తల్లిదండ్రులు లేని పిల్లలకు విద్య అందిస్తాం అని పది రోజుల కిందట పత్రికా ప్రకటన ఇచ్చాము. ఇందుకు విశేష స్పందన వచ్చింది. 40 మందికి పైగా మమ్మల్ని సంప్రదించారు. ఆదివారం రోజు పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాము. ఇందులో ఐదుగురు సభ్యులు పాల్గొన్నారు. పిల్లలు చాలా చలాకీగా ఉన్నారు. ఇంటర్వ్యూ సభ్యులు నేరుగా వారినే ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
ఇంటర్వ్యూకు హాజరైన తల్లిదండ్రులకు రానుపోను చార్జీలు కూడా ఇచ్చాము.
14 మందిని ప్రొవిజనల్ గా ఎంపిక చేశాము. ఇంకా క్షేత్ర స్థాయిలో వీరి కుటుంబ స్థితిగతులను పరిశీలించి నిర్ధారిస్తాము. గత ఏడాది ఉన్న ఆరుగురు, కొత్త పిల్లలు కలిపి మొత్తం 20 మందికి మనం నీడను ఇవ్వనున్నాం. వచ్చే సోమవారం పిల్లలు అందరూ బడిలో చేరుతారు. వీరికి వసతి, చదువు, ఆరోగ్యం, దుస్తులు లాంటి అన్ని ఖర్చులు కలిపి 4 లక్షల వరకూ అవుతుంది.
అలాగే స్థల సేకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. త్వరలోనే అది సరిపోయే అవకాశం ఉంది.
By the way I owe you $50. Will send it across soon
bharadwaja garu,
thank you.
జీవని గారు, విరాళాలు సేకరిస్తున్నారా?
ఉష గారూ ,
మీ స్పందనకు ధన్యవాదాలు. విరాళాలు సేకరిస్తున్నాము.
మీ,
జీవని.
జీవని గారు, సరేనండి. మీ బ్లాగులో వివరాలు ఇచ్చారేమో ఇంతకు మునుపు కానీ నేను గమనించలేదు. వివరాలు ఈ క్రింది ఐడీకి ఇవ్వగలరా? ముందుగా థాంక్స్.
ushaa డాట్ raani యెట్ gmail డాట్ com