జీవని మొట్టమొదటిగా అక్కున చేర్చుకున్న ఇద్దరు చిన్నారులు లావణ్య, ఇంద్రజల నాయనమ్మ అనారోగ్యంతో చనిపోయారు. పిల్లలకు తాతయ్య ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేరు.
నాయనమ్మకు చెవుడు ఉండేది. ఇంట్లో ముసలివాళ్ళిద్దరూ చేదోడువాదోడుగా ఉండేవాళ్ళు. ఇపుడు ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు ఒక వృద్ధాశ్రమం కూడా మొదలుపెట్టాలి అని బలంగా అనిపిస్తుంది. అన్నీ అనుకూలించి జీవని విద్యాలయం పూర్తయితే దీని వైపు అడుగులు వేద్దాం. ప్రతి క్షణం వీటి కోసం పనిచేస్తుండటం వల్ల ఇపుడు ఒక మొండి ధైర్యం కూడా వచ్చేసింది. లక్ష్యం సాధించగలమన్న నమ్మకమూ బలపడింది.
ఒక విషాదం ఏమంటే పిల్లలకు ఇంకా విషయం తెలీదు. వాళ్ళు ఎప్పటిలా నవ్వుకుంటూ ఈ రాత్రి నిద్రలోకి జారుకుని వుంటారు. పిల్లలు ఏడుస్తారని ఊరికి తీసుకుపోలేదు. స్కూల్ హాస్టల్లోనే ఉన్నారు. పొద్దున్నే నేనే స్వయంగా వెళ్ళి వదులుతున్నాను. ముసలావిడ ఆత్మకు శాంతి చేకూరాలని,ముసలాయనకు మనోబలం కలగాలని కోరుకుంటూ,
జీవని.
ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని,ఆయనకు మనోబలం కలగాలని నేను కూడా కోరుకుంటున్నాను...
లావణ్య, ఇంద్రజల నాయనమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అండి. ఆ పిల్లలు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, మిగిలిన వారికి మనోబలం కలగాలని కోరుకుంటూ..