మిత్రులారా ఇది ప్రాథమిక అంచనా. ఈ సంఖ్య నిధుల లభ్యతని బట్టి ఉంటుంది. నిధులకు ఇబ్బంది అయితే మనకు తప్పనిసరిగా అవసరం అయ్యేవి మాత్రమే కట్టుకుంటాము.
తరగతి గదులు - 7
స్టాఫ్ రూములు - 2
ప్రధానోపాధ్యాయులు & కార్యాలయ సిబ్బంది - 1
జీవని కార్యాలయం - 1
గ్రంథాలయం - 1
ల్యాబ్ - 2 ( కంప్యూటర్, ఇతర సబ్జెక్టులు )
సెమినార్ హాలు - 1
హాస్టల్ గదులు పెద్దవి - 4
స్టోర్ రూము + వంటగది + భోజన శాల - 1
టీచర్లకు క్వార్టర్స్ - 3
నాన్ టీచింగ్ సిబ్బందికి - 3
టాయిలెట్లు - అవసరమైనన్ని
కంప్యూటర్లు ఓ 10 సమకూరితే అపుడు ల్యాబ్ కు బదులు క్లాస్ కు ఒకటి పెడితే ఎలా ఉంటుంది? బోధించేటపుడు ప్రతి వాక్యానికి ఉపాధ్యాయుడు దానికి సంబంధించిన దృశ్య రూపాన్ని పిల్లలకు చూపించాలి. ఉదా.. ఎడారి అన్నపుడు ఆ ఫోటోలు, చార్మినార్, గాంధీజీ ఇలా ఏదైనా కావచ్చు. కాబట్టి పిల్లలకు కంప్యూటర్ పరిఙ్ఞానం కల్పించటంతో పాటు ఈ రకంగా కూడా వాటిని ఉపయోగించవచ్చు. దృశ్యం, స్పర్శ ద్వారా ఏర్పర్చుకున్న ఙ్ఞానం మెదడులో నిల్చిపోతుందని నా అభిప్రాయం.
ఇక సెమినార్ హాలులో రెండో వైపు అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళ ప్రతిమలు ఉంటాయి. అక్కడ అందరూ ప్రార్థనలు చేసుకోవచ్చు.
ఇందుకు మార్పులు చేర్పులు ఉంటే దయచేసి సూచించండి.
Join hands with...
JEEVANI
......FOR UNCARED
contact : jeevani.sv@gmail.com
9440547123
ఇక్కడ చేరే ఒక్కో పిల్లవానినీ ఒక్కొక్కరికి దత్తత ( వారి పోషణ ఖర్చులు భరించుటకు ) ఇస్తే చాలా బాగుంటుంది కదా!? అలా ఒకరికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబ సభ్యులు భరిస్తారు. వారు తరచూ వచ్చి పిల్లలను చూసి వెళుతుంటారు. దీనివల్ల జీవనికి కొంత ఆర్థిక వెసులుబటు కలుగవచ్చు. ఏమంటారు? ఇక్కడ చేరే ఒక్కో పిల్లవానినీ ఒక్కొక్కరికి దత్తత ( వారి పోషణ ఖర్చులు భరించుటకు ) ఇస్తే చాలా బాగుంటుంది కదా!? అలా ఒకరికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబ సభ్యులు భరిస్తారు. వారు తరచూ వచ్చి పిల్లలను చూసి వెళుతుంటారు. దీనివల్ల జీవనికి కొంత ఆర్థిక వెసులుబటు కలుగవచ్చు. ఏమంటారు?
సరిగ్గా మీరు చెప్పినట్టే మన జీవని కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం కూడా అలాగే నడుస్తోంది. హైదరాబాదుకు దాదాపు 350 కిలోమీటర్లు ఉంటుంది. మీ విలువైన సూచనలకు ధన్యవాదాలు.