మిత్రులారా గడచిన వారం రోజుల నుంచి ఏకబిగిన కార్యక్రమాలు, వరుసబెట్టి బర్త్ డేలు, మధ్యలో సాయిప్రత్యూషకు అపెండిసైటిస్ ఆపరేషన్, జీవనిలో ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమం మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ప్రత్యూష ఇప్పుడు బావుంది. జీవని ప్రారంభం అయ్యాక ఆరోగ్య పరంగా వచ్చిన మొదటి పెద్ద సమస్య. అనంతపురంలో ప్రముఖ సర్జన్, సోదరులు హరిప్రసాద్ చాలా తక్కువ ఖర్చులో ఆపరేషన్ చేసారు. వీటన్నిటికి సంబంధించి విడివిడిగా టపా పెడతాము.
మాకున్న మానవ వనరులు తక్కువ, జీవని నిర్వహణ మొత్తం ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారు. ఈ హడావిడిలో ఎవరికైనా మెయిల్స్ రిప్లై ఇవ్వడం ఆలస్యం అయినా, బర్త్ డేలు, స్పెషల్ మీల్స్ అటూఇటూ అయినా దయచేసి అలసత్వంగా భావించకండి. ఇప్పటి వరకు అలా ఎవరూ అనుకోలేదు, మా మీద అపారమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. అది మా అదృష్టం.
ఇక నవంబర్, డిసెంబర్లలో ఎక్కువ బర్త్ డేలు ఉన్నాయి. ఒకే రోజు ఇద్దరి ముగ్గరి కార్యక్రమాలు వుంటున్నాయి. మనం స్పెషల్ మీల్స్ రోజుకు ఒకసారే పెడతాము. అందరి విరాళం 9000/- అవుతుంది. ఈ సందర్భంలో మిగతా విరాళాన్ని జీవని నిర్వహణ ఫండ్లోకి కలపనున్నాము. కాబట్టి అందరూ మీల్స్ స్పాన్సర్ చేసినట్లే భావించండి.
పిల్లలకు స్పెషల్ తిండి ఎక్కువై బాధపడుతున్నారు. కొంతమంది వాంతులు చేసుకుంటున్నారు. స్పెషల్ మీల్స్ పెట్టించకపోతే దాతలు ఫీలవుతారని భయం. నిన్న మరీ దారుణం. SRIT సివిల్ పిల్లలు రాత్రి మీల్స్ స్పాన్సర్ చేసారు. ప్రసాదం అని ఇద్దరు స్వీట్లు తెచ్చారు ( పులిహోర, కేసరిబాత్ ) . బాలల దినోత్సవం అని మళ్ళీ స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చారు.
జీవని నిర్వహణ వ్యయం నెలకు 70-80 వేలు ఉంటోంది. ప్రతి నెలా క్రమం తప్పక మనకు వస్తున్న విరాళాలు 40000/- స్పెషల్ మీల్స్ వారానికి ఒకసారి అయితే బావుంటుంది అనుకుంటున్నాము. మిగతా విరాళాల్ని నిర్వహణ ఫండ్కు డైవర్ట్ చేస్తాము. ఇందులో ఏవైనా సవరణలు ఉంటే దయచేసి తెలియజేయండి.
మీ నిర్ణయాన్ని సమర్థిస్తాను, అలా చేయడమే సబబు అని నాకూ చాలా సార్లు అనిపించింది., దాతలు అందరూ సహృదయంతో దీనిని పరిశీలిస్తే బాగుంటుంది. :)
జీవని నిర్వాహకులకు,
ఈవిషయంలో క్రింది సూచనలను పరిగణలోకి తీసుకోగలరు.
