మిత్రులారా జీవని స్థాపించినప్పటినుంచి అత్యధిక విరాళాలు అందిన నెల ఇదే. మొత్తం 88,750/- అందాయి. దీన్ని 1,00,000/- చేయడానికి ప్రయత్నిస్తున్నాము. జీవనికి బ్లాగర్లు ఇస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అలాగే జీవని విద్యాలయం ప్లానింగ్ ఎలా చేయాలా అని చర్చించే బృందం మన బ్లాగర్లే. వారి గురించిన వివరాలు సమయం వచ్చినపుడు తెలియజేస్తాము. స్థల సేకరణకు నానా తిప్పలు పడుతున్నాము. వారానికి మూడు రోజులు ప్లాట్ల వెంబడి తిరుగుతున్నాము. ఇక ఆదివారం వచ్చిందంటే టీం మొత్తం వెళ్తున్నాము. మరి ఎందుకో కలిసి రావడం లేదు. స్థలం సెట్ అవుతూనే నిర్మాణం ప్రారంభించాలన్నది మన లక్ష్యం. పిల్లల సేవలో మేమందరం ఎప్పటిలా కృషి కొనసాగిస్తాము. మీరు ఏ మంచి ఉద్దేశ్యం కోసం విరాళం పంపుతున్నారో దాన్ని తప్పక నెరవేరుస్తాము. దాతలు పంపిన సొమ్ములో నెల నెలా 1000/- మాత్రం ఆఫీస్ అసిస్టెంట్ కు ఇస్తున్నాము ఆపై ప్రతి రూపాయి పిల్లలకు చేరుతోంది.

మేము ఎల్లప్పుడూ మీ అందరి నైతిక మద్దతు మొదట కోరుకుంటాము. కొన్ని వందల మంది మా వెనుక ఉన్నారు అనే ధైర్యం మాకు గొప్ప టానిక్ లా పనిచేస్తుంది. ఆ తర్వాతే విరాళాలు. ముందు నుంచి దీన్ని నమ్ముకోవడం వల్లే ఫండ్స్ గురించి ఏ నాడూ ఆలోచించాల్సిన అవసరం రాలేదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ నెల స్కూల్ ఫీజు ఓ 20,000/- కడదాం అనుకుంటే ఎక్కడో ఒక దాత స్పందించి డబ్బు ఎడ్జస్ట్ అయ్యేది. అలాగే పండుగ వస్తోంది పిల్లలకు బట్టలు తీసి ఇచ్చి ఉంటే బావుండు అనుకుంటే ఎవరో ఒక దాత ముందుకు వచ్చేవారు. మరి స్థలం విషయంలో ఇలా ఎందుకు జరగలేదు అని మీరు అడగ వచ్చు :) దీనికి మాత్రం సమాధానం లేదు.


దాతలందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నాము., ఈ నెల విరాళాలు అందజేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

2000 - KARNA JAGAN MOHAN REDDY

100 - UMADEVI
100 - KRISHNA MURTHY
100 - SUGUNA
500 - D.SRINIVASULA REDDY
500 - PADMANBHA REDDY
500 - SANDEEP
13000 - KAVYA
5000 - SRINIVAS CHOWDARY
1000 - AVN KRISHNA MURTHY
1000 - B.RAMA RAO
2000 - KIRTHI VARDHAN NAIDU
15750 - RAJESH
25000 - KUMAR N
2000 - SHARMA
5000 - Sri & Smt LEKKALA
300 - SURESH REDDY
200 - SRI HARSHA
100 - PARAMESH
100 - MAHESH
200 - ABHILASH
100 - ANIL KUMAR REDDY
200 - AMARENDER REDDY
100 - SANTOSH
200 - RAM MOHAN NAIDU
200 - PRATHAP REDDY
200 - SATISH DHANUNJAYA
100 - SUDHAKAR REDDY
200 - RAMSESH
100 - KEERTI CWODARY
200 - PURNA CHANDRA RAO
5000 - AMAR FRIEND
200 - HANUMAN CHOWDARY
7500 - SRIT STAFF

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Can you please tell me how can I contribute for Jeevani ?

     
  2. jeevani Says:
  3. దుర్గా హేమాద్రిభట్ల గారికి,
    నమస్తే.
    మీ వితరణకు ధన్యవాదాలు.
    జీవని అకౌంటు వివరాలు తెల్పుతున్నాము. అయితే చిన్న విన్నపం. జీవనికి ఫారిన్ ఫండ్ క్లియరెన్స్ లేదు. కాబట్టి ఇండియన్ అకౌంట్ నుంచి మాత్రమే విరాళం పంపవలసి ఉంటుంది.
    దీని కంటే ముందుగా, జీవని గురించి ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే ఇవ్వగలము.

    ICICI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 043905000999 ANANTAPUR

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo