మిత్రులారా ఈ నెల 29న జీవని విద్యాలయం శంకుస్థాపన చేయాలని అనుకుంటున్నాము. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. జీవని సభ్యులతో ఈ వారంలో సమావేశం ఏర్పాటు చేసి ఖరారు చేయాలని అనుకున్నాము. జీవనికి తోడ్పాటు అందిస్తున్న సాఫ్ట్ వేర్ సోదరులు బెంగళూరు, హైద్రాబాద్లో ఉంటున్నారు. వారి సౌలభ్యం కోసం ఆదివారం ఫిక్స్ చేసాం.
ఇక అతిథుల విషయానికి వస్తే మా జిల్లాలోనే కాక రాయలసీమ లోని ఇతర ప్రాంతాల్లో పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోన్న Rural Development Trust ( RDT ) chief మాంఛో ఫెర్రర్ గారిని, అలాగే లోక్ సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ్ గారిని ఒప్పించగలిగితే బావుంటుందని కొందరు సభ్యులు అంటున్నారు. వీరితో పాటు అనంతపురం పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న Dr గేయానంద్, MLC గారిని అతిథులుగా పిలవాలని అనుకోవడం జరిగింది.
అయితే ఇవన్ని ప్రాథమిక అంచనాలు మాత్రమే. వీటిలో మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఇంకా సేవా రంగంలో పెద్దలు ఎవరైనా ఉంటే మీరు సూచిస్తే సంతోషం. ఈ కార్యక్రమానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించగలరని ఆశిస్తూ...
మీ,
జీవని.
0 వ్యాఖ్యలు