క్లాక్ టవర్ వద్ద సహాయశిబిరం దృశ్యాలు.
దాతల నుంచి దుస్తులు స్వీకరిస్తున్న జీవని కార్యకర్తలు
పాపంపేట వద్ద కూడా సహాయ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
మిత్రులారా వరద బాధితుల సహాయం కోసం బియ్యం, ఇతర నిత్యావసరాల సేకరణ జరుగుతోంది. అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత సాంబశివా రెడ్డి గారు తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలని సిద్ధమయ్యారు. జీవని స్వచ్చంద సంస్థ , సమ్యుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. రేపు ఒక వాహనం నిండా వెంటనే తినగలిగే పదార్థాలను బ్రెడ్, బన్, బిస్కెట్ లాంటివి తీసుకుపోవాలనిప్లాన్ చేస్తున్నాం. అలాగే మంగళవారం ఒక గ్రామాన్ని ఎంచుకుని అక్కడి కుటుంబాలకు సహాయం చేయడం. ఒక వారం రోజులు సరిపడా ముడి పదార్థాలను ఒక్కో కుటుంబానికి అందజేయడం, దుప్పటి, తువ్వాలు, ఇంకా అవసరమైనవి సరఫరా చేయాలని అనుకుంటున్నాము.
మంచిపని చేస్తున్నారు సార్! నెనర్లు!