

మిత్రులారా ముందునుంచీ చెబుతున్నట్టు జీవని సంస్థ అందరిదీ. జీవనితో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 200 మందికి సంబంధబాంధవ్యాలు ఉన్నాయి.
JEEVANI
JEEVANI
“The best way to find yourself is to lose yourself in the service of others.”
JEEVANI
ఎ.గణేష్ అనే అబ్బాయిని ఈరోజు పాఠశాలలో చేర్చడం జరిగింది. గణేష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు దగ్గర పల్లె. ఈ అబ్బాయి నాన్న చిన్నపుడే కుటుంబాన్ని వదిలిపోయాడు. తల్లి శారీరక వైకల్యంతో బాధపడుతోంది. జన్యురీత్యా వచ్చిన మరుగుజ్జుతనంతో పాటు అనారోగ్యంతో బాధపడుతోంది. గణేష్ ఇపుడు 3వతరగతి. లావణ్య, ఇంద్రజ ఇంటి మీద ధ్యాస లేకుండా సంతోషంగా ఉన్నారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారు. ----------------------------------------------------------------------------------------------- జీవని సంస్థ కోసం చురుగ్గా పనిచేస్తున్న సభ్యులకు గమనిక: నిన్న మిత్రులు వరప్రసాద్, వాసూప్రసాద్ జీవనికి 9000/- విరాళం ఇచ్చారు, అదేవిధంగా వినోద్ బాబు నాయక్ 2000/-, చంద్రకాంత్ నాయుడు 5000/- ఇచ్చారు. మిత్రులారా మంగళవారం ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంకు అకౌంటు ఓపెన్ అవుతుంది. మీరు జీవనికి విరాళాలు సేకరించేటపుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవలసిందిగా కోరుతున్నాము. ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఓ 5గురు దగ్గరి మిత్రులు ఉంటారు. వారిని విరాళం అడిగితే కాదనరు. ఆ చనువుతో మన చైను కొనసాగుతుంది. కానీ ఇతరులను మొహమాటపెట్టి, బలవంతపెట్టి విరాళం అడగటం మన సంస్థ స్ఫూర్తికి పూర్థిగా విరుద్ధం. దాతలను మనస్ఫూర్తిగా ఇచ్చేలా చూడండి. దాతలు ఒకవేళ అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు ఐతే, ముందుగా పిల్లల్ని చూడమనండి. విజిట్ చేయమనండి అప్పుడే విరాళం ఇవ్వమనండి. పూర్తి స్థాయి పారదర్శకతతో, ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా మనం సంస్థను నిలబెట్టాలి. అలాగే నేను ఒక్కడినే అనే కేంద్రీకరణ జీవనిలో లేదు. అందరికి సంస్థలో సమాన బాధ్యతలు, అధికారాలు ఉన్నాయి. నేను అనేవాడిని లేకపొయినా జీవని కలకాలం ఉండాలి. ఇది సంస్థ ఆశయం.
JEEVANI
JEEVANI
మిత్రులారా మీరు ఒక విషయం గమనించారా. పిల్లల తిండి గురించి ఆలోచించడం లేదు. 12000 ఫీజు తిండి, స్కూల్, హాస్టల్ అన్ని కలిపి. సంవత్సరంలో 100 రోజులు దసరా, సంక్రాంతి,వేసవి సెలవలు తీసి వేస్తే దాదాపు 250 పని దినాలు వస్తాయి. ఒక పిల్లవాడికి రోజుకు ఖర్చు 30 రూపాయలు ఉండదా ? టిఫిన్,భోజనం, పాలు, షెల్టర్ వగైరాలకు... మేము సొంతంగా వసతి కల్పించే ఆర్థిక స్థోమత ఇంకా రాలేదు. అది మూడేళ్ళ తర్వాతి విషయం. ఈ మూడేళ్ళపాటు ఇది మంచిదని అనుకున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో చదువు చెప్పిస్తోంది కేవలం పూర్తి