1. ప్రతేక్య భోజనాన్ని నెలకు రెండు సార్లకి మాత్రమే పరిమితం చేయటం
2. అది కూడా పిల్లలికి శెలవు రోజుల్లో ఉండేటట్లు చూడటం
3. అది కూడా ఆదివారాన్ని మరియు పండగ రోజులని దృష్టిలో పెట్టుకొని చూడటం . ఉదాహరణకు డిసెంబర్ 2013 నే తీసుకొంటే ఈప్రతేక్య భోజనాన్ని డిసెంబర్ 8(ఆదివారం) మరియు డిసెంబర్ 25(క్రిస్టమస్) తారీఖున పెట్టుకోవచ్చు. అలాగే జనవరి 2014 నే తీసుకొంటే జనవరి 14(సంక్రాంతి) మరియు జనవరి 26 న(గణతంత్ర దినోస్థవం) రోజున పెట్టుకోవచ్చు.
4. దీనికి సంబంధించి తేదీలను ప్రతి మూడు నెలకు ముందే ప్రకటించటం మరియు దీన్ని జీవని మెనూలో పొందుపరచటం
5. ఈప్రతేక్య భోజనాన్నిజీవని మెనూలో రెగ్యులర్ ఐటమ్ లాగా(నెలకు 2 సార్లు ఫైన చెప్పినవిధంగా) పెట్టుకోవటం
6. దాతల విరాళాలతో సంబంధం లేకుండా ఈకార్యక్రమాన్ని నిర్వహించటం
7. ఇక ప్రతేక్య భోజనానికి సంబంధించి అందే విరాళాల మొతాన్ని జీవని నిర్వహణ ఫండ్లో జమ చేసి వాటిని జీవని నిర్వహణకు వాడటం
దీనివల్ల కలిగే లాభాలు
1. తక్కువ మనవ వనరులతో(జీవనికి ప్రస్తుతం ఉన్న మానవవనరుల కొరతను ద్రుష్టిలోపెట్టుకొని) మరింత క్రమశిక్షణతో ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం.
2. ప్రతేక్య భోజనాన్నిశెలవు మరియు పండగ రోజుల్లో పెట్టటం వలన పిల్లలికి ఎంతో సంతోషంగా వుంటుంది.
3. అనుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఈప్రతేక్య భోజనాన్ని ఈర్పాటు చేయటం వలన వొచ్చే ఆరోగ్య సమస్యలను నివారించవొచ్చు.
4. దాతల విరాళాన్ని పిల్లల తోడ్పాటుకి అభివృద్ధికి సమవర్ధంతంగా వినియోగించటం(ఉదాహరణకు, డిసెంబర్ 2013 లో ప్రతేక్య భోజనానికి సంబంధించి మనకి 9 మంది కోరితే, రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మిగిలిన విరాళం మొతాన్ని జీవని రోజువారి కార్యకలాపాలకు వాడొచ్చు)
ఇట్లు
రామకృష్ణ అగ్తు

అయ్యయ్యో..ప్రత్యూష కి ఇప్పుడు బానే ఉంది కదండీ.. ?
డైవర్ట్ చెయ్యడమే కరక్ట్ అని నా అభిప్రాయం కూడా.
పిల్లల ఆరోగ్యం, భోజనం, నిర్వహణ ఇత్యాదులన్నీ మీ కనుసన్నలలోనే ఉండేట్టు చూసుకోండి. పిల్లలకు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారనే విషయం మరిపించేట్లు ఉండాలి కానీ వారు ప్రత్యేకం అనే భావన కలిగించటం మంచిది కాదు. మొహమాటాలకు పోకుండా పిల్లల విషయం లో సరియైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయంలో కొన్ని నియమాలు ఏర్పరచి (వారంలో ఒకరోజు లేదా రెండు రోజులు ప్రత్యేక భోజనం ఫర్వాలేదు) అందరికీ తెలియజేసి వాటిని పాటించేట్లు చూడండి.
మీ అందరి సలహాలు సూచనలకు ధన్యవాదాలు. వీటన్నిటితో మరొక టపా క్లియర్గా పెడతాము.