మిత్రులారా మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీవనిలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఆసక్తి కలిగించేలా విద్యా బోధన, యోగా, ధ్యానం, ఆటలు, పాటలు, చిత్రలేఖనం తదితర అంశాలు చేర్చాము. ఇంకా నైతిక విలువలు, మంచి అలవాట్లు రోజుకొకటి చొప్పున పిల్లలకు నేర్పాలని అనుకుంటున్నాము. ఉదాహరణకు పెద్దలను గౌరవించడం, తమ పని తామే చేసుకోవడం, పర్యావరణ స్పృహ, పరిశుభ్రత తదితర అంశాలు. అలాగే నిజాలు చెప్పడం, దొంగతనం మానిపించడం ( అలవాటు ఉంటే ), ఆత్మవిశ్వాసం కలిగిఉండటం ఇలాంటివన్నమాట మీకు ఏవైనా తెలిసివుంటే మాకు సలహాలు ఇవ్వండి. అలాగే సమ్మర్ క్యాంప్లో పాల్గొని పిల్లలకు ఏదైనా నేర్పాలని అనుకుంటే మీకు స్వాగతం. భొజనం, వసతి సౌకర్యాలు ఉంటాయి.ధన్యవాదాలు. గత కొద్ది రోజులుగా బిజీగా ఉండటం వల్ల బ్లాగ్ అప్డేట్ కుదరడం లేదు.
jeevani.sv@gmail.com
0 వ్యాఖ్యలు