స్థాయి భద్రత కోసం అని గుర్తుంచుకోండి. తిరిగి మా ఉపాధ్యాయులే వారికి కోచింగ్ ఇవ్వటానికి శెలవు దినాల్లో వెళ్తారు. మా పాథశాలల గురించి: మాకు వచ్చే పిల్లలు పూర్తి కింది స్థాయి వాళ్ళు తల్లిదండ్రులు పొద్దున పనికి పోతే సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. వారికి పిల్లల గురించి ఏ మాత్రం పట్టదు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 10 మంది పిల్లల్లో కనీసం ఇద్దరు ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని తెలివితేటలతో ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అధమం అని మేము ఎందుకు అనుకుంటాం? అసలు ఈ ప్రైవేటు గొడవ వద్దు అనుకుంటే ఇందుకు చిత్తశుద్ధివున్న ఇద్దరు వ్యక్తులు పూర్తి స్థాయిలో అంకితం కావలసి ఉంటుంది. మానవవనరుల పరంగా ఉన్న సమస్య ఇది. నేను నా ఉద్యొగం చేస్తూ ప్రస్తుతానికి ఇంతవరకు మాత్రమే పనిచేయగలను. పిల్లలు హాస్టల్ లో ఉండటం వల్ల ప్రతి రోజూ నేను పలకరించి బాగోగులు చూడవచ్చు. నిజానికి, మీరు చెప్పినట్టు ఈ వ్యవస్థ మొత్తం సెంట్రలైజ్ చేసినపుడు ఖర్చు తగ్గుతుంది. మీ అటెన్షన్ మీ సూచనలు ఇలాగే దయచేసి కొనసాగించండి. పోనీ దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రణాలిక రూపొందించండి. అలా చేద్దాం! పిల్లల అభివ్రుద్ధి మన లక్ష్యం. బాగుండాలి అంతే
JEEVANI
స్పందించిన ముగ్గురికి ధన్యవాదాలు. ఫీజు హాస్టల్ తో కలిపి 12000/- ఇది ఇంకా మొదటి సంవత్సరమే కాబట్టి ఆశ్రమం దాకా మనం వెళ్ళలేదు. తర్వాతి దశల్లో ఆశ్రమం స్థాపిస్తే ఖర్చు తగ్గుతుంది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అయి ఉండి, ప్రైవేటు పాఠశాలలో చేర్చడానికి ముఖ్య కారణం వసతి. ప్రభుత్వ హాస్టల్లో చేర్చవచ్చు. కానీ వారిని తిరిగి దగ్గరలోని పాఠశాలకు పంపడం, వాళ్ళు తప్పిపోతే వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో పూర్తి బాధ్యత వారి మీద ఉంటుంది. పిల్లలు పరిధిని దాటి పోయే అవకాశం ఉండదు. అంతే కానీ ప్రైవేటు బడుల వల్ల ఐ.ఐ.టి.లు, మెడిసిన్లు వస్తాయన్న ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. కానీ ఒక విషయం గమనించండి. పిల్లల ప్రస్తుత సమ్రక్షకులు మేము ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తాం అంటేనే త్రుప్తి చెందారు. మా బడిలోని పిల్లలు కూడా 50 రూపాయలు ప్రైవేటు బడుల ఫీజు కట్టలేక వస్తున్నారు అంతే కానీ అందరికీ అంగ్ల మాధ్యమం పిచ్చి ముదిరింది. సాంకేతికంగా దీని గురించి మళ్ళీ చర్చిద్దాం. మీరు ఇంకా ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. జీవని సంస్థకు ఆర్థికంగా కంటే మేధొపరంగా , పిల్లలకు మరింత న్యాయం చేకూరేలా చేయాలని బ్లాగు మిత్రులను సవినయంగా కోరుతున్నాను. నిజానికి ఇలాంటి సమస్యల మీద దాదాపు నెల రోజులు చర్చించడం జరిగింది. ఐతే ఇంకా ప్రాక్టికల్ గానూ, అందరి మెదళ్ళలో నలగడం వల్లను సంస్థను బాగా తీర్చిదిద్దవచ్చు.
JEEVANI
JEEVANI
తల్లిదండ్రులు లేని పిల్లలను మాత్రమే జీవని అక్కున చేర్చుకుంటుంది. ఆత్మహత్యలు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో జీవని సభ్యులు ఆయా ఊరికి వెళ్ళీ అన్ని వివరాలు సేకరిస్తారు. వాళ్ళు త్రుప్తి చెందాక కార్యవర్గ సభ్యుల ఆమోదం తీసుకుంటారు. అనంతరం వారి అవ్వాతాతలు లేదా సమీప బంధువులనుంచి అనుమతి తీసుకుని పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లి మాత్రమే ఉండి ఆమె పూర్తి అనారొగ్యంతోనో, మానసిక శారీరక వికలత్వంతో బాధపడుతూ ఉంటుంది. అలాంటపుడు పిల్లలకు ఆమె నుంచి ఎలాంటి సహాయం లభింఛదు. అలాంటి పిల్లలను కూడా మనం చదివిస్తాం. కులం మతం ప్రాంతం వంటి వాటికి అతీతంగా జీవని పనిచేస్తుంది. అందరూ సమానమే. అందరూ పసిమొగ్గలే! మనకున్న ఒకే ఒక్క నియమం తల్లిదండ్రులు లేకుండా ఉండాలి. ఈ రోజు బడిలొకి చేరుస్తున్న పిల్లల వివరాలను సాయంత్రం లోగా మీముందు ఉంచుతాను.
JEEVANI
1995 నుంచి ఇప్పటి దాకా కేవలం 15 కథలు మాత్రమే రాయగలిగాను. నేను చాలా నిదానం. కాకపోతే ఒకటి రెండు మినహాయించి అన్నీ సామాజిక స్పృహ కలిగినవే. ఓ మూడు కథలకు ఈనాడు, జ్యోతిలలో బహుమతులు వచ్చాయి. ఆరు కథలు సంకలనాల్లో వచ్చాయి. రచయితగా ఇది నా చరిత్ర.
JEEVANI
మిత్రులారా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలను సమాజంలో భాగస్వాములను చేయడం, తరచుగా వారిని దాతలతో మాట్లాడించడం అన్న ప్రధాన లక్ష్యాలతో జీవని పని చేస్తోంది. ఈ విధంగా పిల్లల్లో మానవ సంబంధాలను నెలకొల్పడం మన ఉద్దేశ్యం. ఈ సంవత్సరం 10 మంది పిల్లలతో జీవని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభం అవుతోంది. కరువు జిల్లా అయిన అనంతపురంలో మేము తలపెట్టిన ఈ యగ్నం విజయవంతం కావాలని అందరి ఆశీస్సులు కోరుతున్నాం. జీవని సభ్యులు, నిర్మాణం, దాతాల వివరాలు తర్వాతి టపాలో తెలియపరుస్తాను.
JEEVANI
1) రోజుకు 10- 30 నిమిషాల నడక, నవ్వుతూ నడవాలి.
2) రోజులో కనీసం పది నిమిషాలు మౌనంగా, ప్రశాంతంగా గడపండి.
3) పొద్దున లేస్తూనే ఈ వాక్యం పూర్తి చేయండి " ఈ రోజు నా కర్తవ్యాలు ...... "
4) 3 E's ENERGY, ENTHUSIASM, EMPATHY.... 3 F's FAITH, FAMILY, FRIENDS.... తో జీవించండి.
5) 70 ఏళ్ల పైన ఉన్న ముసలివాళ్లతోను, ఆరేళ్ల లోపు పిల్లలతోనూ అపుడపుడు ఎక్కువ సేపు గడపండి.
6) రోజుకు కనీసం ఐదుగురిని నవ్వించే ప్రయత్నం చేయండి.
7) చెరగని చిరునవ్వు అలవాటు చేసుకోండి, మీలో శక్తి పెరుగుతుంటుంది, అదే సమయంలో మనమంటే గిట్టనివారు అసలుoడరు.
8) మన జీవితం ఎంతో గొప్పగా లేకపోవచ్చు కానీ కొంతైనా ఆనందంగా ఉంది కదా!
9) జీవితం చాలా చిన్నది అనవసరంగా ఇతరులను అసహ్యించుకోవడం మానివేయండి.
10) ఎదుటివారు చిన్న తప్పులు చేసినపుడు క్షమించే ప్రయత్నం చేయండి.
11) ఇతరులు మన గురించి ఏమి అనుకుంటున్నారో అనే భావన వదిలేయాలి. అది వారి సమస్య మనది కాదు.
Join hands with...
JEEVANI
......FOR UNCARED
మిత్రులారా జీవని రిజిస్ట్రేషన్ పూర్తయింది. నెంబరు 14/ 2009. జీవని అనాధ పిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇస్తుంది. అంత కంటే ముఖ్యంగా వారితొ చాలా తరచుగా దాతలను కలుపుతూ పిల్లల్లో ఆత్మన్యూనతను పోగొట్టడం మానవ సంబంధాలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యాలు. వచ్చే నెల మొదటి నుంచి పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Join hands with...
JEEVANI
......FOR UNCARED
బీడు వారిన భూములు...
మోడువారిన జీవితాలు...
ఒక్క వాన చుక్క లేకపోయినా తాగడానికి పురుగుల మందు ఉంది
మునగడానికి వ్యవసాయం ఎటూ ఉంది...
దరిద్రమైన నికృష్టమైన జీవితాలకు నిలువుటద్దాలు అనంతపురంలోని పల్లెలు ( అయిదు సంవత్సరాల కిందట... వర్షాలులేక పల్లెతల్లి అలమటించింది. ఇపుడు పరిస్థితి ఫర్వాలేదు).
అలాంటి పల్లెవాసుల కళ్ళ వెలుగు ఫాదర్ ఫెర్రర్. ఎక్కడో స్పెయిన్లో పుట్టి ఈ అనంతపురం పల్లె ప్రజల జీవితాల్లో వెలుగునింపిన మహనీయుడు ఆయన. 
రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ ఈ జిల్లాలో ఒక సమాంతర వ్యవస్థ.
విద్య -- మారు మూల పల్లెల్లో పాఠశాలలున్నాయి, లక్షలాది రూపాయల ఖర్చుతో పెద్ద పాఠశాలల నిర్మాణం. మానసిక, సారీరక వికలాంగులకు ప్రత్యెక బడులు.
వైద్యం --- అతి తక్కువ ఖర్చుతో వైద్యం, కుటుంబ నియంత్రణకు ప్రత్యెక ప్రోత్సాహకాలు...
నీడ --- పల్లెల్లో అత్యంత నాణ్యమైన ఇళ్ళ నిర్మాణం. చివరన తాళం కూడా వాళ్ళే ఇస్తారు.
ఉపాధి--- వేలాది మందికి ఉద్యోగాలు కల్పన.
మరి ఈ జిల్లాకు ఇదంతా అమృతవర్షం కాదా?
పర్యావరణం ఇంకా నాకు తెలియని అనేక రంగాల్లో కూడా ఈ సంస్థ పని చేస్తోంది.

మన దేశంలో భారత రత్న లాగస్పెయిన్, ఫెర్రర్ కు అత్యున్నత పురస్కారం నిన్న అందజేసింది. ఆయన ఆరోగ్య రీత్య వెళ్ళలేక పోయారు. అందుకోసంస్పెయిన్ ప్రభుత్వం వైస్ ప్రెసిడెంట్ తో పురస్కారాన్ని పంపింది ( ఆ దేశం నమ్రతకు కూడా జేజేలు) . పురస్కారాలతోఆయన్ని వెలకట్టలేము. ఈ అనంతపురం గడ్డ మీద పుట్టి ప్రజల రక్త మాంసాల తో సహా పీక్కు తింటున్న ఎందఱోరాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కడినించో వచ్చి పాతికేళ్ళుగా అకుంఠిత దీక్షతో సేవ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నఆయనను మనిషి అని ఎలా అనాలి? దేవుడు కూడా సరైన పదం కాదేమో! ఎందుకంటే నాకు కనిపించని ఆదేవుడు అనే వాడు నాకుతెలిసింత వరకు ఎక్కడా విద్య వైద్యం నీడ కల్పించి ప్రజలను భౌతికంగా ఏనాడు ఆదుకోలేదు.
గమనిక: మొదట ఆయన మహారాష్ట్ర లో సేవలు మొదలు పెట్టారు. అక్కడ ఫెర్రర్ సేవకు మతం రంగు పూసారు . అప్పుడేఆయన క్రైస్తవ సభ్యత్వాన్ని శాస్వతంగా రద్దు చేసుకున్నారు. ఇపుడు ఆయనకు ఏ మతము లేదు "మానవత్వం " తప్ప...
దయచేసి జీవని పూర్తి పోస్టింగులను చదవండి.
Join hands with...
JEEVANI
......FOR UNCARED





