, Vamsi, Hari, E.Ganesh, Sowjanya, Bhaskar, Sowmya, Srithaja, Vivekananda  - O+


సేవారంగంలో ఒకప్పుడు అద్భుతంగా పనిచేసిన బాబు కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి తన కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు చెప్పాడు. రక్తదానంలో అవార్డు అందుకున్నాడు. రక్తదానం విరివిగా చేయించాడు. అంతకంటే ముఖ్యంగా అంటురోగాలతో చనిపోయిన వారికి, అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసేవాడు. బాబు తిరిగి తన కార్యక్రమాలు మొదలుపెట్టాలని పదిమందికీ సేవ చేయాలని కోరుకుంటున్నాము. 



నిన్న సాయంత్రం మిత్రులు హరీష్ బాబు ( పెనుకొండలో డిగ్రీ కాలేజి లెక్చరర్గా పని చేస్తున్నారు ) జీవని సందర్శించి పిల్లలకు స్వీట్లు పంచారు. వారికీ థ్యాంక్స్.



on
categories: | edit post

4 వ్యాఖ్యలు

  1. SD Says:
  2. It might be bad idea to post blood group of kids with names on website like this. You could have just said "if anyone wants to know the blood group of any kid, this can be provided by email personally." All you needed to do was give sample like the following

    O - 20 kids
    A - 10 kids
    B - 12 Kids
    etc

    Please learn to protect medical information about the kids (and their medical conditions, if any)

     
  3. naa blood group vaallu okkaroo lenatlunnaaru !

     
  4. సమస్య కూడా ఇలానే ఉంటుంది. దాన్ని ఫేస్ చేయనంత వరకూ భూతంలాగా కనిపిస్తుంది. చాలా సమస్యలు ఫేస్ చేస్తే తేలిగ్గానే ఉంటాయి. మనమే భయపడతాం అని.

    మంచి మాట చెప్పారు ప్రసాద్ గారూ. బాబూరావు గారికి అభినందనలు తెలియజేయండి.

     
  5. jeevani Says:
  6. DG గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. బ్లడ్ గ్రూపులు ఇతరులకు తెలవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని భావించాము. ఎలాంటి సమస్య ఉందో మాకైతే తట్టడం లేదు. అలాగే జీవనికి రెగ్యులర్గా వచ్చే వారు, పిల్లలను గుర్తుపట్టేవారు బ్లాగర్లలో చాలా మంది ఉన్నారు. వీరికి అదనపు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని అనుకున్నాము. ఈసారి తప్పక అలాంటి చర్యలు తీసుకుంటాము.
    @surya, Sisira garu thanks for the response

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo