జీవనిలో ప్రారంభించిన సమ్మర్ క్యాంప్ కు అనూహ్య స్పందన వచ్చింది. జీవని విద్యాలయం బయటి పిల్లలలకు కూడా అవకాశం ఇస్తోంది అన్న విషయం మీకు తెలిసిందే. విద్యాలయం ప్రొమోషన్ మరియు జీవని పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ ప్రారంభించాము. బయటి పిల్లలు 50 మంది వచ్చారు. ఇంకా వస్తున్నారు. ఒద్దంటున్నా మొహమాటపెట్టి చేర్చిపోతున్నారు. వీరికి ఫీజు 200/- వసూలు చేసాము. మొదట ఫ్రీగా చేద్దాం అనుకున్నాము కానీ సీరియస్ నెస్ ఉండదని నామమాత్రపు ఫీజు పెట్టాము. దాన్ని తిరిగి వారికే ఖర్చుపెట్టేలా క్రేయాన్స్, పెన్సిళ్ళు తదితర సామగ్రి మరియు రోజూ స్నాక్స్, పాలు అందజేస్తున్నాము. ఈ రోజు రిసోర్స్ పర్సన్ గా మేడా ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ అనంతపురం జిల్లా గర్వించదగ్గ ఉపాధ్యాయుడు.
https://www.facebook.com/prasad.meda.5?fref=ts
ఆయన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఏకబిగిన ప్రసాద్ క్లాసులు చెప్పారు. వారితో పాటు జీవని విద్యాలయం స్టాఫ్ శ్రీవాణి, శ్వేత, కుమార్, రాజు పాల్గొన్నారు.
Chief guest: Sri. T.RANGAIAH, MUNICIPAL COMMISSIONER, ANANTAPUR
KARNA JAGANMOHAN REDDY, CEO, SRIT
J.SALOMAN RAJU, PRINCIPAL & DIRECTOR, AFFLATUS GLOBAL SCHOOL, ATP
T.KRISHNAIAH, TEACHER
S.GANGE NAIK, TEACHER
MEDA PRASAD, TEACHER
0 వ్యాఖ్యలు